అణా - కానీ ఈ పేర్లు గుర్తున్నాయా!

అణా - కానీ

ఈ పేర్లు గుర్తున్నాయా! 

అణా, కానీలు 1957 కి ముందు ఉపయోగించిన నాణాలు. 

రూపాయకు 16 అణాలు, 64 కానులు. 

రాధాకృష్ణన్ గారు పదహారు అణాల ఆంధ్రుడు అంటే 100% అన్నమాట. ..

వాడు కానికి కొరగాడు. వాడు అణాకాని వెధవ. ఇల్లాంటి వాడుకలు ఉండేవి. 

ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? అంటే ఇవి సంస్కృతపద జన్యాలు అనిపించాయి.

కౌటిల్యుని అర్థశాస్త్రం చదువుతూంటే ఆ అనుమానం వచ్చినది.

ఆదాయపు పన్నే నల్లధనమనే పదార్థాన్ని ఉత్పత్తిచేసినదని నా అనుమానం.

మౌర్యుల కాలంలో పన్నుల విధానం ఎలా ఉండేది అన్నకుతూహలం. 

అప్పుడు విదేశీ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ఉండేది. 

దానికి ఈ వస్తువుకు ఇన్ని పణాలు అని శుల్కము (పన్ను) ఉండేది. 

అది ఒక రాగి నాణెం. పణంలో నాలుగవభాగం కాకిని. 

కాలక్రమంలో పణాలు అణాలు, కాకినీలు కానీలు అయ్యాయని నాఉద్దేశ్యం. —

Comments

  1. ఏది ఏమైనా వీటిని చూసి చాలా కాలమయింది. ఆ రోజులలో పనికి రానివాణ్ణి అణా కానీ గాడనీ అణా పరక గాడనీ అనేవారు.


    ReplyDelete
  2. చిత్తూరు మాండలీకం లో ఇంకా నూ నాలుగణాలు చెల్లైన మాట !!

    జిలేబి

    ReplyDelete
  3. ఆ వరడు వెరిఫికేషన్ తీసి వేసిన కామెంటు ట కు సౌలభ్యం గా ఉండును !!

    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!