Skip to main content
సుత్తుల్లో చాలా రకాలున్నాయి.
సుత్తుల్లో చాలా రకాలున్నాయి.
.
ఒకడు ఠంగు ఠంగుమని గడియారం గంట కొట్టినట్లు సుత్తేస్తాడు. మీ నాన్న గారిలాగా . హ హ హ. దాన్ని ' ఇనప సుత్తి ' అంటారు. అంటే ' ఐరన్ హేమరింగ్ 'అన్నమాట. ( సుత్తివీరభద్రరావు )
.
ఇంకోడు సుత్తేస్తున్నట్లు తెలియకుండా మెత్తగా వేస్తాడు-రబ్బరు సుత్తి. అంటే ' రబ్బర్ హేమరింగ్ ' అన్నమాట.
.
ఇంకోడు ప్రజలందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు - ' సామూహిక సుత్తి ' దీన్నే మాస్ హేమరింగ్ అంటారన్నమాట. అంటే రాజకీయ నాయకుల మీటింగులూ ఉపన్యాసాలు ఈ టైపు.
.
పోతే ఇంకో టైపుంది. మీ నాన్నగారు నాకు సుత్తేద్దామని వచ్చారనుకో, నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాననుకో- అహ, ఉత్తినే అనుకుందాం. ఇది జరిగే పని కాదనుకో. దాన్నే ఎదురు సుత్తి అంటారు. అంటే ' రివర్స్ హేమరింగ్ ' అన్నమాట.
.
ఇలా చెప్పుకుంటూ పోతే, నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా.
అంటే ' ప్రొలాంగ్డ్ హేమరింగ్ 'అన్నమాట.
.
వెళ్ళమ్మా వెళ్ళు, నీ పని చేసుకో. "
Comments
Post a Comment