Posts

Showing posts from October, 2016

గయోపాఖ్యానం "!

Image
గయోపాఖ్యానం "! రచన ...చిలకమర్తిలక్ష్మీ నరసిహం పంతులుగారు( నాటక రచనా ధురీణత)! .. ఆకాలం నాటక రచనకు దారులు తీర్చింది. సామాజిక నాటకాలతోబాటు,, పద్యనాటకాలూ పుంఖానుపుంఖంగా వెలువడుతూఉండేవి. వాటిలో రెండుమూడు నాటకాలుమాత్రం ప్రదర్శనకు నోచుకున్నాయి. వాటిలో అటుతిరుపతి వేంకటృకవుల" పాండవోద్యోగ విజయం!  "ఇటు చిలక మర్తివారి " గయోపాఖ్యానం " బహుళ ప్రచారానికి నోచుకున్నాయి. గయోపాఖ్యానమైతే కొన్నివేల ప్రదర్శనాలతో ఆంధ్రదేశమంతా మారుమ్రోగిపోయింది. అందులోంచి ఒక చక్కనిపద్యం మీకోసం! . సందర్భంతెలుసుకోండి: అది ద్వాపరయుగం .కృష్ణుడు మధురనుపాలిస్తునాడు. (ఇదంతా కురుపాండవ యుధ్ధానంతరం కథ) అరుణారుణ రాగరేఖలు తూర్పున వుదయించుచుండ, కృష్ణుడు యమునలో స్నానమొనరించి సూర్యునకు అర్ఘ్య ప్రదానం చేయటానికి ఉపక్రమించాడు,దోసిటనీరుబట్టి చేయిపైకెత్తాడు. అంతే ఆదోసిటనోమో తపుక్కున పడినది .యేమా యనిచూడ నది నిష్ఠీవనమని తేలినది.పట్టరానికోపమువచ్చి కృష్ణుడిటినటుజూడ, ఆకాసమున విమాన విహరణ మొనరించు గయుడు గనంబడెను. కోపమున కృష్ణుడు ఆనిష్ఠీవన దుర్వినీతుడగు గంధర్వుని దారుణముగా శపించు సందర్భములోని పద్యమిది. .

మనసున మల్లెల మాలలూగెనే భావకవికి ...బాపు చిత్రం....

Image
మనసున మల్లెల మాలలూగెనే భావకవికి ...బాపు చిత్రం.... . మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది. 1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం పూయించిన పారిజాత కుసుమాలు పై వాక్యాలు. అంతవరకూ సాదా సీదాగా సాగుతున్న తెలుగు పాటలోకి మల్లెల జలపాతంలా చొచ్చుకు పోయింది కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వం. తెలుగు సినిమా పాటకి కొత్త వొరవడిని చూపించి, కావ్య వర్ణనా రీతిని చొప్పించిన ఘనత కృష్ణ శాస్త్రి గారి కవిత్వానిది. భావ కవిత్వ సాగరాన్ని చిన్న పాటలో చుట్టేసిన కమనీయ విశిష్ట భావనా శిల్పం ఆయన కవిత. ఎంత రాసినా కాసింత మిగిలిపోతుంది. పైన ఉదహరించిన పాట పల్లవి మల్లీశ్వరి సినిమాలోదే! పల్లవి ఎత్తుగడే అలా ఉంటే, ఇహ చరణాలు సంగతి సరే సరి. మధురమైన ప్

కాశీ ప్రయాగ!

Image
కాశీ ప్రయాగ! . సీ.కాలాడినప్పుడే కావాల్సిన పనులు  చేసినంత సమకూరు సుభ మిలను.  కాలాడి నప్పుడే కాశీ ప్రయాగల  యాత్రలు చేయనూహించవలయు  చేతనున్నప్పుడే చేయు దానములన్ని  చేతులాడినప్పుడే చేయు పనులు  కన్నులున్నప్పుడే కరువార తిలకించు  కమలనాధుచరణ కమలములను.  ఆ. చెవులు వినగలిగిన చక్కని భజనలు చెవులకు వినిపించు జలవు మీర పలుకు గలిగినపుడే పరమేశు నామము పరిపరివిధములను పలుకుచుండు. (ఇది మా అక్క Suryalakshmi Taranikanti గారి పద్యం.)

Chengu Chenguna Gantulu Veyandi - Nammina Bantu

Image
చెంగుచెంగున గంతులు వేయండి... జాతివన్నె బుజ్జాయిల్లారా నోరులేని తువ్వాయిల్లారా.. తెలుగు తల్లికి ముద్దుబిడ్డలు.. సంపద పెంచే జాతిరత్నములు... మా ఇలవేల్పులు మీరు లేనిదే మానవజాతికి బతుకే లేదు... అన్న వాక్యాలు అద్భుతం. పంచభక్ష్య పరమాన్నం తెమ్మని బంతిని గూర్చుని అలగరుగా  పట్టుపరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా  గుప్పెడు గడ్డితో గుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ  జాలిలేని నరపశువుల కన్న మీరే మేలనిపిస్తారూ

వేదాంతం!

వేదాంతం! . అక్కినేని "దేవదాసు" విడుదలయిన రోజుల్లో అప్పటికి అంతగా విఖ్యాతి గాంచని శ్రీ ఆరుద్ర, శ్రీ శ్రీశ్రీ విజయవాడలో రిక్షాలో వెడుతూ ఆ పాటల లోని వేదాంతాన్ని గురించి చాలా సీరియస్ గా చర్చించుకుంటున్నారు. "కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! బహుదొడ్డ ప్రయోగం" ఆరుద్ర " దాంట్లో పెద్ద వేదాంతం దాగుందోయ్" అన్నారు శ్రీశ్రీ ఓ దమ్ములాగుతూ " జగమే మాయ అంటూ చాలా అర్ధం లాగారు" "అల పైడిబొమ్మ! చాలా బాగుంది" ఇంకో దమ్ముతో శ్రీశ్రీ "కొన్ని ప్రయోగాలు అర్ధం లేకుండా వాడారు" " తాగుబోతోడి మాటలకు అర్దాలేముంటాయి బాబు!" అన్నాడు రిక్షావాడు చర్చకు పుల్ స్టాప్ పెట్టాడు. కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! అని రాయలేదుట .. కూడి (కలసి)ఎడమైతే(విడిపోతే ) పొరపాటు లేదు అని రాసేరు .. కాని ఘంటసాల వారు అలా పాడేరు... వేదాతం వారు తాగుబోతోడి మాటలకు అర్దాలేముంటాయి సర్దుకు పోయేరుట

నాగేంద్రుడు !

Image
నాగేంద్రుడు ! శివకేశవుల అనుగ్రహాన్ని పొందిన నాగేంద్రుడు ... మానవాళిచే దైవంగా భావించబడుతున్నాడు. కొన్ని శైవ క్షేత్రాల్లోను ... మరి కొన్ని వైష్ణవ క్షేత్రాల్లోను ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో నాగేంద్రుడు ఉపాలయంగా కాకుండా ప్రధాన దైవంగా కూడా కనిపిస్తుంటాడు.

బాపు గారి శకుంతల..

Image
బాపు గారి శకుంతల.. . చెలియను మఱచిన వేళల కలిగెడు దుఃఖము కలంచు గాదే, చెలుడా వలపుల పలుకుల నిత్తఱి సులభత మఱచుటయె వింత; చోద్యము సుమ్మా!

ఇలా పుల్లల పొయ్యిమీద చిలకడదుంపలు పెట్టి కాల్చుకుతింటే ఆ కిక్కే వేరు.

Image
ఇలా పుల్లల పొయ్యిమీద చిలకడదుంపలు పెట్టి కాల్చుకుతింటే ఆ కిక్కే వేరు.

పడుచుతనం రైలు బండి.

Image
పడుచుతనం రైలు బండి.

నేనే సూర్య కాంతం ని! (Sahana Meenakshi అమ్మకి కృతజ్ఞలతో.) .

Image
నేనే సూర్య కాంతం ని! (Sahana Meenakshi అమ్మకి కృతజ్ఞలతో.) . నా పేరు నేను చెప్పను..చెప్పనవసరం కూడా లేదు..  నేను అంధ్రుల అభిమాన అత్త గారిని.. ఏ అత్త గారు అయినా కటువుగా మాటాడితే నా పేరే తలచుకుంటారు కోడళ్ళు అందరూ.. నా పేరు అచ్చమైన తెలుగు పేరు అయినా ఇంక భవిష్యత్తులో.. వేరే ఎవరు పెట్టుకోకుండా చేసిన ట్రేడ్ మార్క్ నాది..  ఇప్పటికీ నను మీరు టీవిలో చూస్తే ఎంతటి వారు అయినా దడ దడలాడాల్సిందే.. .. ఎవరైనా. గయ్యాళి గంప ని చూస్తే " అమ్మో ఆవిడే ..... " అని నాతో పోల్చు కోవాల్సిందే. ఎవరినా మందర మాటలు చెబితే అమ్మో అది నేనే అని పోల్చుకోవాల్సిందే... నేను చేసిన 300 చిత్రాల్లో చాలా వరకు ఒకే తరహా పాత్రనే చేసినా.. ఎవరికీ బోర్ కొట్టించకుండా నిత్య నూతనంగా ఉండేట్టు చేయడమే నా నటనలో ప్రత్యేకత.... నన్ను అందరూ ఆడి పోసుకుంటున్నారు కాని.. నా మనసు నవనీతం.. ఎవరికైనా ఇంత పెట్టకుండా తినడం.. నా జీవితంలో లేదు.. సినిమా చిత్రీకరణ సమయంలో..నిజ జీవితంలో ఎందరెందరో.. నా చేతి వంట.. నా చేతి చిట్కా వైద్యం.. రుచి చూసిన వారే..నేను చేసిన గుప్త దానాలు ఎన్నో ఉన్నా నేను ఎవరికీ చెప్పుకోలేదు.. నాకు తెల్సి మనసున

జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.)

Image
జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.) . జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను, ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు. . ఇది మెరుపు లేని మబ్బు ఇది తెరిపి లేను ముసురు  ఇది ఎంతకీ తగ్గని ఎండ ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి ఇది గ్రీష్మం  ఇది శిశిరం ఇది దగ్ధం చేసే దావానలం . ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం ఒక్కటి ఒక్కటే సుమండీ ఒక్క జ రీ అం చు తె ల్ల చీ ర విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ,  పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి. అలాగే మరి కొన్ని వ్యాక్యాలు.. ఆశ కొరిక పెద వాడి ను౦చి దనిక... రాజు.. ఆడ.. మెగ .. అ౦దరు ఆ చితిలొ పడి కాలిపొయారు ఎ౦దరిజీవితాలను తగుల పెట్టారు పెడుతున్నారు.. .ఏ నాటిన

ప్రద్యుమ్నుడి పెళ్లి ప్రయత్నాలు..అను ఒక పెళ్ళికాని ప్రసాద్ కధ.!

Image
ప్రద్యుమ్నుడి పెళ్లి ప్రయత్నాలు..అను ఒక పెళ్ళికాని ప్రసాద్ కధ.! (“కాబోయే పెళ్ళికొడుకు లెవరు కాబోయే మామగారితో హాస్య సంభాషణ చేయరాదు. చేసినచో పెళ్లి చేసుకొనే అవకాశం కోల్పోయెదరు.”)  . 1967 లో ప్రద్యుమ్నుడి అగ్రజుడి వివాహం అయింది. వారి అన్నయ్య పెళ్ళిలోనే ఇద్దరు ప్రద్యుమ్నుడిని చూసి ముచ్చట పడ్డారు. (అబ్బే అమ్మాయిలు కాదు, వారి తండ్రులు). ప్రద్యుమ్నుడు మహానందపడ్డాడు. ఫరవాలేదు, తనకీ గిరాకీ ఉందని సంబరపడ్డాడు. వాళ్ళలో ఒకాయన మరీ తొందర పడి, పెళ్లి అయిన మూడో రోజునే ప్రద్యుమ్నుడి ఇంటికి మాట్లాడటానికి వచ్చేసి, ప్రద్యుమ్నుడి నాన్నగారితో మాట్లాడారు. ప్రద్యుమ్నుడి తోటి కూడా మాట్లాడారు. జోర్హాట్ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? లాంటివి అడిగారు. ఉత్సాహంగా ప్రద్యుమ్నుడు, రైలు రూటు బాగా విపులంగా చెప్పాడు. "భీమవరం నుండి నిడదవోలు వెళ్ళవలెను. అక్కడ నుండి కలకత్తా వెళ్ళు మద్రాస్ మెయిల్ ఎక్కవలెను. సుమారు ఇరవై ఏడు గంటల తరువాత హౌరా చేరెదము. అక్కడ నాల్గైదు గంటలు విశ్రాంతి గదులలో విశ్రాంతి తీసుకొనవలెను. ఆ తరువాత సమస్తిపూర్ ఎక్స్ ప్రెస్ లో బరౌనీ చేరవలెను. బరౌనిలో ఒక నాలుగైదు గంటలు ప్లాట్ఫారం పొడుగు, వెడల్పు

"మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం ! (శ్రీ అల్లంరాజు రంగశాయిగారు.)

Image
"మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం ! (శ్రీ అల్లంరాజు రంగశాయిగారు.) . "మామా మోమౌ మామా మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా మే మోమ్మము మి మై మే మేమే మమ్మోము మోము మిమ్మా మామా!! ఈ పద్యానికి అర్థం చూద్దామా. మా = చంద్రుని మా = శోభ మోమౌ = ముఖము గల మామా = మా యొక్క మా = మేథ మిమ్ము, ఒమ్ము = అనుకూలించును మామ మామా = మామకు మామా ఆము = గర్వమును ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము మిమై = మీ శరీరము మేము ఏమే = మేము మేమే మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము ఇమ్ము+ఔము = అనుకూలమగుమా . చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము.  సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.

నిగమ శర్మ అక్క !

Image
నిగమ శర్మ అక్క ! (ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు.) తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు అక్షర రూపాన్ని సంతరించుకున్నాయి.  అలాటి పాత్రలలో నిగన శప్మ అక్కగారి పాత్ర చిరస్మరణీయం!  . తెనాలి రామకృష్ణుడా పాత్రను తీర్చిదిద్దిన విధానమట్టిది.  ప్రబంధయుగంలో వెలసిన గ్రంధాలలో అపురూపమైనది పాండురంగ మాహాత్మ్యం..  నిగమ శర్మోపాఖ్యానము అందొక కథ. . పరమ నిష్ఠారిష్టుడును, మహాపండితుడును, శ్రోత్రియ బ్రాహ్మ ణోత్తముని కొమరునిగాృనిగమశర్మ యుదయిచయించెను.వేదాది సర్వ విద్యలను నేర్చెను.ఉపవీతుడైన యనంతరము వివాహితుడయ్యెను.  విధివశమున వానికి దుర్జన సాంగత్యమలవడెను. దానివలనృసర్వభ్రష్ఠుడయ్యెను. జూదమాడుట,వ్యభిచరించుట, పానము, యిత్యాది సర్వదుర్గుణముల కేలిక యయ్యెను. . ఈవ్యసనములకు వలసిన ధనమునకై యింటనే చౌర్యమారంభించెను.  మాన్యములను తెగనమ్మసాగెను."భ్రష్టస్య కావాగతిః" యనురీతిగా సంచరించుచుండెను. తల్లి యిదియంతయు నెరింగియు పుత్ర వ్్యామోహమున భర్త కెరిగింపకుండెను. వారి భ్రష్టాచారములు మితిమీరిన దశలో పాపమాగృహస్థునకు పుత్ునివిషయము,యితరులవన నెరింగెను. . ఆబ్రాహ్మణగృహస్తునకు అంతకుమున్నె యొక కుమార్తెగలద

పునర్వివాహం ..కుక్కతోక !

Image
పునర్వివాహం ..కుక్కతోక ! (By - Virabhadra Sastri Kalanadhabhatta.) . సుమారు డబ్భై అయిదేళ్ళక్రితం పిచ్చమ్మకు ఆమె మూడో ఏటనే పెళ్ళి అయింది. పదమూడో ఏడు వచ్చేసరికి ఆమె ఐదోతనం కాస్తా బుగ్గయింది. ఇహనేం ఆచారం ప్రకారం సకల లాంఛనాలతో ఆమెని విధవను చేసారు. క్షమించాలి మరీ పచ్చిగా చెప్తున్నందుకు లాంఛనాలంటే గుండుతో సహా.. ఆపైన ఆమె జీవితం వంటింటికే పరిమితం అయింది. ఎవరకీ కనపడకూదదు. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా ఉదయం లేవగానే వారి కళ్ళా బడకూడదు. అల్లాగే ప్రయాణం చేసేవారికి ఎదురురాకూడదు మరి అపశకునంకదా ఒకపూటే భోజనం. రాత్రి విధిగా వుప్పుపిండే ఆహారం. ఏకాదశులు వుపవాసం వంటింటి పని ఆమెదే మడి మడి తద్దినాలలో వంట ఆమేచెయ్యాలి భర్తపోయిన ఏయువతినైనా వితంతువు చేసినప్పుడు కర్మ పదోరోజున ఈమెనే పిలిచేవారు ఆకార్యక్రమ నిర్వహణకు ఆవితంతువును మంచి ముహూర్తం వచ్చేవరకూ ఎవరూ చూడరు గనుక, అంతవరకూ ఆమెను ఈమే కనిపెట్టుకొని వుండాలి ** ** ** మా తర్వాత తరం వచ్చేసరికి యువతులులో చదువుకోవడం, సాంఘీక దురాచారాలను ఖండిచడం వంటి అభ్యుదయ భావాలు పెరిగాయి. . పునర్వివాహాలకు అభ్యంతరాలు తగ్గాయి. తర్వాత తర్వాత అసల

అద్వైతమూర్తి ! (కరుణశ్రీ )

Image
అద్వైతమూర్తి ! (కరుణశ్రీ ) చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ (బాపు గారి సుందరాంగి.)

ఏదో తీరని (తియ్యని ) బాధ ప్రేమ అంటే...

Image
ఏదో తీరని (తియ్యని ) బాధ ప్రేమ అంటే...

అచ్చ తెలుగు తిట్లు!

Image
అచ్చ తెలుగు తిట్లు! (జాజి శర్మ గారి ఆశీర్వచనాలతో.) తెలుగు తిట్లకు ప్రత్యేకతలున్నాయి.  తెలుగువారి అచ్చతెలుగు తిట్లు కొన్ని ఆగ్రహం కాక నవ్వు తెప్పుస్తుంటాయి. కొన్ని ముద్దుగా, మురిపెంగా వుంటాయి. శుంఠ, అప్రాచ్యుడు, మొద్దురాచ్చిప్ప, బఢవ, వెధవాయి, చవటాయి, సన్నాసి, వాజమ్మ, ముద్దపప్పు, బడుద్ధాయి, అవతారం, నంగనాచి, సన్నాసి, నాలిముచ్చు, కుర్రకుంక, వెర్రిమాలోకం, చవట సన్నాసి లాంటి అచ్చ తెనుగు తిట్లు  ప్రతి తెలుగింటా ప్రతిధ్వనిస్తుంటాయి. . నిజానికి అవి తిట్లు కాదు. దీవెనలే. "నేతి గారెలు వేడివేడిగా తింటాడనుకొంటే ఈ సన్నాసి ఎటు వెళ్ళడో?" అని బామ్మగారు దిగులులుపడుతుంది.  మడికటుకొన్నాను. నన్ను అంటుకోకురా భడవా." అని అమ్మమ్మ ముద్దుగా కోప్పడుతుంది.  "మా బడుద్ధాయి ఎంత బాగా పాడతాడో" అని తాతగారు మురిసిపోతారు. అలా!

జాజి శర్మ గారి వర్షం కురిసిన రాత్రి.!

Image
జాజి శర్మ గారి వర్షం కురిసిన రాత్రి.! విక్కీరావు ఆఫీసు పనిమీద ఓ పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది. రాత్రికి అక్కడే బస ఏర్పాటు చేసుకున్నాడు. ఆఫీసు పని చేసుకుంటూ సిగరోబీస్ అయిపోయినాయి అని గమనించి విసుక్కుని వాటికోసం బయలుదేరాడు. బస నుండి కిలోమీటర్ నడిస్తేనే కానీ సిగరోబీస్ దొరకలేదు. అవి తీసుకుని వస్తుంటే వర్షం మొదలయ్యింది. కాస్తంత దూరంలో గొడుగుతో ఓ వ్యక్తి వెడుతుంటే విజిల్ వేశాడు. ఆ వ్యక్తి విజిల్ వినబడి ఆగి వెనక్కి చూశాడు. విక్కీరావుని రమ్మని సైగ చేశాడు. విక్కీరావు గొడుగులోకి వచ్చి "థాంక్స్" అని " సారీ! విజిల్ వేశినందుకు" అన్నాడు. " పర్వాలేదు! అలా విజిల్ వేశే నన్ను అంజలి నన్ను ఆకట్టుకున్నది " అన్నాడా వ్యక్తి " అలాగా ! అంజలి అదృష్టవంతురాలు . మీలాంటి పరోపకారులను చేసుకున్నది" " ఆ! ఏం అదృష్టం లెండి. అంజలిని నేను చంపేశాగా ?" అన్నాడా వ్యక్తి " చంపేశారా " అన్నాడు విక్కీరావు కంగారుగా " భయపడకండీ ! నేను మిమ్మల్ని చంపనులెండి. అంజలిని చంపినందుకు నన్ను ఉరి తీశారుగా " అని గొడుగుతో మాయమయ్యడు ఆ వ్యక్తి. ( సిగ

అమ్మక చల్ల....జానపద గేయము!

Image
అమ్మక చల్ల....జానపద గేయము! . ఓయిఓయిఓయి ఓకాపు పిల్ల! . తాటిమేకలచల్ల తాగడే గొల్ల . నిన్న మొన్నటిచల్ల నేటిక్కి పుల్ల . కవ్వాన్ని తిప్పింది కమ్మన్నిచల్ల.x

ప్రతిబింబం లేక అద్దం చేసిన మాయ !

Image
శుభోదయం.! . ప్రతిబింబం లేక అద్దం చేసిన మాయ ! అద్దం కొత్తగా వచ్చిన రోజులు. పోలంనుంచి వస్తున్న సుబ్బయ్యకు దారిలో ఓ అద్దంముక్క దొరికింది. అందులో ఉన్నది ఎవరో ఆయన గుర్తుపట్టలేదు. చనిపోయిన తన తండ్రి అలా కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు. ఆ అద్దం ముక్కను ఇంట్లో ఓచోట దాచిపెట్టి రోజు ఆయనకు అవి ఇవి కబుర్లు చెబుతుండేవాడు.  సుబ్బయ్య ధోరణితో భార్యకు అనుమానం వచ్చింది. ఆయన పొలానికి వెళ్ళినప్పుడు తిసిచూస్తే ఏముంది? అందులో 30 ఏళ్ళ అందమైన స్త్రీ కనిపించింది. అంతే! భర్తకు ఎవరితోనో సంబంధముందని ఆవిడ లబోదిబోమంది పక్కింటి పార్వతమ్మను పిలిచి- ఆయనేలాంటి పనిచేశారో చూడు అని కన్నీరు పెట్టుకుంది. ఏది చూద్దామని పార్వతమ్మ అద్దం చేతిలోకి తీసుకొని- ఏయ్ పిచ్చిమొహమా.... ఇంత ముసలావిడతో మీ ఆయన తిరుగుతున్నాడని ఎట్లా అనుకుంటావే.... ఎవరైనా వింటే నవ్విపోతారు అంది. (పొన్నాడ మూర్తి గారి చిత్రం.@Pvr Murty )

చిన్నారి ధర్మ సందేహం!

Image
చిన్నారి ధర్మ సందేహం! . ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది *చిన్నారి: అమ్మా! నాన్నా! మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు?*  * అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు. *చిన్నారి: మన బీరువాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి?* *నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెలతారా ఎంటమ్మా? *చిన్నారి: మీ ఎటియం కార్డ్ ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి?* *నీకేదో అయ్యింది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి, విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు. చిన్నారి : అలా అయితే నన్ను మాత్రము ఆయా దగ్గర వదిలేసి వెళ్తునారెందుకు? నెను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ? ఈ సారి ఆ తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి వారికి, పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాదానం లేదు. *నేటి జీవన విధానం ఇది.* మారుతున్న కాలంలో  డబ్బు మోజులో పడి తిండిని మానేస్తున్నాము, డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము. డబ్బు మోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము. డబ్బు మోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము. డబ్బు

"కరటక్", "దమనక్" లు.

Image
శుభోదయం.! "కరటక్", "దమనక్" లు.....ఇద్దరికీ చచ్చు తెలివితేటలూ ఎక్కువ !! వీళ్లు, విజయ వాడ లో, రైలు ఎక్కారు!!...అమరావతి వెళ్ళడానికి!! అన్ని కమ్పార్ట్మెంటు లూ జనం తో కిక్కిరిసి వున్నాయి! వీళ్ళకి సీటు దొరక లేదు!!! అంతలో "కరటక్" గాడు తన బేగ్ లోంచి ఒక రబ్బర్ పాము తీసి , "పాము...పాము!!" అని అరుస్తూ కమ్పాట్మెంట్ లో పడేసాడు!! ప్రయాణికులు అన్దరూ భయపడి, ఆ బోగీ ని ఖాళీ చేసి దిగిపోయారు!! "కరటక్", "దమనక్" లు , ఇద్దరూ వాళ్ల అమాయకత్వానికీ, తమ తెలివి తెటలకీ మురిసి పొతూ, హాయిగా కాళ్లు జాపి బెర్త్ ల మీద పడుకున్నారు !! మరునాడు చాలా బద్ధకం గా లేచారు!! రైలు ఒక స్టేషన్ లో ఆగి వుంది !!! "కరటక్", "దమనక్" లు, డోరు తీసి, ఒక టీ అమ్మేవాడిని పిలిచి, టీ తాగుతూ అడిగారు, "ఇది ఎ టేశను బాబూ??" అని "విజీ వాడ అండి" అన్నాడు వాడు!! "అదేమిటీ?! ట్రైన్ అమరావతి వైపు కాదా వెళ్లాలి ...ఇక్కడ ఎందు కుంది??!!ఇది అమరావతి ట్రైను కాదా??"అని ఖంగారు పడుతూ అడిగారు "కరటక్", "దమనక్" లు

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

Image
శివోహం !! ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః | సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ |.. . ఓ శంభో.!నా ఆత్మయే నీవు; నాలో బుద్ధిగా పనిచేయున్నది సాక్షాత్తూ గిరిజాదేవియే (పార్వతీ దేవి); నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు); నా ఈ శరీరమే మీ గృహము; ఈ శరీరముద్వారా నేను అనుభవించెడి విషయ భోగములన్నియూ నేను మీకు ఆచరించుచున్నట్టి పూజయే; నా నిద్రే సమాధి స్థితి; నా పాదములద్వారా నేను చేస్తున్న సంచారమంతా మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే; నే పలుకుచున్న మాటలన్నీ మీ స్తోత్రములే; నేను చేయుచున్నట్టి కర్మలన్నీ, ఓ శంభో, మీయొక్క ఆరాధనయే! (మనం చేయు ప్రతి పని లోను సదా శివుని పూజ ఉన్నది అని అర్ధం.)

నేనెల ఉ౦టున్నానో

Image
@ మా అమ్మ @ నేనెల ఉ౦టున్నానో ఇప్పుడు అద్ద౦ చెప్తు౦ది ఒకప్పుడు ఎలా ఉ౦డే వాడినో మా అమ్మ క౦డ్లు చెపుతున్నాయి x

@ మా అమ్మ @

Image
@ మా అమ్మ @ ఆకలిప్పుడు నా కడుపుకు తెలుస్తు౦ది ఒకప్పుడు అది మా అమ్మ గు౦డెకు తెలిసేది

ఏల ప్రేమింతును? ---- దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

Image
ఏల ప్రేమింతును? ---- దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. .  సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? .  చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? .  ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? ..  మావిగున్న కొమ్మను మధుమాసవేళ .  పల్లవము మెక్కి కోయిల పాడుటేల? పరుల తనయించుటకొ? తన బాగు కొరకొ గానమొనరింపక బ్రతుకు గడవబోకొ?

శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'!

Image
శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'! (మనకు .. మరచి పోలేని సుగంధలు ఇచ్చి మాయమయిన మహానటి సావిత్రి ) , అనుకున్నాను అధర సౌందర్యం చూచి  ఆడంబరం ఆహార్యం చూచి  నీ బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చటే అని .  హరివిల్లు రంగుల్ని  వలువలుగా చుట్టుకున్న నువ్వు  మరు నిముషంలో  మటుమాయం ఔతావని అయితే అన్నన్నా !!..  .  నీ భాగ్య మేమని వర్ణించను  ఎన్ని లావణ్యాల్ని స్పృశిస్తావో  ఎన్ని మాలిన్యాలు నిర్ములిస్తావో ఎన్ని కాంతి కేరింతలని మోసుకోస్తావో  ఎంతహాయి వెల్లువని తరలించు కోస్తావో అరిగి పోయి కరిగిపోయి తరిగిపోయి  నివురై ఆవిరై కనుమరుగై పోతావు .  ఒక్క క్షణమైతే నేమి  వెన్నెల ముద్దగా వెలిగి  ఒక్క నిముసమైతే నేమి  వన్నెల వాకిళ్ళు కలయ తిరిగి  .  వేయి వసంతాల సోయగాన్ని సొంతం చేసికొన్న సౌగంధికావనమా ! నీ జీవన రాగానికి జేజేలు  నీ అసమాన త్యాగానికి జోహారు

వ్యర్ధులుగా గిరాటేస్తున్న ఈ వృధ్ధులెవరు? .

Image
వ్యర్ధులుగా గిరాటేస్తున్న ఈ వృధ్ధులెవరు? . ఒకనాడు నీ పుట్టక కోసమే తపించి, తపస్సులు చేసిన దశరధులు. కంట్లో కను పాపలా..కడుపులో కాచుకున్న కౌసల్యలు..కదూ? మరి నేడు వీరిగమ్యం....వృద్ధాశ్రమము! (R Damayanthi R Damayanthi ..గారికి కృతజ్ఞలతో.)

వడ్డాది పాపయ్య గారి వినాయకుడు!

Image
వడ్డాది పాపయ్య గారి వినాయకుడు! వడ్డాది పాపయ్య గారి వర్ణ చిత్రాల కోసం చందమామ కవర్ పేజిలు చూస్తోండగా ఈ బొమ్మ కనిపించింది. విఘ్నేశ్వరుడు ధారావాహిక కోసం వేసిన ఈ బొమ్మ చాలా చిత్రం గా అనిపించింది..! పైబొమ్మ - లోభ గుప్తుడనే వ్యాపారి తన స్నేహితుడైన సత్యగుప్తుడిని మోసం చెయ్యబోతే విఘ్నేశ్వరుడు ఎలా అతనికి శాస్తి చేసాడో తెలిపే కథకి చిత్ర రూపం. క్రింద బొమ్మ - కలహ కంఠి అనే ఒక గయ్యాళి అత్త విఘ్నేశ్వరుని భక్తురాలైన తనకోడలిని రాచిరంపాన పెట్టినా చివరకు ఆమెకే విధంగా శాస్తి జరిగిందో చెప్పే కథ కు ఇది బొమ్మ గా వేసారు మన వపా !!  అయితే కవర్ పేజీ పైన వేసే వపాగారి రెగ్యులర్ శైలికి భిన్నం గా ఇది కార్టూన్ వేసినట్టుగా అనిపించింది..కథ యొక్క సాంఘిక / జానపద నేపథ్యం వల్లనేమో మరి..??!!  సాధారణంగా కవర్ పేజి మీద ఒకటే బొమ్మ వుంటుంది కానీ ఇది రెండుబొమ్మల తో, చుట్టూ గోల్డ్ కలర్ ఫ్రేం తో చిత్రంగా అనిపించింది.  పైగా ఇవి రెండూ కూడా ఒకే సంచిక లోవి కాదు..1 982 జూన్ , జులై లలో పడిన రెండు కథల బొమ్మలు ఇవి..మరి అలా ఎందుకు వేసారో!! **** పోన్లెండి..దానిగురించి వదిలేసి. .వపా గారి ఇంకో బొమ్మ: వినాయకుడు ఎన్ని భంగి

అక్షర పద్యవిన్య ాసాలు.... శ్రీ ఆచార్య తిరుమల.

Image
అక్షర పద్యవిన్య ాసాలు.... శ్రీ ఆచార్య తిరుమల.  . హల్లుతో వాక్యాలు, పద్యాలు ఎలా రాసారో చూద్దాం. ‘క’ గుణింతంతో.. “ కాకీక కాకికి కోక కాక కేకికా?”-  కాకి ఈక – కాకికి – కోక కాక – కేకికా (నెమలికా)?” అని దీనర్ధం.  . అలాగే న గుణింతంతో ఓ పద్యం: నానా నన నా నున్న న నూనను నిన్ననెను నేను నున్ను ని నిననై నానీ నను నానా నను నానూన యనంగ నొంటి యక్షరమయ్యెన్!!

శబ్దం ద్వారా అర్థం!

Image
శబ్దం ద్వారా అర్థం! .  ప్రసిద్ధమైన అల్లసాని పెద్దన పద్యం: . అట జని కాంచె భూమిసురుడంబర-చుంబి శిరస్సరజ్ఝరీ- పటల ముహుర్ముహుర్-లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన- స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్,  కటక కరేణు దీర్ఘ కరకంపిత సాలము శీత శైలమున్ . బయటకు గట్టిగా చదిబినచో శబ్దం ద్వారా అర్థం గోచరించును.... అదే ఈ పద్యం ఒక్క ప్రచేకత...

వెయ్యి పడగలు ...ఒక సమీక్ష ! .

Image
వెయ్యి పడగలు ...ఒక సమీక్ష ! . (శ్రీ Vadrevu Ch Veerabhadrudu గారు,!) . 'ఈ విద్య దేనికి పనికివచ్చును? ఒక్క తుపాకిముందు నిది యెందుకును పనికిరాదు. ఒకవేళ పనికివచ్చినను చేసెడిదేమి? దేశమున కింకనే విద్యయు అక్కరలేదు.' 'ప్రతి విద్యకును నాల్గు దశలు! అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణము లని. అవి నాల్గు కలిసినచోటే విద్యకు సంపూర్ణమైన స్థితికలదు.  నేనొకటి చదువుకుని అది ఇతరులకు చెప్పి దాని నాచరించి యితరుల చేత దాని నాచరింపచేయుట అనునవి నాల్గుదశలు. తనకర్థము కాని దాని నాచరించుటయు, అర్థమైనదాని నాచరించకుండుటయు మన శాస్త్రాలలోనే లేదు.' 'విద్య యనగానేమి? అక్షరములు నేర్పుటయు,  వంకర దస్తూరి వ్రాయించుటయునా? ప్రతివానికిని సంగీతజ్ఞానము, లయజ్ఞానము కూడ సునిశితమై యుండుట విద్యావిధానములో ప్రధానమైన విషయము. మన పూర్వులు చదువనగా హృదయపరిపాకము కలిగించునది యని యనుకొనిరిగాని కేవలం చదువుట, వ్రాయుట మాత్రమే చదువనుకొనలేదు. పూర్వము విద్యయే యుండినది,లేనిదిప్పుడు.. .' వెన్ను మీద ఛళ్ళున చరిచినట్టున్న ఈ వాక్యాలు విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు 'నవలలోవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో వైతాళ
Image
పండితుడు–పాలమ్మి!! (విలువ: సత్యము;అంతర్గత విలువ:శ్రధ్ధ) - ఒకప్పుడు ఒక గ్రామంలో బాగా చదువుకున్న ఒక పండితుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక పాలమ్మి ఈ పండితుడి ఇంటికి వచ్చి తెల్లవారుఝామునే పాలు పోసివెళ్ళేది. ఒకరోజు ఆమె పాలు పొయ్యటానికి పండితుడి ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చింది. అందువల్ల పండితుడికి చాలా కోపం వచ్చి ఆమెను ఆలస్యమునకు కారణం అడిగాడు. నది దాటటానికి పడవవాడు రావటం ఆలస్యం కావటంవలన తను రావటానికి ఆలస్యం అయిందని ఆమె చెప్పింది. పడవవాడి సహాయం లేకుండానే నదిని దాటవచ్చునని పండితుడు పాలమ్మికి చెప్పాడు. హరి నామమును స్మరిస్తూ నదిని సులువుగా దాటవచ్చునని పడవ అవసరంలేదని పండితుడు ఆమెతో అన్నాడు. హరినామస్మరణతో సంసారమనే సాగరమునే సులువుగా దాటగలిగినప్పుడు చిన నదిని దాటటంలో కష్టం ఏముందని పండితుడు అన్నడు. పండితుడి మాటలను పాలమ్మి చాలా శ్రద్ధగా ఆలకించింది. మరునాటి ఉదయం పాలమ్మి రోజూ కంటే త్వరగా పండితుడి ఇంటికి పాలు పొయ్యటానికి వెళ్ళింది. అంతత్వరగా ఎలా రాగలిగావని పండితుడు మళ్ళీ అడిగాడు. క్రిందటిరోజు పండితుడు చెప్పిన ప్రకారమే పడవవాడి కోసం ఎదురు చూడకుండా హరినామమును స్మరించుకుంటూ నదిని దాటి వచ్చేశానని పాలమ్

ధూళిపాళ సీతారామ శాస్త్రి !

Image
ధూళిపాళ సీతారామ శాస్త్రి ! . ధూళిపాళ, ఈ పేరు వినగానే మనకి సాధారణంగా ఒక కామన్ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది ఆ పాత్రతో సహా.. “అని గట్టిగా అనరాదు,వేరొకరు వినరాదు, అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్థుడై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం, ఒకవేళ నీవు పోకపోయిననూ యాగమా ఆగునది కాదు, పోయినచో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది, ఎదిరి బలాన్నీ, బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల కురుసార్వభౌముడు మాననీయుడూ,మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో,ఆపైన కొంచపు వంచన పనులన్నిటికీ అయిన వాడ్ని అమ్మ తమ్ముడ్నీ నేనున్నానుగా… ముల్లుని ముల్లుతోటే తియ్యాలి,వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి, కనుక హిత పురోహిత ధృత్య వాక్య సామంత దండనాయక వారవనితా జనతా నృత్య నాట్య కళావినోదమనోహరంబగు పరివారంబుతో,చతురంగ బలసమేతులై, శతసోదర సమన్వితులై శ్రీ శ్రీ శ్రీ గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థానికి వెళ్ళవలసిందే,రాజసూయాన్నిసందర్సించవల్సిందే” అంటూ రెండు అరచేతుల మధ్యా పాచికల్ని రాపాడి, పితుహూ అని అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ, ఎడమ చేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ, ఐమూలగా మొహం పెట్టి ఎడమ కనుబొమ

అట్లా తద్దోయ్ ...ఆరట్లో ముద్ద పప్పోయి.. ముడుఅట్ట్లోయి

Image
అట్లా తద్దోయ్ ...ఆరట్లో ముద్ద పప్పోయి.. ముడుఅట్ట్లోయి అని ఆడపిల్లలు...  అట్లా తద్దోయ్..ఆడపిల్లలోయి..అనిపల్లెరుకాయలు వారికంటే లేచే  అల్లరి మగపిల్లలు... అక్కలువెంటమేము ఎంతో సరదాగాఉండేది. విశాలి పేరి గారి చక్కని స్కెచ్ మీకోసం.. . కరివేపాకు, ఇంగువ పోపు లేకుండా కూరలు రుచించవు కదా! ఇలాగే వేస్తూ ఉంటే ఎదురింటి 'కెలీ ' ఇంటి చుట్టూరా రూమ్ స్ప్రే కొట్టేసేది. మా వంటిల్లు ఆవిడ హాలు పక్క పక్కనే. నేను వండుతుంటే అగర్బత్తిలాంటిది వెలిగించి ఇంటి ముందు పెట్టేది. "సమ్ స్టింకీ స్మెల్ " అనేది ఇంగువ పోపు వేస్తే.. సూర్యేకాంతం లా " అప్రాచ్యపు దానా ఇది ఇంగువే " అనాలనిపించేది. వారాంతరాలలో ఆవిడ వండే బీఫ్, పోర్కు భరించలేక మేము తలుపులు ముసుకునే వాళ్ళమే కానీ ఏమి అనలేకపోయాము. ఒకసారి అట్లతద్దికి తెల్లవారుఝామునే లేచి నేను ఉట్టివెన్న ముద్ద తింటుంటే ఆ 'కెలీ ' కాలం ప్రతికూలించి అదే టైం కి లేచింది. లేచింది ఊరుకోకా మా కిచెన్ లో లైట్ వెలుగుతోందని బయటకు వచ్చి కిటికీలోంచి చిన్నగా చూసింది. ఆవిడ చూడడం నేనూ చూశా, కానీ ఆ టైం లో పలకరింపులు ఎందుకనీ చూడనట్టే ఉన్నా. అంతే.. 'కీల

ఉత్తమా యిల్లాలు......బాపిరాజు గారి ఎంకి.!

Image
ఉత్తమా యిల్లాలు......బాపిరాజు గారి ఎంకి.! ఉత్తమా యిల్లాలి నోయీ నన్నుసురుపెడితే దోస మోయీ నిదరలో నిను సూసి సెదిరెనేమో మనసు పొరుగు వోరంత నా సరస కురికారంట ఉత్తమా యిల్లాలి నోయీ ... ఏలనే నవ్వంట ఏడుపేలే యంట పదిమంది ఆయింత పగలబడి నారంట ఉత్తమా యిల్లాలి నోయీ ... గాలెంట వోయమ్మ దూళెంట వోయమ్మ యిరుగు పొరుగోరంత యిరగబడి నారంట ఉత్తమా యిల్లాలి నోయీ ... యీబూది వొకతెట్టె యీపిం కొకతె తట్టె నీలు సిలికే దొకతె నిలిపి సూసే దొకతె ఉత్తమా యిల్లాలి నోయీ ... సాటునుండే యెంకి సబకు రాజేశావ పదిమంది నోళ్ళల్లొ పడమంట రాశావ ఉత్తమా యిల్లాలి నోయీ ...

ఎప్పటికీ నిండు జవ్వని ఎంకి.!

Image
ఎప్పటికీ నిండు జవ్వని ఎంకి. ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి మెళ్ళో పూసల పేరు తల్లో పూవుల సేరు కళ్ళెత్తితే సాలు: రాసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల. పదమూ పాడిందంటె కతలు సెప్పిందంటె కలకాలముండాలి. అంసల్లె, బొమ్మల్లె అందాల బరిణల్లె సుక్కల్లె నా యెంకి అంటూ ఎంకిని సృష్టించారు నండూరి వారు x

ఓహో యాత్రికుడా ఓ హోయాత్రికుడా,,,

Image
ఓహో యాత్రికుడా ఓ హోయాత్రికుడా ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా ఉదయారుణ కాంతిబింబ సదనము దేశ పయనిన్తువోహూ ఉదయపూర్న మృదుల గాన సుధలు చల్లి మధుపధాన శీతల హేమంతకాల శిధిలజీర్ణ పర్ణశాల వదలి కదలి వచ్చితి వోహో //ఓఓ హోయాత్రికుడా // ఆంధకార పూర్ణదిశా బంధనమ్ము సడలించుక సింధువాహతురంగ మశ్చందనమ్ము గదలించుక సింధుఫారపూర్వదిషా సుందర తీరమ్ము చేరునో యాత్రికుడా // ఓహో యాత్రికుడా // శీతల హెమంతకాల శిధిలజీర్న పర్ణశాల వదలికదలివచ్చితివోహోయాత్రికుడా //ఓహో యాత్రికుడా // ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా చైత్రమాస కుసుమలతా పచ్చతోరణమ్ము లూగ చిత్ర చిత్ర కలవిహంగ గాత్ర నిస్వనమ్ము రేగ మిత్రవరా నేడు నీ పవిత్రయాత్ర సాగింతు వొహో ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా//యాత్రికుడా// (ఈ పాటరచయిత మరియు గాయకులు శ్రీ సాలూరి రా జెశ్వర్ రావు గారు ..విడియో రూపంలో సమర్పణ నాది.) 

అల్లసాని వారి అవసరాలు......కావ్యరచనా ప్రరోచనా సామగ్రి !!.

Image
అల్లసాని వారి అవసరాలు......కావ్యరచనా ప్రరోచనా సామగ్రి !!. . ఆశువుగా కవిత్వం చెప్పడం ఆషామాషీ కాదు,  అందుకు ఏమేం కావాలో సెలవిస్తున్నాడు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ఇవన్నీ ఉంటేగాని కృతి కూర్చడం వల్లకాదని ప్రభువు కృష్ణదేవరాయలకే విన్నవిస్తాడు. భంగపాటుకు ఆస్కారం లేని ఏకాంతపు స్థలమట, ఆత్మకింపయిన భోజనమట,  ఆ పై ప్రియరమణి తాంబూలం తెచ్చివ్వాలట,  మేను వాల్చడానికో ఊయల మంచమట... అంతటితో చాలదు,  తప్పొప్పులు ఎత్తిచూపగల రసజ్ఞులట,  తానేమి చెబుతున్నానో ఊహించగల ఉత్తములగు లేఖకులు-పాఠకులు... ఇవన్నీ సమకూరితే కాని, ఊరకే కావ్యాలు రచించమంటే అయ్యే పని కాదని స్పష్టం చేస్తాడు ఈ కవివరేణ్యుడు.  ఇదే పెద్దన ఇంకో సందర్భంలో ఆశుకవిత్వమంటే ఏంటో పేరిణి శివతాండవమాడినట్టు ఆడి, తన తడాఖా చూపించాడు. "కృతి వినిర్మింపు మొకటి మాకు శిరీషృ సుధామయోక్తుల పెద్దనార్య! "-  అనిరాయలవారు పెద్దన్న గారి నడిగినారట. దానికి సమాధానంగా రాయలకు  పెద్దన్న చెప్పిన సమాధాన మేమిటో వినండి! . చ: నిరుప హతి స్థలంబు; రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క ప్పుర విడె ; మాత్మకింపయిన భోజన ; మూయెల మంచ; మొప్పు,త

ఒట్టు! నాకనిపిస్తోంది.

Image
ఒట్టు! నాకనిపిస్తోంది... ఒట్టు! నాకనిపిస్తోంది .... నన్నయ్య ఒక్కసారి అమ్మయ్య అనుకున్నట్టు .... పెద్దన తంబులంలో 'తెలుగు వక్క పలుకులు' వేసుకున్నట్టు.... శ్రీనాథుడు కనకాభిషేకం చేసొచ్చి తెలుగుతల్లి పాదాలు ముట్టుకున్నట్టు .... శ్రీ శ్రీ ఘాటుగా రెండు దమ్ములు లాగినట్టు .... చలం గడ్డాన్ని సవరించుకున్నట్టు ..... ఇహ... విశ్వనాథా! మన భాషకి ఒహల్లిచేదేమిటి హోదా! అని గర్జించినట్టు .... ఒక సనాతన పరిమళం ఆవరించి తెలుగు నేల పులకరించినట్టు.... ఈ సంతోష సంబ్రమంలో నా కళ్ళు చేమరినట్టు.... ప్రాంతీయ భేదాలు మరచి తెలుగోల్లంతా కలసికట్టుగా చెయ్యెత్తి జై కోట్టినట్టు .... ఒట్టు! నాకనిపిస్తోంది.... - ఇట్లు మీ తనికెళ్ళ భరణి

ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.

Image
నండూరి వారు “ఎంకి”ని సృష్టించి అరవై ఏండ్లు ఫైననిండాయి. . అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే. నిండు జవ్వని-నిండు యవ్వని ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి మెళ్ళో పూసల పేరు తల్లో పువుల సేరు కళ్ళెత్తితే సాలు: రసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల. పదమూ పాడిందంటె కతలూ సెప్పిందంటె కలకాలముండాలి. అంసల్లె, బొమ్మల్లే అందాల బరిణల్లే సుక్కల్లె నా యెంకి అంటూ ”ఎంకి”ని సృష్టించారు నండూరి వారు.

మనిషి-జంతువు*!

Image
మనిషి-జంతువు*! "మనిషి". "మాట్లాడే బుద్ధజీవి" అని మనిషిని జంతుశాస్త్రం అభివర్ణిస్తుంది. మన సంస్కృతి జంతువులకు అసమాన ప్రాధాన్యం ఇచ్చింది. దేవతల పక్కన ఏదో ఒక జంతువుంటుంది. శివపూజకు ముందుగా నందికి నమస్కరించాల్సిందే! ఏనుగు మొర ఆలకించి మహావిష్ణవు ఉన్న పళాన బయలుదేరాడు. ఆ తొందరలో తన వాహనమైన గరుత్మంతుణ్ని సైతం అధిరోహించలేదని పోతన వర్ణించాడు. అయినా ఆయన వెనుకే వచ్చాడు గరుత్మంతుడు. . సత్యకాముడి గురువు హరిద్ర మహర్షి. ఆయన నాలుగు వందల గోవుల్ని ఇచ్చి, మేపుకొని రమ్మని సత్యకాముణ్ని పంపాడు. అవి వెయ్యి గోవులుగా అభివృద్ధి చెందాయి. తిరిగి వస్తున్నప్పుడు మందలోని వృషభం సత్యకాముడికి ఉపదేశం చేసింది. రెండో రోజు అగ్ని, మూడో రోజు హంస. నాలుగోరోజు "మద్గు" అనే నీటిపక్షి ఉపదేశించాయి. వాటి వల్ల సత్యకాముడు తేజస్వి అయ్యాడు. . ఏది సాధించాలన్నా దీక్ష వుండాలి. మన దీక్షలకు ఆదర్శం పశుపక్ష్యాదులే! దీక్షవల్ల అజ్ఞానం అనే పొర తొలగిపోతుంది. కోడి దీక్షతో గుడ్డును పొదుగుతుంది. గుడ్డును పగలగొట్టుకొని పిల్ల బయటకు వస్తుంది. దీన్ని కుక్కుటదీక్ష అంటారు. గురువు అనుగ్రహించే ఈ దీక్షవల్ల శిష్యుడు అజ్ఞానమనే అ

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై పాడే నా హృఉదయం

Image
శుభోదయం! తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై పాడే నా హృఉదయం  . అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలి మంచు తెరలే తరలి యెరుగని వింతలు యదుటే నిలిచి వెలుగే వికసించే ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం ...(శ్రీ శ్రీ )

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" ! .

Image
"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" ! . "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి. ఉలుకు పలుకు లేని రాతి ప్రతిమల రమణీమణుల ప్రబంధ నాయికా ప్రపంచంలో మాట పాట నేర్చిన వలపుల వయ్యారి వరూధిని. అవయవాలే తప్ప ఆత్మలు లేని కావ్య నాయికా లోకంలో ఇష్టాలు, కోరికలు, కోపాలు, తాపాలు, ప్రణయాలు, విహారాల అనుభూతులు విరబూసిన విరి మంజరి సజీవ సుందరి వరూధిని. ఆమె ప్రవహించే ఒక యౌవన ఝరి, దహించే ఒక ప్రణయ జ్వాల, మిరుమిట్లు కొలిపే ఒక సౌందర్య హేల, ఒక విరహ రాగం, ఒక వంచిత గీతం, ఒక విషాద గానం. ఆంధ్ర కవితా పితా మహుడు అల్లసాని అంతరంగంలో వికసించిన ఒక అపురూప భావనా మల్లిక. తెలుగు పంచ మహా కావ్యాలలో ప్రథమ ప్రబంధం మను చరిత్ర. మార్కండ ేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసికొని తన అద్భుత కవితా ప్రావీణ్యంతో ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు పెద్దన. ఒక వరణా తరంగిణిని, ఒక అరుణాస్పద పురాన్ని, ఒక ప్రవరుని ఒక వరూధినిని, ఒక