రాఘవరామా! (పోతనామాత్యుడు)

శ్రీమద్భక్త చకోరక

సోమ! వివేకాభిరామ! సురవినుత గుణ

స్తోమ! నిరలంకృతాసుర

రామా సీమంతసీమ! రాఘవరామా!

(పోతనామాత్యుడు)

టీకా:

శ్రీమత్ = గొప్పవారైన; భక్త = భక్తులు అను; చకోరక = చకోరపక్షులకు; సోమ = చంద్రుడా; వివేక = వివేకమువలన; అభిరామ = సుందరమైనవాడా; సుర = దేవతలచే; వినుత = పొగడబడుచున్న; గుణ = గుణముల; స్తోమ = సమూహముగలవాడా; నిరలంకృత = నష్టమైన అలంకారములు గల; అసుర = రాక్షస; రామా = స్త్రీల; సీమంత = పాపిటలు; సీమ = ప్రాంతము కలగజేసినవాడా; రాఘవ = రఘువంశమున జన్మించిన; రామా = రాముడా.

భావము:

భక్తులు అనెడి చకోరక పక్షులకు చంద్రుని వంటివాడా! వివేకముతో విలసిల్లు వాడా! దేవతలచేత పొగడబడిన సుగుణములు గలవాడా! 

(రాక్షసులను సంహరించి) రాక్షస స్త్రీల పాపిట సింధూరాలంకరణలు తొలగించిన వాడ! రఘు వంశోద్భవుడవైన శ్రీరామచంద్రప్రభూ! 

అవధరింపుము.

(ఈ పద్యం నాకు కొంచెం ఖేదం కలిగించింది...రాక్షస స్త్రీల మాంగల్యంహరించినరామా అని పోతానగారు సంభోదిస్తారు..)

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!