వరూధిని---ఆడ తాంబూలం, మగతాంబూలం?

వరూధిని---ఆడ తాంబూలం, మగతాంబూలం?

.వరూధిని---నాట, దేశాక్షీ రాగాలు. 


వాలారున్ కొనగోళ్ళ నీవలసతన్ వాయించుచో నాటకున్ 

మేళంబైన విపంచి నిన్న మొదలున్ నీవంటమింజేసి ఆ 

ఆలాపంబె అవేళ బల్కెడు ప్రభాతయాతావాతాహతా

లోలత్తంత్రుల మేళవింపగదవే లోలాక్షి డేశాక్షికిన్. 


చెలికత్తెలు వరూధినితో అంటున్నారు: ప్రవరుడు వెళ్ళిపోయిన తరువాత, నీవు నాట రాగానికి మేళవించిన వీణ, విరహముతో నిన్న మొదలు నీవు వీణను ముట్టుకోలేదు కనుక, ప్రొద్దుననే వీస్తున గాలితో కొట్టబడిన వీణ తంత్రుల ప్రకంపనలు నాట రాగాన్నే వినిపిస్తున్నై. వరూధినీ, వీణను నాటరాగాన్నించి దేశాక్షీ రాగానికి మార్చి మేళవించు. 


నాట రాగం విషాదభరితమనీ, దేశాక్షీ రాగం సంతోషజనకమని కవి హృదయం. వీణను శృతి చేయటం విన్నాము గాని, ఒక రాగానికి మేళవించటం ఉంటుందా? సంగీత ప్రియులు చెప్పాలి.

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

మృగమదసౌరభవ 

ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధ

స్థగితేతర పరిమళమై 

మగువపొలుపు తెలుపునొక్క మారుతమొలసెన్.

.

ప్రవరుడు హిమాలయాలలో ప్రవేశించినపుడు, కస్తూరీ, దానికి రెండుపాళ్ళు ఎక్కువ కర్పూరమూ వేసి ఘాటుగా కట్టిన తాంబూలం సువాసనలు మలుపు అవతల ఒక స్త్రీ ఉన్నట్లుగా వచ్చిన గాలి ద్వారా అతనికి తెలిసింది.

తాంబూలం వాసనను బట్టి ఒక స్త్రీ ఉన్నట్లుగా తెలిసిందట. స్త్రీయే ఎందుకు, పురుషుడు ఉండకూడదా? అంటే, కస్తూరి, కర్పూరాల పాళ్ళనుబట్టి తెలిసిందన్నమాట ఆ వ్యక్తి స్త్రీ అని. అంటే ఆ కాలంలో ఆ తేడా ఉండేదా ఆడ, మగ తాంబూలాలలో?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!