మిత్ర బేదం లో నావుడు , అనవుడు..ఎవరు

తెలుగు లో బాష ప్రవీణ చేసాడుట ఒక కుర్రవాడు.... 

అతను నన్ను అడిగిన ప్రశ్న.. 

పరవస్తు చిన్నయ సూరి గారి మిత్ర బేదం లో నావుడు , అనవుడు..ఎవరు వారితో 

కధకు సంబధం ఏమిటి నాకు తెలియుట లేదు.. మీరు వివరింప గలరా...

అంటే నేను అవాక్కు అయ్యెను... 

Sambhara Venkata Rama Jogarao.గారి చమత్కార సమాధనం 

ఆర్యా, శుభోదయ నమస్కారములు తెలుగు పండితుల వారి ప్రశ్నకు సమాధానము ఇది నావుడు, అనవుడు కరటక దమనకుల బిడ్డలు.

నావుడు కరటకుని కుమారుడు అనవుడు దమనకుని పుత్రుడు.

వీరిరువురు మారీచ సుబాహువుల ముని మనుమలు 

కరటకుడి కొడుకు నావుడు నావుడి భార్య కింతు 

దమనకుడి కొడుకు అనవుడు అనవుడి భార్య పరంతు 

నావుడు కింతు ల సంతానము పశ్చాత్ 

అనవుడు పరంతు ల సంతానము భవతి భవంతు 

ఇంకా ఇంకా చాలా వుంది లెండి.

జోగారావు

Comments

  1. చాలా చక్కగా ,చమత్కారంగా వంశ క్రమాన్ని వివరించిన శ్రీ జోగారావు గారికి ,మాతో పంచుకున్న మీకు చమత్కారాభినందనలు.భవిష్యత్తులో ఈ భాషా ప్రవీణ గారి శిష్యులు ......తెలుగు భాష భవిష్యత్తు ????????? మొత్తం కరారావుడు చుట్టేస్తారేమో ????? సుమన్ లత

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!