మగ బుద్ధి.

మగ బుద్ధి.

.

( by పసునూరు శ్రీధర్ బాబు,)

.

పెదవి మీదో

చుబుకం మీదో

చెక్కిలి మీదో

గెలాక్సీలు దాచిన కళ్ళ మీదో

తిరగేసిన సంధ్యాకాశం లాంటి

వీపు మీదో

నయాగరా ప్రవాహాలకు

నునుపెక్కిన భుజాల మీదో

నెమలి పింఛాలకు జన్మనిచ్చే

నడుం మీదో

వీధుల్ని మార్మోగించే

సంగీత సహారాల మీదో

ఇంకెక్కడెక్కడో

నిప్పు సెగల రెక్కలతో

వాలిన చూపు

ఓరకంటిపాపల్లో కలకలం కాకున్నా

కాకుండా పోతుందని

కాలిన రెల్లుగడ్డి పువ్వులా

తుప్పల్లోకి రాలిపోతుందని

మాడి మసైపోతుందని

నేననుకోను-

ప్రవాహంలోంచి గాల్లోకి ఎగిరిన

ఒకే ఒక్క చినుకు

ఏడు రంగులతో మెరిసిపోనూవచ్చు

వెన్నెలతో కలిసి

ముత్యమై మురిసిపోనూవచ్చు

క్షణికంలోనే ధన్యమైపోనూవచ్చు-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!