జీవన గొడుగు!

జీవన గొడుగు!

(రాజేందర్ గణపురం )

. ...............

అడుగులో అడుగేసి

ఏడడుగులు నాతో వేసి..

తాళి కోసమే తలవంచి

నా..తలను పదిమందిలో పైనుంచి..!

ఏడు జన్మలంటూ ఈ జన్మనుండే

చిటికన వేలు బట్టి..!

అర్ధాంగి వై అగ్ని చుట్టు ప్రమాణంచేసి

నాజన్మతో జతగలిపి ఈజన్మంత జత నిలిచి

నా ఆనందానికి అర్దాంగివై

నా చిరునవ్వు కు ప్రమిదవు నీవై....

కష్ట నష్టాలలో కన్నీటికి నేస్తానివై

సుఖ దు:ఖాలలో సుధారాశిపై....!

ఆకలికి అమ్మవై నడిజామున కోమలివై

నా కోపానికి ఓపిక నీదై..!

కష్టపెట్టినా ఇష్టమే నంటు

నీ కంటా తడి వచ్చినా ఇంటిగుట్టు ఇల్లంటు..!

నన్నునన్నుగా ఇన్నేల్లు నన్నంటి వెన్నంటి

సాదక బాదకలో సరి జోడువై..!

నీవు ఆనందిమచినది ఎంతో

నాకు తెలియదుగాని..!

చివరిగా నీకు నే నేమిచ్చుకోను చెలి

ఈ గొడుగు క్రింద చోటు తప్పా....?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!