ఈ కాకా హోటల్‌ (పేస్ బుక్.)లో చర్చ!

ఈ కాకా హోటల్‌ (పేస్ బుక్.)లో చర్చ!

.

అసలు అందం అంటే మహానటి సావిత్రిదేనండి.. 

ఎం అందం, ఏం అభినయం. కన్యాశుల్కం చూశారా?

లొట్టిపిట్టలు అంటూ నవ్వుతూ ఆమె చెప్పే డైలాగు మనను గిలిగింతలు పెట్టి కవ్విస్తున్నట్టుగా ఉండదూ ’’

‘‘కన్యాశుల్కం నాటకమైనా సినిమా అయినా నాకు నచ్చలేదు అన్న పిచ్చొడ్ని నేను మొదటి సారి చూస్తున్నాను. కన్యాశుల్కం నాటకంలోని ప్రతి డైలాగు ఇప్పటికీ కంఠతా వచ్చిన వాళ్లున్నారు. దేవదాసులో అంత చిన్నవయసులో సావిత్రి ఎంత పరిణితి కనబర్చిందండి. ఏం నటన ఏం నటన. ’’

’’

‘‘ సరే ఏం చేస్తాం మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి. మహానటి సావిత్రి గురించి మాట్లాడితే వినేంత ఓపిక కూడా మీకు లేదు.. దానవీర శూరకర్ణ చూశారా? తెలుగు సినిమా చరిత్రలో అజరామరమైన సినిమా అది. ఒక్కో డైలాగు ఒక్కో ఆణిముత్యం కదటండి. ఏమంటివేమంటివి? ఇది క్షాత్ర పరీక్షే కానీ... చిత్రం భళారే విచిత్రం .... ఆ సినిమాలో ఎన్టీఆర్ ఆరున్నర కిలోల కిరీటం, మూడు కిలోల 534 గ్రాముల బరువైన నగలు, రెండు కిలోల బరువున్న పాదరక్షలు, ఆరకిలో మేకప్ ఉపయోగించారు తెలుసా? ’’

మనమిప్పుడు మాట్లాడుకోవలసింది ఓలమీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? అనే పాటలో ఎన్టీఆర్ హీరోయిన్ పిరుదులపై ఎన్ని సార్లు కొట్టారు. 

తన పిరుదులను ఎన్నిసార్లు తిప్పారు అని కాదండి. 

ఎట్టాగో ఉన్నాది ఓలమీ ఏటేటో అవుతుందే చిన్నమ్మి అంటూ వాణిశ్రీ కొంగు జారినప్పుడు చూసి అక్కినేని ఎన్నిసార్లు బొర్లాపడిపోయాడు. 

మోనాలిసా మనం ఎటు నుంచి చూసినా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. ఇదెలా సాధ్యం అయిందంటారు.?

‘‘ ఈ చర్చ నాకు నచ్చలేదు అంటున్నాను. ’’

‘‘ ఈ కాకా హోటల్‌లో మనం చర్చించుకోవడానికి ఇంత కన్నా ముఖ్యమైంది ఏముంది? మీకు సావిత్రి అన్నా పడదు. ఎన్టీఆర్ నచ్చరు, అక్కినేని అంటే గిట్టదు. పోనీ జెమ్స్‌బాండ్ కృష్ణ గురించి మాట్లాడుకుందామంటే ముఖం చిట్లిస్తారు. 

వాణిశ్రీ చీరల గురించి తెలియకుండానే ఆ వయసు దాటి వచ్చారా?

ఈ సబ్జెక్ట్స్ గురించి చర్చిచేంత అవగాహన మీకు లేకపోతే పోనీ జబర్ధస్త్ ప్రోగ్రామం గురించి మాట్లాడుకుందామా? ’’

‘‘వాటి గురించి నాకు తెలియదు’’

‘‘మీరు కళాకారులను అవమానిస్తున్నారు, జాతి నాయకులను అవమానిస్తున్నారు జాతీయ నాయకులను అవమానిస్తున్నారు. చివరకు బాబా సాహేబ్ అంబేద్కర్‌ను సైతం అవమానిస్తున్నారు. మీ ప్రవర్తన పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా తీవ్రంగా ఉంది. మీకు గాంధీ అన్నా లెక్క లేదు, సర్దార్ పటేల్ అన్నా పట్టింపు లేదు. ఇలాంటి వారిని ఉగ్రవాదులుగా ప్రకటించి దేశ బహిష్కరణ శిక్ష వేయాలి’’

‘‘

‘‘అలా రా దారికి... కుబేరుడు శ్రీవేంకటేశ్వరస్వామికి అప్పిచ్చి ఇంకా వడ్డీ వసూలు చేస్తూనే ఉన్నాడుకదా? అంటే నువ్వు దైవాన్ని కూడా అవమానిస్తున్నావన్నమాట. ఆర్‌బిఐ చేసేది వడ్డీ వ్యాపారమే. ప్రపంచ బ్యాంకు దేశాలకు అప్పులిస్తుంది అంటే నువ్వు ప్రపంచ బ్యాంకుకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కుట్రకు తెర తీస్తున్నావన్నమాట? ’’

‘‘కావాలంటే ఏడాది సస్పెండ్ చేసుకో నన్ను క్షమించి వదిలేయ్ ’’

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!