పాండవోద్యోగం - ద్వారక ఘట్టం..

పాండవోద్యోగం - ద్వారక ఘట్టం..

ఈ ద్వారక ఘట్టంలో న్యాయానికి శ్రీకృష్ణుని కన్నా, అర్జునినికే ఎక్కువ ప్రాధాన్య ఉంది. అర్జునుడే ఈ దృశ్యాన్ని బ్రతికిస్తాడు. బ్రతికించాలి. అర్జునుడు (ఓపెనింగ్ బ్యాట్స్ మెన్) బ్రతికించలేకపోతే, ఆ దృశ్యం అపజయం పాలయినట్లే -

‘అదిగో ద్వారక, ఆలమాందలివిగో, అనే పద్య రాగాలాపన, అభినయంతోనే ఈ దృశ్యం బ్రతుకుతుందా, చస్తుందా? ఇట్టే చెప్పవచ్చు. చాలామంది ఈ పద్యాన్ని గుండెలవిసేలా అరుస్తున్నారు. పాడుతూ పాడుతూ నోరంతా తెరుస్తున్నారు. కళ్ళు మూస్తున్నారు. చేతులు విపరీతంగా గాలిలో త్రిప్పుతున్నారు. ఇవన్నీ చేయగూడని పనులు. శ్రీ కృష్ణుని ఎడల తనకు గలిగిన సఖ్య భక్తి అణువణువున ‘అర్జున’ పాత్రలో కనబడాలి. మాట, చూపు, చేతలలో మహా వినయం ప్రదర్శితమవ్వాలి. మరీ, ముఖ్యంగా కపట నిద్ర అభినయిస్తున్న శ్రీకృష్ణుని పాదాల వద్ద గూర్చున్న అర్జునునిలో ఒక మహా భక్తుడు పరకాయ ప్రవేశం చేయాలి. 

.

అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, న

య్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్

యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళా

భ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్..

.

.కృష్ణుడు (అర్జునునితో):

ఎక్కడనుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశో

భాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్

జక్కగ నున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్

దక్కక నిల్చి శాంతుగతి దాను జరించునె తెల్పు మర్జునా!.

.

కృష్ణుడు (దుర్యోధనునితో):

బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్?

నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?

నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ

దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్

దుర్యోధనుడు (కృష్ణునితో):

.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!