కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!
.jpg)
సీతారాముల కథను మనకు చెప్పిన మొదటివారు వాల్మీకి మహర్షి. అయన వ్రాసినది ఆయనస్వకపోలకల్పితకథ అనుకుంటే దానిని మార్చిమార్చి వాల్మీకికి విరుధ్దంగా చెప్పి అదట ఇదట నిజం అనటంలో అర్థం లేదు. అది కాదండీ, వాల్మీకి రాముడికథను యథాతధంగా చెప్పారూ అంటారా, అప్పుడు ఆయన చెప్పినదే ప్రమాణం కాబట్టి వాల్మీకి చెప్పిన కధను మనం మార్పులు చేసి అది నిజం ఇది నిజం అనటం అనుచితం అవుతుంది. కాబట్టి వాల్మీకి చెప్పని విషయంతో జనానికి గందరగోళం సృష్టించటం మంచిది కాదు. దయచేసి ఇలాంటి కథలు చెప్పకండి. మరెవరు చెప్పినా వినకండి.
ReplyDeleteబాగుంది. మీ వివరణ.
DeleteThis comment has been removed by a blog administrator.
Delete