కృష్ణ పరంధాముని చద్ది ! (పోతన భాగవత పద్యం )

కృష్ణ పరంధాముని చద్ది !

(పోతన భాగవత పద్యం )

-

మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొకడు


ఒకని కంచములోనిదొడిసి చయ్యనమ్రింగి చూడలేదని నోరు చూపు నొకడు,


యేగురార్గులు చల్దులెలమి పన్నిదమాడి ఊర్కొని కూర్కొని కుడుచునొక్కడు,


యిన్ని యుండగ పంచియిడుట నెచ్చెలితనమనుచు బంతెనగుండులాడునొకడు,


కృష్ణు చూడుమనుచు కికురించి పలుమ్రోల మేలిభక్ష్యరాసి మెసగునొకడు,


నవ్వునొకడు సఖుల నవ్వించు నొకడు ముచ్చటాడు నొకడు మురియునొకడు ,


-


అచ్చపురాల యమునలోపల

ఇచ్చగించి భుజియించితి కృష్ణ

-


ఊరుగాయలును నొద్దికచద్దులును

నారగింపుచును నందరిలో

సారె బాలుల సరసాల తోడ

కోరి చవులు గొంటివి కృష్ణా

-


ఆకసంబున కాపుర ముఖ్యులు

నాకలోకపు నాందులును

కైకొని యజ్ఞకర్తయాతడని

జోక గొనియాడఁ జొక్కితి కృష్ణా

.


పేయలు లేవు పిలువుడనుచు

కోయని నోరఁగూతలును

మాయల బ్రహ్మము మతము మెచ్చుచు

చేయని మాయలు సేసితి కృష్ణా

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!