Posts

Showing posts from August, 2014

కుంచెకు తర్పణం...

Image
బాపు మరణం బొమ్మకు శోకం గీతకు విరామం కుంచెకు తర్పణం
Image
ఈ రోజు ఒక శోక రాత్రి.... బాపును తన దేగ్గెరకు పిలిచిన....చాల పెద్దమ్మ...

ధర్మం అంటే ఏమిటి ? న్యాయం అంటే ఏమిటి ?

Image
ధర్మం అంటే ఏమిటి ? న్యాయం అంటే ఏమిటి ? . ఈ కాలంలో న్యాయం అంటే చట్టబద్ధంగా చేసేదని, ధర్మం అంటే నైతికతతో చేసేదని చెబుతున్నారు, అన్వయించు కొంటున్నారు.  నా అభిప్రాయం ఏమిటంటే మనం 'ధర్మం' గా వ్యవహరిస్తే 'న్యాయం' చేసినట్టు,  అదే 'న్యాయం బద్ధం' అని. 'ధర్మం' లేని చోట'న్యాయం' లేనట్టే.

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము నుండి.

Image
ఇది  నా  బ్లాగు  లో  నా  1,000 వ పోస్టింగు.. దీనిని  నా  గురువు  చిరంజీవి  భావరాజు  పద్మిని కి  అంకితం... అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము నుండి. ఒక ఊరిలో గౌతమి అను బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఒక రోజు పాము కరిచి చనిపోయాడు. అది చూసి ఆమె దుఃఖించ సాగింది. అంతలో అది చూసిన బోయవాడు ఆ కుర్రాడిని కరిచిన పామును పట్టి తెచ్చి " అమ్మా ! ఇదిగో నీ కుమారుడిని కరిచిన పామును పట్టి తెచ్చాను. దీనిని ఏమి చెయ్యమటావో చెప్పు. తలపగులకొట్టి చంపమంటావా ! లేక నిలువునా చీల్చి చంపమంటావా ! నీవు ఎలా చెప్తే అలా చేస్తాను " అన్నాడు. గౌతమి " అన్నా ! ఈ పామును విడిచి పెట్టు " అన్నది. బోయవాడు " అమ్మా ! ఇది నీ కుమారుని చంపింది కదా! " అన్నాడు. గౌతమి " అన్నా! విధివశాత్తు ఈ ఆపద వచ్చింది. నాకుమారుడు చనిపోయాడు. అందుకు దుఃఖించడము సహజమే అయినా ! దానికి కారకులు అయిన వారిని చంపడం అధములు చేసే పని. ఉత్తములు , ధర్మపరులు ఆ పని చెయ్యరు. జరిగిన ఆపదను వెంటనే మరచి పోతారు. అన్నా ! నీవు ఆ పామును చంపినంత మాత్రాన నా కుమారుడు బ్రతుకుతాడా ! దానిని విడిచి పెట్టు " అన్నది. బోయవాడ

సీతా రాముల కల్యాణం .....

Image
స్వయంవరంలో పెట్టిన పోటిలో గెలిచి రాముడు సీతకు భర్తగా అర్హత పొందాడు. . ఆ తరువాత ఆ వార్త ఆతని తండ్రి దశరధునికి చెప్పటం, రాముని తల్లిదండ్రులు . , దశరధుని మంత్రిమండలి ఆమోదంతోనే సీతా రాముల కల్యాణం జరిగింది. . అంతే కాని రాముని లేదా విశ్వామిత్రుని సొంత నిర్ణయంతోనే వివాహం జరగలేదు. . సీత సోదరి ఊర్మిలను లక్ష్మణుడు, జనకుని సోదరుడు కుశధ్వజుని కుమార్తలైన  . మాండవిని భరతుడు, శ్రుతకీర్తిని శత్రుఘ్నుడు వివాహ మాడిరి.....

వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము.

Image
వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము.  . ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్ధించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్ధనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది. . తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌. . మరొక పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది. . తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా! . ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకము. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సం

దరహాసం

Image
దరహాసం ఆ దరహాసం కోసం  నీ అధరం ఎంతకాలం తపసు చేసిందో  ఆచిరునవ్వును ధరించాలని  నీ పెదవి ఎంతగా ఉబలాట పడిందో  అక్కడ తడి పొడి తపనలపై  నీరెండ పడి ఒక హరివిల్లు విరిసింది  ఆ రంగుల వేదిక పైన నా చూపులు ముడివడి  నాలో విరిజల్లు కురిసింది  ఆ మెత్తని పానుపు పైన  మత్తుగా గమ్మత్తుగా ఉన్నట్టుంది ఆ మందహాసం ఎంత హాయిగా శయనించింది x

శ్రీ శ్రీ గారి 'అగ్గి పుల్ల '

Image
శ్రీ శ్రీ గారి 'అగ్గి పుల్ల ' నువ్వేదో ప్రభంజనం  సృష్టిస్తావనుకున్నాను గాని  ఇంకా తడి ఆరని  పసుపు పారాణి పైన నీ ప్రతాపం చూపిస్తావనుకోలేదు నీ మేధా సంపత్తితో  ఈ జగతిని వెలిగిస్తావనుకున్నాను గాని అతి గతి లేని అమాయకుల గుడిసెల్ని పరశురామ ప్రీతి చేస్తా వనుకోలేదు నీ ఆకారం చూసి  రాకెట్లా దూసుకు పోతావని  కమ్ము కొస్తున్న చీకట్లను చెరిపేస్తావని భ్రమించాను నల్లని పెదవులపై న పడి దొర్లే  సిగరెట్ ఎంగిలి కోసం పరితపిస్తా వనుకోలేదు బీడీ ముక్క మొహంలో  అద్దం చూచుకొంటూనో  బొగ్గుల కుంపటి ముంగిట్లోనో  తూలి పడ్తూ ఉంటె  దుశ్శాసనుని రొమ్ము చీల్చేదెప్పుడు  దురాగతాల తలరాత మార్చే దెప్పుడు  నిన్ను ఆకాశానికెత్తిన ఆ మహాకవి ఆకాంక్ష నెరవేర్చే దెప్పుడు ఆ చిన్ని గుడారాన్ని వీడి  గుడి గోపురాల వైపు నడిచిరా  వెలుగు జాడ లేని  చీకటి ప్రాకారాల వైపు కదలిరా \ అగ్నివై, ఆగ్రహోదగ్రవై  అన్యాయాల్ని అక్రమాల్ని అరికట్టగా నీతి లేని, నియతి లేని  నియంతల భవంతుల్ని  నిలువునా దహించగా ............

ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అనే నానుడి వెనుక ఉన్న కథ

Image
ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అనే నానుడి వెనుక ఉన్న కథ మహాభారతంలోని కుంతీ దేవి పాత్ర చాలా చాలా గొప్పది. మొత్తం మహాభారత కథ కుంతీ దేవి చుట్టూ నడుస్తుందని కూడా చెప్పవచ్చు..  దుర్వాసమునికి చేసిన శశ్రూషలకు మెచ్చి ముని కుంతీ దేవికి ఒక వరమిస్తాడు... అది ఏమిటంటే తన ఇష్టమైన దైవ అనుగ్రహంతో కన్యత్వానికి భంగం కలుగకుండా కుమారుడిని పొందగలిగే మంత్రం..  ఒక రోజు ఈ మంత్ర ప్రభావం ఎలాఉందో పరీక్షించదలచి మంత్రం జపించి సూర్యదేవుని వేడుకుని.. సూర్యుని అనుగ్రహం వలన కర్ణుడిని పొందుతుంది... అప్పటికి కుంతీ దేవికి వివాహం కాదు.. అందువలన కన్యాగర్భం తనకు అవమానాలను మిగిలుస్తుందని భయపడి.. సహజకవచకుండలాలతో జన్మించిన కర్ణుడిని ఒక పెద్ద పెట్టెలో ఉంచి రత్న, మణిమాణిక్యాలతో గంగానదిలో వదిలివేస్తుంది.. చివరికి యుద్ధంలో కర్ణుడు మరణిస్తాడు..  యుద్ధంలో మరణించిన వారికి ధృతరాష్ట్రుడు.. ధర్మరాజు ఎవరికి సంబంధించిన వారు తమ వారికి పిండప్రథానాలు చేస్తే కర్ణుడికి ఎవరూ పిండప్రధానం చేయరు.. ఇందుకు కూడా కుంతి చాలా దుఃఖిస్తుంది.. అప్పుడు ధర్మరాజు ముందు బయట పడుతుంది కర్ణుడు తన కుమారుడని..  జరిగిన అన్ని అనర్థాలకు బాధపడిన

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం... .

Image
వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం... . ‪#‎గణేశ‬ చతుర్థీ రోజున నూనె తగలని వంట చేసి, గణపతికి నివేదన చేసి భోజనం చేయాలంటోంది # . ఇది దక్షిణాయనం, వర్షాకాలం. సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరించడంతో మనలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. అరుగుదల, ఆకలి మందగిస్తుంది, చికాకుగా అనిపిస్తుంది, మలబద్దకం పెరుగుతుంది. .‪#‎గణపతి‬ ఇష్టమైనవి కుడుములు. కుడుములు ఆవిరి మీద ఉడికించి తయారుచేస్తారు. # . వర్షాకాలంలో వ్యాధులు ప్రబలడానికి ఒకానొక ముఖ్యకారణం ఆహారం. ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రావణంలో కొద్దిగా పసుపు కలిగిన నీటిలో నానబెట్టిన శెనగలను మొలకెత్తాక స్వీకరిస్తారు. ఇది శ్రావణమాసానికి తగిన ఆహారం కాగా, ఈ భాధ్రప్రదమాసంలో ఉడికించిన ఆహారం అత్యంత శ్రేష్టం, ఆరోగ్యకరం. అందుకే మన పెద్దలు ఈ సమయంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారం అయితే మహాశ్రేష్టమని, ఆరోగ్య ప్రదాయకమని గుర్తించి గణపతికి కుడుములు సమర్పించమన్నారు.  గణపతి చవితి ఒక రోజు ముందు వచ్చే ఉండ్రాళ్ళ తద్దే నుంచి గణపతి నవరాత్రులలో ప్రతి రోజు ఈ కుడుములు భుజించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. . ‪#‎అందుకే‬ మన వినాయక చవితి రోజు స్వామికి నే

శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'

Image
శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ' అనుకున్నాను అధర సౌందర్యం చూచి  ఆడంబరం ఆహార్యం చూచి  నీ బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చటే అని హరివిల్లు రంగుల్ని  వలువలుగా చుట్టుకున్న నువ్వు  మరు నిముషంలో  మటుమాయం ఔతావని అయితే అన్నన్నా !!..  నీ భాగ్య మేమని వర్ణించను  ఎన్ని లావణ్యాల్ని స్పృశిస్తావో  ఎన్ని మాలిన్యాలు నిర్ములిస్తావో ఎన్ని కాంతి కేరింతలని మోసుకోస్తావో  ఎంతహాయి వెల్లువని తరలించు కోస్తావో అరిగి పోయి కరిగిపోయి తరిగిపోయి  నివురై ఆవిరై కనుమరుగై పోతావు ఒక్క క్షణమైతే నేమి  వెన్నెల ముద్దగా వెలిగి  ఒక్క నిముసమైతే నేమి  వన్నెల వాకిళ్ళు కలయ తిరిగి  వేయి వసంతాల సోయగాన్ని సొంతం చేసికొన్న సౌగంధికావనమా ! నీ జీవన రాగానికి జేజేలు  నీ అసమాన త్యాగానికి జోహారు

ఆటో వాడికీ మనసుంటుంది .... ...

Image
ఆటో వాడికీ మనసుంటుంది .... ....................... ...... ఒక సారి హైదరాబాద్ నుంచి సికిందరాబాద్ కు ఆటో లో వెళుతున్నా..ముందే చెప్పాను కదా హైదరాబాద్ ఆటో వారిని నమ్మ వద్దు అనే ఆచారం పై నాకు పూర్తి నమ్మకం ఉంది. . కవాడిగూడ ప్రాంతం నుంచి వస్తున్నాను . అటునుంచి బన్సిలాల్ పేట స్మశాన వాటిక ముందునుంచి వెళితే బైబిల్ హౌస్ , సికింద్రాబాద్ వస్తుంది . ఆటో ఆతను అలాకాకుండా కనీసం ఒక కిలోమీటర్ దూరం పెరిగే విధంగా జీరా మీదుగా కింగ్స్ వే నుంచి సికింద్రాబాద్ కు వస్తున్నాడు.... ఆటోలో మా అమ్మకూడా ఉండడం తో ఆటో వాడి ని అలా ఎందుకు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావని నిలదిశా ..  వాడు మీరు ఈ రూట్ లో రోజు వెళతారు కదా మీటర్ ఎంత అవుతుందో అంతే ఇవ్వండి దూరం పెరగడం వల్ల అదనంగా డబ్బు అవసరం లేదని చెప్పాడు. నాకు రూట్ తెలుసు కాబట్టి దారికి వచ్చావు తెలయక పొతే మోసం చేసేవాడివే కదా అని ప్రశ్నించా .. ఎదుటి వాడిని నిలదీయడం లో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు ..సాధారణంగా ఆటో డ్రైవర్స్ వాళ్ల డ్రైవింగ్ లానే రాష్ గా ఉంటారు కాని ఆతను మాత్రం నిర్వికారంగా ఉన్నాడు . బహుశా అందువల్లనేమో నా ఉపన్యాసం ఎలాంటి అడ్డు లేకుండా సాగింది. నా ఉపన్యా

అణా - కానీ ఈ పేర్లు గుర్తున్నాయా!

Image
అణా - కానీ ఈ పేర్లు గుర్తున్నాయా!  అణా, కానీలు 1957 కి ముందు ఉపయోగించిన నాణాలు.  రూపాయకు 16 అణాలు, 64 కానులు.  రాధాకృష్ణన్ గారు పదహారు అణాల ఆంధ్రుడు అంటే 100% అన్నమాట. .. వాడు కానికి కొరగాడు. వాడు అణాకాని వెధవ. ఇల్లాంటి వాడుకలు ఉండేవి.  ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? అంటే ఇవి సంస్కృతపద జన్యాలు అనిపించాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం చదువుతూంటే ఆ అనుమానం వచ్చినది. ఆదాయపు పన్నే నల్లధనమనే పదార్థాన్ని ఉత్పత్తిచేసినదని నా అనుమానం. మౌర్యుల కాలంలో పన్నుల విధానం ఎలా ఉండేది అన్నకుతూహలం.  అప్పుడు విదేశీ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ఉండేది.  దానికి ఈ వస్తువుకు ఇన్ని పణాలు అని శుల్కము (పన్ను) ఉండేది.  అది ఒక రాగి నాణెం. పణంలో నాలుగవభాగం కాకిని.  కాలక్రమంలో పణాలు అణాలు, కాకినీలు కానీలు అయ్యాయని నాఉద్దేశ్యం. —

ఇద్దరు చంద్రులకు ఒక నూలు పోగు...

Image
ఇద్దరు చంద్రులకు ఒక నూలు పోగు... (దా ) ఋణ మాఫీ ......కృతజ్ఞతలు గా ... . కందము . అప్పిచ్చువాడు బ్యాంకరు ఆప్పును తిరిగిచ్చువాడి యవసరమేలా  అప్పులు మాఫీ అనుచును  తిప్పలు పెట్టించు వాడు తెలివిగలోడే....... . (కవిత ...Jagannaath Iragavaram garu.)

బాగుపడితే వచ్చేది అనుభవం కాదు;

Image
బాగుపడితే వచ్చేది అనుభవం కాదు; చెడిపోతే వచ్చేదే అనుభవం. . ఉద్యోగం ఉంటే సంపాదన వస్తుంది.. కానీ సంస్కారం రావాలి అని లేదు. .. . అవినీతికి ఆకలి ఎక్కువ ... ఆకలికి ఆరాటం ఎక్కువ .. . యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు ... ఓడించడం ... దేవుడు మనుషులని ప్రేమించడానికి, వస్తువులని వాడుకోవడానికి ఇచాడు.  మనం మనుషులని వాడి, వస్తువులని ప్రేమిస్తున్నాం.

ప్రేమించే వాడికి భయం ఉండకూడదు ...

Image
ప్రేమించే వాడికి భయం ఉండకూడదు ...  భయపడేవాడు ప్రేమించ కూడదు ...  భయపడుతూ ప్రేమించే వాడు ... బాధపడ కూడదు.

శుభోదయం...

Image
శుభోదయం... గత కొద్ది రోజులుగా ఆయన కనపడటం లేదేంటండీ....ఎక్కడికైనా వెళ్లారా? ఆ ......మొన్నీ మధ్యనే డిప్రషన్ లోకి వెళ్లి...ఓ నాలుగు రోజులు అక్కడ గడిపి...ఇదిగో నిన్న సాయింత్రమే వచ్చారు.... మీకు ఈ రోజు కనపడవచ్చు... (ఫేస్ బుక్ లో ఫలానా వాడు లైక్ కొట్టలేదు, రాష్ట్రం లోో కరెంట్ కొరత వరకూ మనకు సంభందం లోని విషయాలు గురించి అతిగా ఆలోచించి...బాధపడి ఏదో ప్రక్క వూరు వెళ్లివచ్చినంత ఈజీగా డిప్రెషన్ లోకి వెళ్లే వారిని ఉద్దేశించి...అయ్యా....జనాల్లోకి రండి...రిప్రెష్ అవ్వండి)

సుత్తుల్లో చాలా రకాలున్నాయి.

Image
సుత్తుల్లో చాలా రకాలున్నాయి.  . ఒకడు ఠంగు ఠంగుమని గడియారం గంట కొట్టినట్లు సుత్తేస్తాడు. మీ నాన్న గారిలాగా . హ హ హ. దాన్ని ' ఇనప సుత్తి ' అంటారు. అంటే ' ఐరన్ హేమరింగ్ 'అన్నమాట. ( సుత్తివీరభద్రరావు ) . ఇంకోడు సుత్తేస్తున్నట్లు తెలియకుండా మెత్తగా వేస్తాడు-రబ్బరు సుత్తి. అంటే ' రబ్బర్ హేమరింగ్ ' అన్నమాట. . ఇంకోడు ప్రజలందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు - ' సామూహిక సుత్తి ' దీన్నే మాస్ హేమరింగ్ అంటారన్నమాట. అంటే రాజకీయ నాయకుల మీటింగులూ ఉపన్యాసాలు ఈ టైపు.  . పోతే ఇంకో టైపుంది. మీ నాన్నగారు నాకు సుత్తేద్దామని వచ్చారనుకో, నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాననుకో- అహ, ఉత్తినే అనుకుందాం. ఇది జరిగే పని కాదనుకో. దాన్నే ఎదురు సుత్తి అంటారు. అంటే ' రివర్స్ హేమరింగ్ ' అన్నమాట.  . ఇలా చెప్పుకుంటూ పోతే, నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా. అంటే ' ప్రొలాంగ్డ్ హేమరింగ్ 'అన్నమాట.  . వెళ్ళమ్మా వెళ్ళు, నీ పని చేసుకో. "

"మీలో ఎవరైనా నా మాతృభాష ఏదో చెప్పగలరా?"

Image
ఒకరోజు శ్రీ కృష్ణదేవరాయలు కొలువుకు ఒక నర్తకి వచ్చి, "మహారాజా! నేను 9 భాషలలో పాడుతూ, లయబద్ధంగా అడగలను... మీ అష్టదిగ్గజాలలో ఎవరైనా సరే నా మాతృభాష ఏదో చెప్పగలరా?" అని సవాల్ విసిరింది.. సరే అని రాజుగారు నృత్య ప్రదర్శనకి ఏర్పాటు చేయించారు... కాసేపటికి నృత్య ప్రదర్శన పూర్తి అయింది...  "మీలో ఎవరైనా నా మాతృభాష ఏదో చెప్పగలరా?" అని  ఆ నర్తకి ప్రశ్నించగా.. అందరూ తెల్ల మొహం వేసారు... రాజు గారు మన తెనాలి రామకృష్ణుడి వైపు చూసారు... రామకృష్ణుడు " నాకు ఒక పది నిమిషాల సమయం కావాలి, అలా తోటలోకి వెళ్లి వచ్చి సమాధానం చెపుతాను ప్రభూ!." అని చెప్పి...బయటకు వెళ్తూ నర్తకి కాలు తొక్కాడు... వెంటనే నర్తకి "idiot,are you blind? manner less fellow " అని తిట్టింది ... వెంటనే రామకృష్ణుడు "ప్రభూ! ఈమె మాతృభాష తెలుగు" అని చెప్పాడు.. "అయ్యబాబోయ్, ఎలా కనిపెట్టారండి" అని విస్మయానికి గురైంది ఆ నర్తకి... ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడితే,తన మాతృభాష తెలుగు అని ఎలా కనిపెట్టావ్ అని రాజు గారు కూడా అడిగితే, "సహజంగా అందరు బాధలో,కోపంలో తమ మాతృభాషలో

ఊరి భావి....దామెర్ల గారి చిత్రం.

Image
ఊరి భావి....దామెర్ల గారి చిత్రం.

Balay Ammayilu Songs - Gopala - NTR - Savithri

M.L Vasanth kumari alog with P.Leela a very rare combition.... Very excellent song...Still looks fresh... From a nice compettion

నట శిరోమణి.. 'సావిత్రి'

Image
నట శిరోమణి.. 'సావిత్రి' . అభినయానికి చిరునామా, నటి అనే పదానికి పర్యాయ పదం. ప్రతీ పాత్రకు ప్రాణం పోసే అభినయ కౌసలం. వెరసి ఆమె వెండితెర రాణి.  మహానటిగా పేరు సంపాధించి అశేష వాహిన అభిమానులను సొంత చేసుకున్న నట శిరోమణి మహానటి 'సావిత్రి'.  ఎన్ని తరాలు మారిన తెలుగు సినిమాల్లో ఆమె నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది.  ఆమె అభినయం, నటనలోని వైవిధ్యం చిత్ర రంగంలో తిరుగులేని నటిగా నిలబెట్టింది

ఘటోత్కచుడు అంటే రంగారావే...

Image
ఘటోత్కచుడు అంటే రంగారావే... . "అష్టదిక్కుంభికుంభాగ్రాల పై మన కుంభధ్వజము గ్రాల చూడవలదె,  గగనపాతాళలోకాలలోని సమస్త భూతకోటులు నాకె మ్రొక్కవలదె, ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదె, హై హై ఘటోత్కచ! జయహే ఘటోత్కచ! యని దేవగురుడె కొండాడవలదె, ఏనె యీ ఉర్వినెల్ల శాసింపవలదె ఏనె యైశ్వర్యమెల్ల సాధింపవలదె , ఏనె మన బంధుహితులకు ఘంతలన్ని కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదె!"

మల్లెతోరణల మంటపమందె కనులు మనసులు కలియునులె

Image
మల్లెతోరణల మంటపమందె కనులు మనసులు కలియునులె కలసిన మనసులు కలరవములతో జీవితమంతా వసంతగానమౌనులే x

కృష్ణ జన్మాష్టమి,

Image
కృష్ణ జన్మాష్టమి. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి  హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.  శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు.  చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. ..

Kayani Gauri Kasibhtla గారి .ఒక మంచి సేకరణ... .

Image
Kayani Gauri Kasibhtla గారి .ఒక మంచి సేకరణ...  . స్వాతంత్రోద్యమ సమరం సాగుతున్న రోజుల్లో దేశ వ్యాప్తం గా ఉద్యమ గీతాలూ,కవితలూ.పద్యాలూ వెలువడి నరనరాల్లో  ఒక స్పూర్తిని,దీక్షని కలిగేలా చేసాయి.. అప్పట్లో ఎందరో తెలుగు కవులు పద్యాలను రచించారు..  వారిలో బలిజే పల్లి లక్షీకాంతం .మాధవపెద్దిబుచ్చిసుందర రామా శాస్త్రి,గరిమెళ్ళ సత్యనారా యణ గారు ఇలా ఎందరో.....వీరి ప్రచారగీతములుపాడనీ నాయకుడు,యువకులు వినిపించని కాంగ్రేసు సభలే ఉండేవి కావట..... అందులోంచి నూట నలుబది నాల్గు నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు ;మమ్ము పాట పాడ వద్దంటాడు మమ్ము;టోపీ తీసి వీపున బాదుతాడు'' . అంటరానివరెవరో..కాదు.మా వెంట రానివారే అనే గేయం సీమ గుడ్డలు వీడి..మీరిక క్షేమ మొందండి పరదేశ వస్త్రములె బ్రహ్మజెముడు వలె వ్యాపించే..దాని నరకేడి ఖడ్గ ధార రాట్నమే ననెను . బ్రిటీష్ వారి పన్నువిధానమును వ్యతిరేకిస్తూ... ఉప్పు పన్ను,పప్పుపన్ను,ఊరికెలితే పన్ను ,కొప్పు కాస్త దేముడికి మొక్కుకుంటే పన్ను . అంటూ ఎగతాళి చేసేవారట దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ' రాం భజన కీర్తనలు'చమత్కార ధోరణిలో సాగిన

Guppedu Manasu Movie | Mouname Nee Bhasha Video Song | Sarath Babu,Sujatha

Image
మూగవాళ్ళ హావభావాలకంటే మాటలొచ్చిన వాళ్ళ మనోభావాలను చదవటం కష్టం. ఎందుకంటే, వారికి జరిగిన నష్టం మాటలలో చెప్పుకోలేనిది, మూగతనంతో దాచుకోలేనిది...అందుకే. మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా

Ardhangi | Vaddura Kannayya song

Image
పట్టు పితంబరం  మట్టి పడి మాసేను... పాలు కారే మోము గాలికే వాడెను.... గొల్ల పిల్లలు చాల అల్లరి వరురా... గోల చేసి  నీ పెయన కోదేములు  చెప్పేరు... ఆడు కోవలనని  పాడు కోవేలననిన   అన్నింట నేను ఉన్నా.. ఒక అద్బుతమయినపాట.... జిక్కి గొంతు...మహానటి సావిత్రి నటన.

Dev Anad...

Image
Dharam Devdutt Pishorimal Anand (26 September 1923 – 3 December 2011), better known as Dev Anand, was an Indian film actor, writer, director and producer known for his work in Hindi cinema. Part of the Anand family, he co-founded Navketan Films in 1949 with his elder brother Chetan Anand.[1][2][3] Anand is regarded as one of the greatest and most influential actors in the history of Indian cinema. The Government of India honoured him with the Padma Bhushan in 2001 and the Dadasaheb Phalke Award in 2002 for his contribution to Indian cinema. His career spanned more than 65 years with acting in 114 Hindi films of which 104 have him play the main solo lead hero and he did 2 English films. 

"వూయలూగిన ఎంకి "

Image
"వూయలూగిన ఎంకి " ఎంకి వంపుల్లోన ఏముందో గానీ  ఎంకి ఊసెత్తితే  ఏటేదో అవుతాది !! కోతకోచ్చీన చేనులా   కదిలి  తానోచ్చింది  కంకులా  రవళోలె  కిలాకిలా నవ్వింది  సందాల  సక్కంగ  సద్దట్టుకొస్తాను ! మాపటికి  మురిపెంగ , వూయాల  లూగుదాం !!  చెరుకు  తోటన్తాను సరిచేసి  ఎదురాడు !! ఏగిరం  వస్తనని, ఎగిరెగిరి,  పోయింది !! తాటి చెట్టుకి  నే కొలతేసి చూసి , తాడునే పేనేసి  , బిగదీసి చూసి,  మర్రి కొమ్మక్కి ..మరీ ,  వుయాల కట్టాను  ఎంకొచ్చే దారంట, ఎర్రిగా  చూసాను !!  సందేల నా ఎంకి  సక్కంగ వచ్చింది ! సుక్క సీరా కట్టి  సిగ పూలు బెట్టీ ! వూయాల      సూసింది  ఉప్పెనై  నవ్వింది !! "వోయలంటె నీకు  తోయలే మావా" ని  'వరి' కంకిలా వంగి  చెవులు 'కోరికేసింది' 'వూయలేక్కీ' తా  'వెల్లువై' ఊగింది  ఎర్రి మొగమేసుకూ   తెల్లబోయాను'  'ఎర్రి' మొగమేసుకూ, 'తెల్లబోయాను'......................................డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ .18/0

నాగేశ్వర జ్యోతిర్లింగం:

Image
Brahmasri Chaganti Koteswara RAO నాగేశ్వర జ్యోతిర్లింగం: దారుకయను పేరుగల ఒకానొక ప్రసిద్ధమైన రాక్షసియుండెను. పార్వతియొక్క వరదానమున ఆమె సదా గర్వముతో నిండియుండెను. అత్యంత బలవంతుడగు దారుకుడను రాక్షసుడు ఆమె భర్తమ్. అతడు అనేకమంది రాక్షసులను వెంటబెట్టుకొని సత్పురుషులని సంహరించుచుండెను. అతడు ప్రజల యజ్ఞములను, ధర్మమును నాశనమొనర్చుచు తిరుగుచుండెను. పశ్చిమ సముద్రతీరమున ఒక వనము ఉండెను. అది సకల సమృద్ధులతో నిండియుండెను. అన్నివైపులనుండి దాని విస్తారము పదహారు యోజనములు. దారుక విలాసముగ వెళ్ళెడి ప్రతిచోటికి ఆ భూమి, వృక్షములు, మిగతా ఉపకరణములన్నిటితో కూడిన ఆ వనము కూడా వెళ్ళుచుండెను. పార్వతీ దేవి ఆ వన సంరక్షణ భారమును దారుకునకు అప్పగించెను. దారుక తన భర్తతో కూడి తన భర్తతో కూడి ఇష్టము వచ్చినట్లు వనమునందు విహరించుచుండెను. రాక్షసుడగు దారుకుడు తన పత్నితో అచటినుండి అందరిని భయపెట్టుచుండెను. అతనిచే పీడితులైన ప్రజలు ఔర్వక మహర్షిని ఆశ్రయించిరి. ఆయనకు తమ దుఃఖమును వినిపించిరి. ఔర్వుడు శరణాగతులను రక్షించుటకు రాక్షసులనిట్లు శపించెను. - "ఈ రాక్షసులు భూమిమీదనున్న ప్రాణులను హింసించినను, లేక యజ్ఞములను ధ్వంసము చే

భావయామి (bhavayami) ...

Image
భావయామి (bhavayami) ... "భావయామి" అనగా భావం మీద ధ్యానం చేయడం. "భావయామి గోపాలబాలం" అనగా గోపాల బాలుడి నామం మీద ధ్యానం చేయడం. నాకు బాగా నచ్చిన అన్నమయ్య కీ్ర్తనలలో భావయామి గోపాలబాలం ఒకటి.  ఇదిగో ఆ అన్నమయ్య కీర్తన: రాగం: యమునా కళ్యాణి  తాళం: ఆది భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా కటి ఘటిత మేఘలా ఖచితమణి ఘంటికా పటల నినదేన విప్రాజమానం  కుటిల పద ఘటిత సంకుల సింజితే నతం చటుల నటనా సముజ్వల విలాసం నిరతకరర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా షోభిత పదం  తిరువేంకటాచల స్తితం అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలం https://www.youtube.com/watch?v=lykAogEMGoU

శ్రీ కృష్ణ శతకము..........

Image
శ్రీ కృష్ణ శతకము.......... . శ్రీ రుక్మిణీశ కేశవ  నారద సంగీతలోల నగధర శౌరీ  ద్వారక నిలయ జనార్ధన  కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా. నీవే తల్లి వి దండ్రి వి  నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ  నీవే గురుఁడవు దైవము  నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా. నారాయణ పరమేశ్వర  ధారా ధర నీలదేహ దానవవై రీ  క్షీరాబ్ధిశయన యదుకుల  వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా. హరియను రెండక్షరములు  హరియించును పాతకముల నంబుజనాభా  హరి నీ నామమహత్మ్యము  హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా. క్రూరాత్ముఁ డజామీళుఁడు  నారాయణ యనుచు నాత్మనందను బిలువన్  ఏ రీతి నేలుకొంటివి  యేరీ నీసాటివేల్పు వెందును కృష్ణా. చిలుక నొక రమణి ముద్దులు  చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం  బిలిచిన మోక్షము నిచ్చితి  పలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా. అక్రూరవరద మాధవ  చక్రాయుధ ఖడ్గపాణిశౌరి ముకుందా  శక్రాదిదివిజసన్నుత  శుక్రార్చిత నన్ను కరణఁజూడుము కృష్