Skip to main content
అయనగారంటే నాకు చాలా భక్తి గౌరవం ఉంది.
అయనగారంటే నాకు చాలా భక్తి గౌరవం ఉంది.
ఆయనగారి భార్యామణి, సుకుమార సుందరాంగి అంటే నాకు చాలా ఇష్టం, ఆమె మాఇంట్లో
కాలు పెట్టగానే లోపలికి తీసుకుని వెళ్లి గదిలో దాచి భద్రంగా తాళంవేస్తా!!
మా శ్రీమతికి అసలుకోపంరాదు, పైగా చాలా సంతోషపడి, ఆమెను బయటికి రానీయకండి అని గట్టిగా చెపుతుంది.ఆమె నా వంటిమీద కూచుంటే నాకుగూడా చాలా ఆనందం అంటుంది.
అంటూ ఆనంద పడుతుంది.
ఆమె భర్తగారు అందతా చూచి చిరునవ్వు నవ్వి పిచ్చివాడా ,నాభార్య ఎవరిదగ్గరా ఎక్కువకాలంఉండదురా, నువ్వు ఎంతగట్టిగా బంధించినా నేడు,నీఇంట్లో, రేపు వేరేవారింట్లో ఉంటుందిరా !!!
అందుకే ఆమెను చంచల అంటూ ఉంటా. నాకుతప్ప ఆమె ఎవరికీ వశంకాదు.ఆమె ఎల్లప్పుడూ నాసోంతమేరా అని నవ్వుకుంటాడు.
...............................................................................................................
మితృ లారా ఆమెను మీరేమైనా శాశ్వతంగా బంధించి ఉంచగలరేమో చెప్పండి.
ఎల్లుండి శుక్రవారం ప్రయత్నించండి.........
ఇట్లు
ఆయనగారి భార్యను అధికంగా ప్రేమించే
న.పూ.సి.
ఈ చిన్న విషయంపై వ్యాఖ్యానించినవారింట్లో, శుక్రవారం నాడువచ్చి తిష్టవేస్తుంది.
ఆమె ముద్దుల మొగుడు మీద ఆన.....
Comments
Post a Comment