మహాత్ముడు.! (కరుణశ్రీ.)

మహాత్ముడు.!

(కరుణశ్రీ.)

నలువదికోట్ల తమ్ముల జీవితమ్ముల

కాయన మాట వేదాక్షరంబు

భీరులనే కర్మవీరుల గావించు

ఆయన పిలుపు శంఖారవంబు

సత్యంబు శాంత్యహింసలకు స్వాగతమిచ్చె

ఆయన బ్రతుకు మహా ప్రయాగ

కొల్లాయితో పిచ్చి పుల్లాయి వలె నుండు

ఆయన దీక్ష లోకైక రక్ష

అతడొక పవిత్ర ధర్మ దేవాలయంబు

అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు

ఆ మహాశక్తి అంత ఇంతంచు తూచ

జాల, మతడొక పెద్ద హిమాలయంబు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!