'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో...

అయిదున్నర దశాబ్దాల క్రితం 'సంతానం' (1955) చిత్రం కోసం ఘంటసాల 

.

పాడిన 'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో...' పాట 

.

ఇప్పటికీ మనసు దోచే మధుర గీతం. 

.

అదే చిత్రం ద్వారా లతా మంగేష్కర్‌ పాడిన తొలి తెలుగు సినీగీతం

.

'నిదురపోరా తమ్ముడా...' మనసును తడి చేసే మంచి పాట! 

.

ఒరియా గాయకుడు రఘునాథ్‌ పాణిగ్రాహి 'ఇలవేలుపు' (1956) చిత్రం కోసం పాడిన

.

'చల్లని రాజా ఓ చందమామా...' నేటికీ ఓ మధురానుభూతి. 

.

'నర్తనశాల' (1963) చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన 

.

'సలలిత రాగ సుధారస సారం...' లాంటి పాటలు 

.

తెలుగువారు ఎవరైనా, ఎన్నటికైనా మరిచిపోగలిగేవేనా?

మరి, మంగళంపల్లి, లతా మంగేష్కర్‌, రఘునాథ్‌ లాంటి అగ్రశ్రేణి కళాకారులను

మొట్టమొదటిగా తెలుగు సినిమాల్లోకి తెచ్చి, ఇలాంటి మధుర గీతాలు పాడించిన సంగీత దర్శకుడు ఎవరో ఎందరికి గుర్తున్నారు?

.

సంప్రదాయ సంగీతాన్ని ప్రాతిపదికగా చేసుకొని, దక్షిణ భారత సినీ సంగీతంలో 

.

సినిమాలోనిసన్నివేశానికీ, సాహిత్యానికీ కొత్త సొబగులు చేకూర్చిన

ఆ సంగీత దర్శకుడు - 

.

కీర్తి శేషులు సుసర్ల దక్షిణామూర్తి గారు!

.

https://www.youtube.com/watch?v=qB-S9ylocY4

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!