నా కవిత్వంలొ నేను దొరుకుతాను ! (దేవరకొండ బాల గంగాధర తిలక్. ..ఇది అసంపూర్ణం)

నా కవిత్వంలొ నేను దొరుకుతాను

(దేవరకొండ బాల గంగాధర తిలక్. ..ఇది అసంపూర్ణం)

ప్రబంధాలూ తద్గత వర్ణనలూ చదువుకుంటూ

అల్లాంటివే రాస్తూ కూడా యేదో తృప్తి ఆనందమూ

పొందలేక, ఇంకా యేదో నాకు తెలీనిదేదో

వుందనుకునే బాల్యంలో

.

ఒక్క మునిమాపు వేళ మా వూళ్ళో ఒక కదంబ

వృక్ష ఛాయలో మొదటి సారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 

తమ ఊర్వశీ ప్రవాసం లోంచి

వివరాలీ విభావరీ విలాసాల

నీ మసలు చరణ మంజీరము గుసగుసలో

అన్న గేయం విన్నప్పుడు

చటుక్కున ప్రబంధాల బలవంతపు వర్ణనలూ

బిగుసుకుపోయిన భాషా శరీరాలూ, మా వూరి రోడ్ల మీది దుమ్ము

అన్నీ మాయమయి పొయి

నేను నా లోంచి కదలి పోయి జాలి జాలిగా

గాలిలో చిరు చీకటిలో నక్షత్రాల చిరు కాంతిలో

కలసి పోయి యేదో యేదో అయిపోయిన క్రొత్త చైతన్యం లో

ఆ రాత్రంతా నిద్రపోలేదు.

.

ఆ తర్వాత కొన్ని నాళ్ళకు ఒక పల్లెటూరి పొలిమేరలో

నన్ను నిలబెట్టి ఒక విప్లవ యువకుడు శ్రీశ్రీ "కవితా! ఓ కవితా!"

తన గంభీర కంఠం తో వినిపించినప్పుడు

లక్ష జలపాతాల పాటలూ, కోటి నక్షత్రాల మాటలతో పాటు రాజ్యాలూ

సైన్యాలూ విప్లవాలూ ప్రజలూ శతాబ్దాలూ

నా కళ్ళముందు గిర్రున తిరిగి నేను చైతన్యపు మరో అంచు మీద నిలిచాను

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!