బుడుగో ! బుడుగు !!

బుడుగో ! బుడుగు !!
.
గిడుగు ఉత్తరధ్రువం పర్యటనకు వెళ్ళొచ్చాడు.
మర్నాడు సాయంత్రం తన స్నేహితులతో యాత్రా విశేషాలు చెబుతున్నాడు.
"అక్కడ ఎంత చల్లగా ఉందంటే....మేం సిగిరెట్ ముట్టించడానికి అగ్గిపుల్ల వెలిగించగానే
మంట గడ్డ కట్టుకుపోయేది ఎంత ఊదినా ఆరేది కాదు" అని ఆగాడు.
.
ఇంతలో పక్కనే ఉన్న మన బుడుగు "అందులో గొప్పేం ఉంది. మేం వెళ్ళినప్పుడైతే పరిస్తితి మరీ ఘోరంగా ఉండెది. మా నొట్లోంచి శబ్దం రావడం ఆలశ్యం, మాటలన్నీ గడ్డ కట్టుకుపోయేవి.
ఆ తర్వాత మా తిప్పలు తిప్పలు కావు.
ఆ మాటలన్నింటినీ జాగర్తగా ఏరుకుని వెచ్చబెట్టే దాకా ఎవరు ఏం మాట్లాడారో తెలిసేది కాదు"
.
అని చెప్పాడు ఇంకాస్త బడాయిగా

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!