మరో చక్కటి తెలుగుపద్యం

మరో చక్కటి తెలుగుపద్యం సూర్యాస్తమయం పై ధూర్జటి అద్భుత పద్యం ఇస్తే.. 

మన అల్లసాని పెద్దన గారు మరోలా సూర్యాస్తమయాన్ని ఆవిష్కరించారు మనుచరిత్రలో...

.

ప్రవరుడు తన పట్ల అంత కఠినంగా వ్యవహరించి వెళ్లిపోవడంతో హతాశురాలైన వరూధిని దుఃఖభారంతో విలవిలలాడిపోయింది. ప్రవరుడి రూపం ఆమె మదిలో చెరిగిపోలేదు. కళ్లుమూసినా, తెరిచినా.. ప్రవరుడే..ఇంత అందగాడిని పొందని బతుకు, యవ్వనం ఎందుకు అని ఏడ్చింది. చెలికత్తెలు ఉపచారాలు చేశారు. ఆమె మదనాగ్ని ఆగలేదు.. సూర్యాస్తమయం అయింది.. 

అంతే...

పెద్దనగారు... 

తరుణి ననన్య కాంత నతి దారుణ పుష్పశిలీ ముఖ వ్యథా

భర వివశాంగి నంగ భవుబారికి నగ్గము సేసి క్రూరుడై

యెరిగె మహీసురాధము డహం కృతితో నని రోషభీషణ 

స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చె కషాయ దీధితిన్...

.

అన్నారు. అంటే.. చక్కటి చిన్న దానిని, ఏ ఒక్కరికీ సొంతం కాని దానిని, కోరికతో కొట్టుమిట్లాడుతున్న దానిని. అహంకారంతో కాదని, మన్మథ బాధకు గురిచేసి క్రూరుడైన ప్రవరుడు వెళ్లిపోయాడే.. అని కోపగించుకున్నాడో...అన్నట్లు ముఖం ఎర్రగా చేసుకుని ఆ సాయం సమయంలో కుంగిపోయాడు. అని చమత్కరించారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!