అమరం చదవని వానికి నేను అమరను - సరస్వతీ దేవి!
అమరం చదవని వానికి నేను అమరను - సరస్వతీ దేవి! . ‘అమరం చదవని వానికి నేను అమరను’ అని సరస్వతీ దేవి వచనంగా ప్రచారంలో ఉన్న 'నామలింగానుశాసనం' అనే నిఘంటువుసుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా భారత భూమిలో ప్రచారంలో ఉన్నది. . సంస్కృతం నేర్చుకొనే ప్రతి విద్యార్థి అమరం వల్లెవేయటం ప్రాథమికమని భావించబడిన మహా గ్రంథం ఇది. ఆయుర్వేద మహాశాస్త్రవేత్త ధన్వంతరి కూడా ఈ నిఘంటువును రచించాడంటే ఈ నామలింగానుశాసనం యొక్క విశిష్టతను తెలుసు కో వచ్చు. . ’నామలింగానుశాసనం’ రచించిన అమరసింహుని పేరు మీదనే ఈ నిఘంటువు అమరకోశం అని ప్రాచుర్యం పొందింది. పదిహేను వందల సంవత్సరాల క్రిందటే చైనా భాషలోనికి కూడా అనువాదం పొందిన నిఘంటువు ఇది. అమరకోశం తనకు పూర్వం రచింపబడిన నిఘంటువుల నడుమ మహోజ్జ్వలమై నాటికీ నేటికీ ప్రకాశించే కోశరత్నం. అమర కోశానికి సంస్కృత ప్రచారానికీ శాశ్వతమైన అవినాభావ సంబంధం ఏర్పడింది. . ఈనాటికీ ప్రతి సంస్కృత విద్యార్థి ’యస్యజ్ఞాన దయా సింధో’ అనే ప్రార్థనా శ్లోకంతో మొదలుపెట్టి సంస్కృత అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ విధంగా అమరకోశం సంస్కృత వాఙ్మయంలో శాశ్వత స్థానాన్ని సంపాది