గృహప్రవేశం (1946)

గృహప్రవేశం (1946)

-

1946 లో విడుదలైన చిత్రం ఇంకా చూడటానికి దొరుకుతున్నదీ 

అంటే అది అంతర్జాల మహిమ. 

ఈ చిత్రంలో భానుమతి, ఎల్.వి. ప్రసాద్ లు నాయికా నాయకులుగా నటించారు. 

సంఘ సంస్కరణల పై తీసిన చిత్రం ఇది. 

సవతి తల్లి బలవంతంగా నచ్చని వాడితో పెళ్లి జరపడానికి

సిద్ధపడితే తన తల్లి చెప్పిన "మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఫలితం ఏమైనా సరే" మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఇల్లు వదలి

ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆఖరులో తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది కధానాయిక.

ఇందులో హీరో ఎల్.వి. ప్రసాద్ (అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు) కాగా, ఊహించలేని పాత్రలో భానుమతి వెంటపడి పెళ్లి చేసుకోమని అల్లరి చేసే తుంటరి సి.ఎస్.ఆర్. 

-

సామాజిక సమస్యను వినోదభరితంగా చూపించిన సినిమా ‘గృహప్రవేశం’. ఎల్వీ ప్రసాద్‌గా పేరొందిన అక్కినేని లక్ష్మీవరప్రసాద్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇదే. సమస్య సీరియస్‌దైనా దాన్ని సరదాగా చెప్పాలన్న ట్రెండ్‌కి ‘గృహప్రవేశం’తోనే శ్రీకారం చుట్టారాయన. విజయా సంస్థ ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘షావుకారు’, ‘మిస్సమ్మ’, ‘అప్పుచేసి పప్పుకూడు’ చిత్రాల్లో ఈ ధోరణే కనిపిస్తుంది. మరో విషయమేమిటంటే స్త్రీవాద భావాలు కలిగిన భానుమతి ‘గృహప్రవేశం’ చిత్రంలో అటువంటి తరహా పాత్రనే పోషించడం మరో విశేషం. అంటే 70 ఏళ్ల క్రితమే స్త్రీవాదానికి ఈ చిత్రం మద్దతు పలికిందన్నమాట. దర్శకత్వంతో పాటు హీరో పాత్రను కూడా ఎల్వీ ప్రసాద్‌ పోషించారు. అన్ని వర్గాల ప్రశంసల్నీ పొందిన ‘గృహప్రవేశం’ చిత్రం విడుదలై అక్టోబర్‌ 4కు 70 ఏళ్లు అవుతోంది. 

‘గృహప్రవేశం’ చిత్రానికి బాలాంత్రపు రజనీకాంతారావు పాటలు రాయడంతో పాటు సంగీత దర్శకత్వం కూడా వహించారు. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటంతో తన సోదరుడు నళినీకాంతారావు పేరుతో ఈ సినిమాకు పనిజేశారు. చిత్రంలో పది పాటలు, ఒక పద్యం ఉన్నాయి. పెండ్యాల నాగేశ్వరరావు ఈ చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా పనిచేశారు. ఈ సినిమాలో ఎల్వీప్రసాద్‌కు ప్రముఖ గాయకుడు ఎమ్మెస్‌ రామారావు గళాన్ని ఇవ్వడం విశేషం. అలాగే 1945లో ‘స్వర్గసీమ’తో గాయకునిగా పరిచయమైన ఘంటసాల ‘గృహప్రవేశం’లో ‘మారుతుందోయ్‌ ధర్మము’ అనే పాట పాడారు. ఆయనకు ఇది రెండో పాట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!