Tum Agar Saath Dene Ka Vada Karo (Hamraaz)



నువ్వెళ్లే దారిలో నక్షత్రాలు పరుస్తా!..

తామే సమస్తమై, ఎవరికి వారు ఎన్ని శిఖరాలనైనా చేరుకోవచ్చు. ఎన్ని విజయాలనైనా సొంతం చేసుకోవచ్చు. అయినా ఒక దశలో ఏదో ఒంటరితనం వేధించడం మొదలెడుతుంది. ఆ క్షణం నుంచి ఒక తోడు కోసం, ఒక ఆలంబన కోసం తన జీవితంలో సమస్త భావోద్వేగాల్లో పాలు పంచుకునే ఒక నిండు ప్రేమమూర్తి కోసం అన్వేషణ మొదలవుతుంది. నిజంగానే ఆ అన్వేషణ ఫలించి తాను కలగన్న ఆ ప్రేమమూర్తి తన కళ్లముందు నిలబడితే ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయి? ' హమ్‌రాజ్' సినిమా కోసం సాహిర్ లుద్యాన్వీ రాసిన ఈ గీతంలాగే ఉంటాయి. రసోద్వేగాల్ని రాగరంజితం చేయడంలో అసమానుడైన రవి స్వరకల్పనలో మహేందర్ కపూర్ పాడిన ఈ పాటను నిజంగా ఎన్ని సార్లు విన్నా తక్కువే. ప్రస్తుతానికి వెంటనే ఒకసారి వినేద్దాం!
తుమ్ అగర్ సాథ్ దేనేకా వాదా కరో
మై యూఁ హీ మస్త్ నగ్‌మే లుటాతా రహూఁ
తుమ్ ముఝే దేఖ్‌కర్ ముస్కురాతీ రహో
మై తుమ్హే దేఖ్‌కర్ గీత్ గాతా రహూఁ / తుమ్ అగర్/
(నా తోడుంటానని నువ్వు నాకో వాగ్ధానం చెయ్యాలే గానీ రసోద్వేగంతో ఎన్నెన్నో గేయాల్ని నే నిలా ఆవిష్కరిస్తూనే ఉంటా నువ్వు నా కేసి చూస్తూ మందహాసం చేస్తూ ఉండు చాలు నేను నీకేసి చూస్తూ ఎన్నెన్నో గీతాల్ని ఆలపిస్తూనే ఉంటా /నా తోడుంటానని/)
ప్రేయసి కోసం ప్రియుడు, ప్రియుని కోసం ప్రేయసి చేసే అన్వేషణ సృష్ట్యాది నుంచి అలా కొనసాగుతూనే ఉంది. ఈ అన్వేషణ ఫలించడానికి ఒక్కోసారి ఏళ్లకు ఏళ్లే గడిచిపోతాయి. ఒక సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎప్పుడో ఆ కోరుకున్న ప్రణయమూర్తి ఎదురైనప్పుడు ఆ రెండు హృదయాల ఆనందాలకు ఇక అవధులు ఉండవు.
కిత్‌నే జల్వే ఫిజావో మే బిఖ్‌రే మగర్
మైనే అబ్ తక్ కిసీ కో పుకారా నహీఁ
తుమ్‌కో దేఖాతో నజ్‌రేఁ యే కహెనే లగీ
హమ్‌కో చెహెరే సే హట్‌నా గవారా నహీఁ
తుమ్ అగర్ మేరీ నజ్‌రోఁ కే ఆగే రహో
మై హర్ ఎక్ శై సే నజ్‌రే చురాతా రహూఁ / తుమ్ అగర్/

(ఎన్నెన్నో అందాలు ఈ పిల్లగాలుల్లో వికసిస్తున్నాయి గానీ, నేను ఇంత వరకూ ఎవరినీ పిలవనేలేదు నిన్ను చూశాక నా చూపులు ఆ ముఖం నుంచి వైదొలగడం అసాధ్యమంటున్నాయి. నువ్వు నా కళ్లముందు ఉండాలే గానీ, నేను ప్రతి దాన్నించీ చూపుల్ని కొల్లగొడుతూనే ఉంటాను / నా తోడుంటానని/ )
ప్రతి రోజూ ఎంతెంతోమంది సౌందర్య రాశులో కళ్లముందు నుంచి అలా వె ళ్లిపోయి ఉండవచ్చు. అంతమాత్రాన ఆ అందరి మీదికీ మనసు పోదు కదా! అయితే, ఉన్నట్లుండి ఒక రూపం వద్ద హృదయం నిశ్చేష్టంగా నిలబడిపోతుంది. ఏ జీవన మూలాలు, ఏ హృదయ బంధం అలా కట్టిపడేస్తుందో ఏమో తెలియదు గానీ, ఎన్నో దశాబ్దాలుగా పరిచయమున్నట్లు ఆ వ్యక్తి చుట్టూ ఒక హృదయలోకం అల్లుకుపోతుంది.

మైనే ఖ్వాబో మే బర్సో తరాశా జిసే
తుమ్ వహీ సంగ్‌మర్‌మర్ కీ తస్వీర్ హో
తుమ్ న సమ్‌రెnూ తుమ్హారా ముకద్దర్ హూఁ మై
మై సమఝ్‌తా హూఁ తుమ్ మేరీ తక్‌దీర్ హో
తుమ్ అగర్ ముఝ్‌కో అప్‌నా సమఝ్‌నే లగో
మై బహారోఁ కీ మహ ఫిల్ సఝాతా రహూఁ / తుమ్ అగ ర్/
(ఏళ్ల పర్యంతంగా కలల్లో దే న్ని చెక్కుతూ ఉండిపోయానో ఆ చిత్రానికి సరిగ్గా ప్రతిరూపమే నువ్వు నువ్వు నన్ను నీ జీవన గమ్యమని అనుకోకపోతే ఏమిటిలే గానీ, నేను మాత్రం నిన్ను నా సౌభాగ్యమే అనుకుంటున్నా నన్ను నీ వాడిగా నువ్వు అనుకోవాలే గానీ నేను వసంతాల కచేరీల్ని అలంకరిస్తూ ఉండిపోతా / నా తోడుంటానని/)

అనుకున్నది వాస్తవ రూపం ధరించేదాకా ఏ ప్రేమ హృదయమూ చేష్టలుడిగి ఉండిపోదు. కలలోనే అయినా, తన ఆశా రూపాన్ని తన హృదయపు కాన్వాసు మీద చెక్కుతూనే ఉంటుంది. ఎక్కడో అరుదుగా తప్ప స్వప్నప్రేమికా రూపం నిజజీవితంలో ఎదురైన రూపం ఒక్కలా ఉండవు.
మైౖ అకేలా బహుత్ దేర్ చల్‌తా రహా
అబ్ సఫర్ జిందగీ కా కట్‌తా నహీఁ
జబ్ తలక్ కోయీ రంగీన్ సహారా నహో
వక్త్ కాఫిర్ జవానీ కా కట్‌తా నహీఁ
తుమ్ అగర్ హమ్‌కదమ్ బన్‌కే చల్తీ రహో
మై జమీఁ పర్ సితారే బిచాతా రహూఁ / తుమ్ అగర్/
(ఎంతో కాలం నేను ఒంటరిగానే నడకసాగించాను. ఇంకా ఇలాగే నా జీవన యాత్ర సాగేలా లేదు ఎప్పటిదాకానైనా ఒక రంగురంగుల ఒక తోడు దొరకదో ఈ యవ్వన కాలమింక నిలకడగా సాగదు. జీవన సహచరివై నువ్వు నాతో కలిసి రావాలే గానీ, నువ్వు నడిచే నేల మీద నేను నక్షత్రాల్ని పరుస్తూ ఉండిపోతా / నా తోడుంటానని/)
ఏ అంతస్తులో ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలున్నా ఒక తీవ్రమైన ఒంటరితనం వెంటాడటం మొదలెడుతుంది. కొన్నేళ్ల పాటు ఆ ఒంటరిత నాన్ని ఎలాగోలా భరిస్తారు. ఒక దశలో అదింక భారమవుతుంది. జీవితం రసహీనంగా, వర్ణహీనంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక ఆ క్షణం నుంచి ఒక ఇంద్రదనస్సు లాంటి జీవిత ం కోసమై ఒక తపన మొదలవుతుంది. నిలువెత్తు బావోద్వేగాలకు నెలవైన ఒక హృదయేశ్వరి కోసం తపస్సు మొదలవుతుంది. ఆ తపస్సు ఫలించి నిజంగానే ఆమె తన జీవితంలోకి ప్రవేశిస్తే ప్రకృతి లోని అపురూపమైన వాటన్నిటినీ ఆమె ముందు నిలబెట్టాలనుకుంటాడు. నేల మీది వజ్రాలనే కాదు ఆకాశంలోని నక్షత్రాలను కూడా ఆమె నడిచే దారిలో పరవాలనుకుంటాడు. కాదంటారా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!