అమ్మంటే యెవరు?

అమ్మంటే యెవరు?

అమ్మంటే ఆదిదేవత! సృష్టిలో యేదీ తల్లిప్రేమకు సాటిరాదు. అమ్మ ప్రేమకు ప్రతిరూూపం. అమ్మ పిల్లలను పెంచటంకోసంలాలించిపాలించటంకోసం యెవ్నోత్యాగాలు చేస్తుంది. బడ్డలు అభివృధ్ధిపధంలో నడిచేందుకు, వారుజీవితంలో స్ధిర పడేందుకు తండ్రి పాటుబడతాడు. తల్లిది అభిమానం వాత్సల్యం అయితే, తండ్రిది బాధ్యత. వారిరుెణంతీర్చుకోవడం బిడ్డలధర్మం!

అన్నింటికన్నా నదీ జలాలుపునీతమైనవని పెద్దలంటూఉంటారు. కానీ ఆపుణ్య నదీజలాలకన్నా అతిపవిత్తమైనవి, మనకు నిత్యం అతిచేరువగా ఉండేవి మాతృదేవత చరణారవిందాలు. వాటిని సేవిస్తే సునాయాసంగా మనం అత్యంతమైన పుణ్యఫలాన్ని పొందగలమని శ్రీనాధమహా కవిఉవాచ! వినండి -

" సర్వతీర్థాంబువులకంటె సమధికంబు 

పావనంబైన జనయిత్రి పాద జలము; 

వర తనూజుల కఖిల దేవతల కంటె, 

జనని యెక్కుడు సన్నుతాచార నిరతి!

తల్లి గొప్పతనాన్ని వివరంచే యీపద్యం శ్రీనాధ విరచిత కాశీఖండము లోనిది. తల్లిపాదాలను కడిగిన జలం పుణ్య నదీ జలాలకంటే మిన్న యంటాడు.

అందుచేత మాతృపూజనం అవస్య కర్తవ్యం !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!