Kayani Gauri Kasibhtla గారి .ఒక మంచి సేకరణ... .

Kayani Gauri Kasibhtla గారి .ఒక మంచి సేకరణ... 

.

స్వాతంత్రోద్యమ సమరం సాగుతున్న రోజుల్లో దేశ వ్యాప్తం గా

ఉద్యమ గీతాలూ,కవితలూ.పద్యాలూ వెలువడి నరనరాల్లో 

ఒక స్పూర్తిని,దీక్షని కలిగేలా చేసాయి..

అప్పట్లో ఎందరో తెలుగు కవులు పద్యాలను రచించారు.. 

వారిలో బలిజే పల్లి లక్షీకాంతం .మాధవపెద్దిబుచ్చిసుందర రామా శాస్త్రి,గరిమెళ్ళ సత్యనారా యణ గారు ఇలా ఎందరో.....వీరి ప్రచారగీతములుపాడనీ నాయకుడు,యువకులు వినిపించని కాంగ్రేసు సభలే ఉండేవి కావట.....

అందులోంచి

నూట నలుబది నాల్గు నోటికి తగిలించి

మాటలాడవద్దంటాడు ;మమ్ము

పాట పాడ వద్దంటాడు మమ్ము;టోపీ

తీసి వీపున బాదుతాడు''

.

అంటరానివరెవరో..కాదు.మా వెంట రానివారే అనే గేయం

సీమ గుడ్డలు వీడి..మీరిక క్షేమ మొందండి

పరదేశ వస్త్రములె బ్రహ్మజెముడు

వలె వ్యాపించే..దాని నరకేడి ఖడ్గ ధార రాట్నమే ననెను

.

బ్రిటీష్ వారి పన్నువిధానమును వ్యతిరేకిస్తూ...

ఉప్పు పన్ను,పప్పుపన్ను,ఊరికెలితే పన్ను

,కొప్పు కాస్త దేముడికి మొక్కుకుంటే పన్ను

.

అంటూ ఎగతాళి చేసేవారట

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ' రాం భజన కీర్తనలు'చమత్కార ధోరణిలో సాగిన జాతీయ గీతములేనట...

ముప్పైకోట్ల ప్రజలు రాం భజన_---పంజర బంధ మైనారు 

బంధాలు త్రెంపుకొని రాం భజన__ అవతల పడాలి

గాంధి మంత్రమిదేను రాం భజన__ స్వరాజ్యమంత్రం

ఒక్కటే మంత్రం రాం భజన__ మేలైన మంత్రం

రాట్నం గూర్చి భావకవులలో చక్కని గీతములు రచించినవారున్నారు

.

ఓ చిన్ని రాట్నమా...ఒయ్యారి రాట్నమా.

ఒప్పైన రాట్నమా...వడి వడి వడుకు

మోడు మోకులు చిగుర్వో సెడి పోలిక

నీ బట్ట గట్టేరు వడి వడి వడుకు

జాబిల్లి కిరణంపు జందాన సాగెడు

నీ దార మెంతురు వడివడి వడుకు....

చెదిరి పోయిన యంగముల్ కుదురు పఱచి

సడలు వారిన తంతువుల్ చక్క దీర్చి

యనుగత శ్రుతి భువన మోహనము గాగ

హాయి బలికింపలెమ్ము జాతీయ వీణ....

.

ఈ నాటి ఈ స్వాతంత్ర్య అనుభూతి నాటి మేటి.కవిరాజుల వెలువరించిన గీత,కవన,స్ఫూర్తితో

పొందిన దే నని నమ్ముతూ..గొప్ప గొప్ప గీతాలను అందించి మనసులను పులకింప చేసిన ఆ కవి, కుల కోకిలల ను మనసారా స్మరిస్తూ..

ఎన్నో గేయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ సమాజాన్ని చైతన్య వంతం చేయడంలో వారు పరిపూర్ణం గా సఫలురయ్యారని ..విశ్వసిస్తూ...గర్విస్తున్నాను...జాతీయతకు..పునాది వేసిన కవులు,గేయ,గీత రచయితలకు.. శిరసాభి వందనం..జై.. భారతవనీ...

ఇలా పై. అమరావనీ....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!