శ్రీ శ్రీ గారి 'అగ్గి పుల్ల '

శ్రీ శ్రీ గారి 'అగ్గి పుల్ల '

నువ్వేదో ప్రభంజనం 

సృష్టిస్తావనుకున్నాను గాని 

ఇంకా తడి ఆరని 

పసుపు పారాణి పైన

నీ ప్రతాపం చూపిస్తావనుకోలేదు

నీ మేధా సంపత్తితో 

ఈ జగతిని వెలిగిస్తావనుకున్నాను గాని

అతి గతి లేని అమాయకుల గుడిసెల్ని

పరశురామ ప్రీతి చేస్తా వనుకోలేదు

నీ ఆకారం చూసి 

రాకెట్లా దూసుకు పోతావని 

కమ్ము కొస్తున్న చీకట్లను

చెరిపేస్తావని భ్రమించాను

నల్లని పెదవులపై న పడి దొర్లే 

సిగరెట్ ఎంగిలి కోసం

పరితపిస్తా వనుకోలేదు

బీడీ ముక్క మొహంలో 

అద్దం చూచుకొంటూనో 

బొగ్గుల కుంపటి ముంగిట్లోనో 

తూలి పడ్తూ ఉంటె 

దుశ్శాసనుని రొమ్ము చీల్చేదెప్పుడు 

దురాగతాల తలరాత మార్చే దెప్పుడు 

నిన్ను ఆకాశానికెత్తిన

ఆ మహాకవి ఆకాంక్ష నెరవేర్చే దెప్పుడు

ఆ చిన్ని గుడారాన్ని వీడి 

గుడి గోపురాల వైపు నడిచిరా 

వెలుగు జాడ లేని 

చీకటి ప్రాకారాల వైపు కదలిరా \

అగ్నివై, ఆగ్రహోదగ్రవై 

అన్యాయాల్ని అక్రమాల్ని అరికట్టగా

నీతి లేని, నియతి లేని 

నియంతల భవంతుల్ని 

నిలువునా దహించగా ............

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!