- -<@ **శుభాకాంక్షలు** @>-- ____________________________________________ స్వాతంత్ర్యం రాక ముందు తెల్ల వాళ్ళు దోచుకున్నారు.. వచ్చినాక నల్లవాళ్ళు (సొంత వాళ్ళే) దోచుకుంటున్నారు.. కాబట్టి స్వాతంత్ర్యం వచ్చినట్టా ?? లేనట్టా??? స్వాతంత్ర్యం ఎందుకొరకు పోరాడి తెచ్చుకున్నామో.., స్వాతంత్ర్యం కోసం ఎందుకు అంతలా తపించామో , అదే నేరవేరనపుడు నామమాత్రపు స్వాతంత్ర్యం వచ్చీ ఏం ప్రయోజనం??? --- ఇన్నాళ్ళూ అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయ్ అంటూ గొంతులు చించుకుని వేర్పాటు వాదానికి పునాదులేసి రాష్ట్రాన్ని విడగొట్టి , రాష్ట్ర ప్రయోజనాల్ని చెడగొట్టి , సొంత రాష్ట్రం అంటూ గొడవ చేసి సాధించుకుంటున్న సోదరులకి శుభాకాంక్షలు. ఇప్పటి వరకూ మిమ్మల్ని రెచ్చగొట్టిన మీ ప్రతినిధులే రేపు మిమ్మల్ని దోచుకోకుండా చూసుకోండి.. ఆత్మార్పణలతో , సొంతం చేసుకున్న ఫలితాన్ని అనుభవించండి. జాగ్రత్తగా చూసుకోండి..., అక్రమాలను, అన్యాయాన్నీ పెరగనివ్వకండి.. వచ్చేస్తుందీ, వచ్చేసింది.., అంటూ తృప్తి పడకుండా, వచ్చినదాన్ని కాపాడుకోవటంలో అభివృద్ధి చేసుకోవడంలో శ్రద్ధ చూపండి. ఎలాగో మా నమ్మకాలపై , కలిసుండాలనే ఆశలపై నీళ్ళ...