గ్రంధక్రిమి స్వగతం - ఆరుద్ర

గ్రంధక్రిమి స్వగతం - ఆరుద్ర

వస్తున్న దెవరనుకొన్నావు?

పుస్తకాల పురుగుని

చెప్పు నాకు స్వాగతం

విను నా స్వగతం

కాయా కసరుా తినే మానవుడు

అన్నం మెుదలెట్టిం దెప్పుడు

కర్రా కంపా మెక్కే నేను

కబ్బాల తుదముట్టిన దప్పుడు

చెప్పిందే చెప్పి చెప్పి

తిప్పి తిప్పి తిరగ రాసి

తిప్పలుపెట్టే కవితను

చప్పున భోంచేసేస్తా

సుదీర్ఘ కుభావసమాసాలు

నాకు ఇరానీ సొమాసాలు

ప్రాసాదగుణానికి పావుఠావు

నాకు గరమ్మసాలా పులావు

పాతకవులు చేసిన

కొత్తకల్పనలు చుాసి

కొందరు రాస్తారు మక్కీకి మక్కీ

అందులో సుందరత హుళక్కి

కొరకకాని కొయ్యలు

విరచించు కొందరయ్యలు

చుాపులేకి విద్దెలు

నాకు వెన్నముద్దలు

కాగితాల కెెక్కదు గ్రామ్యరమ్యత

కానీ బతికిస్తుంది దాన్ని జనత

అనుశ్రుతంగా వచ్చే కవిత

అయ్యో తినలేనే అని నా వెత

ఎన్నో చవులుారించినా నేను

నన్నయ్యని తినలేకపోయాను

తిక్కన్నకి ఇతనికీ మధ్యనున్న

తక్కిన కవులను తినేశాను

అన్నమయ్యను తిందామంటే

అతడు కాగితాలకే ఎక్కలేదు

చిన్నయసుారి ఎన్నటికైనా నాకు

సన్నబియ్యపన్నం కాకమానడు

తంజావుారు రచనలన్నీ

తిందామనుకొన్నా గానీ

ఇంగ్లీషులో చెప్పినట్టు మీమాంసం

నాపాలిటి చేదువిషం

ఏమన్నా సరేసరి

వేమన్నని తిందామంటే

తొలిముాడు పాదాలు తిన్నా

నాలుగోది నా కసాధ్యం

విరాటపర్వంలోని

సింగంబాకటి పద్యం

పారిజాతాపహరణంలో

పాదతాడనఘట్టం

విజయవిలాసంలో

వెలలేని సు శ్లేషం

పోతనా శ్రీనాథులు

నాకు హమేషా వర్జ్యాలు

ఆధునిక కాలం

ఆహా! సుభిక్షం

లక్షోపలక్షలు నాకు

అందే తియ్యద్రాక్షలు

రుచీ పచీ మీరు లేదనే

ప్రచార కవనం నాపాలిటి

శుచిగా పచనం చేసిన

సురుచిర మృష్టాన్నం

నా చిట్టి చమ్ముడు బుాజు

వాడికి కుకవులంటే మోజు

అర్ధసంక్లిష్టతా కావ్యాలపై

అల్లుకొన్న రాజ్యానికి రాజు

వాడు వెతికి పెడతాడు

నాకు కడుపునిండా కుాడు

వాడు పడతా డొక బుక్కు నేడు

రేపు నాకదే రవ్వలాడు

తెరిచిందికి మనస్కరించని

చెయ్యెచ్తి నమస్కరించని

పుజాపునస్కారాలు లేని

పుస్తకాలు బుాజుకి మోజు

వృథాపఠనం శైలి కఠినం

మీకుమాత్రం భలే కష్టం

అదే రమ్యం సుధామధురం

మాకుమాత్రం మహాయిష్టం

వాడుా నేను కలసి

దాడి చేస్తాం బలిసి

విమర్శకులు చెయ్యని పని

చేసేస్తాం దయదలచి

తరానికో వందకవులు

తయారవుతా రెప్పుడుా

వందలోనుా మందలోనుా

మిగలగలిగే దొక్కడు

ఒక్కకావ్యం ఒక్కపద్యం

వందమందికి నచ్చినా

దాన్నికాల్చుా ఏంచెయిా

అదే చివరకు నిల్చును

ప్రజల రససింధువు

నాకు విషబిందువు

జనులాదరించని సాహిత్యం

తినివేస్తాను నేనునిత్యం

నన్నందుకే పుట్టించాడు దేవుడు

ఎన్నడు గిట్టించలేడు నరుడు

పుస్తకాల పురుగుని

కుకవికన్నా మెరుగుని

( ఆకాశవాణి -- 1962)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!