తిక్కన కవిత్వమంటే!

తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి .!

.

ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి 

కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న 

ఆ సైన్యాన్ని చూసి అనే మాటలివి.

"భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు; దుర్యోధన

గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు; శస్త్రాస్త్ర జా

లోష్మ స్ఫార చతుర్విధోజ్వ్జల బలాత్యుగ్రం; బుదగ్ర ధ్వజా

ర్చిష్మత్వాకలితంబు; సైన్య మిది; ఏ జేరంగ శక్తుండనే!."

.

దీన్లో కురు సైన్యాన్ని నాలుగు భీకరమైన సమాసాల్తో మన కళ్ళ ఎదుట చూపిస్తాడు ఉత్తరుడు..

(భయసైన్యంయెంతభయంకరమైనదో దుష్కర ప్రాసతోను, సుదీర్ఘములైన కఠినాతి కఠినములయిన పదాలతో కూడిన సమాస రచన తోను, వీర రసోద్దీపనమైన ఆపభటీ వృత్తి తోను (వ్యంగ్యంగా) భయానకరస పోషకమగు శబ్ద విన్యాసముతోను చక్కగా వర్ణించాడు.అవి గమనించటానికి మనలోచనాలు చాలవు. ఆలోచనా లోచనాలు కావాలి. అదే మరి తిక్కన కవిత్వమంటే!)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!