ప్రేమ మత్తు !

ప్రేమ మత్తు !

.

గమ్మత్తేమిటంటే ప్రేమ మత్తు గురించి ఎవరి అనుభవాలు వారివి.

అయినప్పటికీ పాపం వెర్రివాడు ఆ జమిందార్ బిడ్డ దేవదాస్ గురించి మూడు నాలుగు తరాలుగా అంతా చెప్పుకునేవారే.

పొరపాట్న పాట్నాలోగానివ్వు, భవానీపాట్నాలో గానివ్వు ఎవడో భగ్న ప్రేమికుడైపోతే 

వాడి మొహానికి ‘పాపం దేవదాస్’ అనే లేబిల్ అంటించేస్తాం, 

ఏదో ఇంక వాడు మిగతా జీవితం అంతా తాగుతూనే గడిపేస్తాడని. వాడు ఎంచక్కా చేతులూ నీతులూ దులిపేసుకునీ ఉంటాడని ఎవరికెరుక? 

కాబట్టి ప్రేమకీ, తాగుడుకీ నో లింకనుకో. ఒకసారి లొట్ట వెయ్యగానే ఇంక మరీమరీ చవులూరించి ఏకంగా ఇంట్లో ఫ్రిజ్ లో దాచుకునేంత ధైర్యాన్నిస్తుంది ఆ వ్యసనం.

‘పాపా నా కెందుకు స్వరాలు 

సాపానీసా, పీపాకే నేను బానిస’

అని రాగం అందుకుంటాడు కూడా.

x

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!