రమణ మహర్షి - పరమార్థం !

రమణ మహర్షి - పరమార్థం !

-


1937 డిసెంబర్ - 1938 జనవరి మాసాల మధ్య లో రమణ మహర్షి కీ అల్హాబాద్ విశ్వవిద్యాలయ తత్వ శాస్త్రాచార్యుడు డాక్టర్ సయ్యద్ గారి కీ జరిగిన సంభాషణ :

అలహాబాద్ విశ్వవిద్యాలయ తత్త్వ శాస్త్రాచార్యుడు డాక్టర్ సయ్యద్ ఒక ప్రశ్న వేసెను. 

"భగవాన్ , సృష్టి ప్రయోజనమేమి ? " అని ఆయన అడిగెను.

సాధారణముగా శ్రీ భగవానులు తన ప్రత్యుత్తరములు అఱవము లో గానీ మలయాళము లో గాని చెప్పి వాటిని తర్జుమా చేయింతురు. కాని యీ మారు శ్రీ భగవానులు ఇంగ్లీషులోనే భాషించిరి.


“CAN THE EYE SEE ITSELF ?” (కన్ను తనను జూడగలదా ?) అని శ్రీ భగవానులు బదులు ప్రశ్న వేసిరి.


దానికి డాక్టర్ సయ్యద్ "చూడలేదు. అది ఇతరము నంతటిని జూడగలదు. ఒక్క తనను దప్ప” అని జవాబిచ్చిరి.


"మఱి అది తనను జూడగోరితే ? " అని శ్రీ భగవానులు మరల అడిగిరి. 

డాక్టర్ సయ్యద్ ఒక్క నిమిషమాలోచించి ఇట్లు పలికెను.

"అది అద్దములో తన ప్రతిబింబమును మాత్రము చూడగలదు. "


ఈ ప్రత్యుత్తరమును బట్టుకొని శ్రీ భగవానులిట్లు వ్యాఖ్యానించిరి:


"సరి. అట్లే సృష్టి, 'ఐ' తనను జూచుకొనుటకు అద్దము. "


ఇది విని నేను "శ్రీ భగవానులు ఉద్దేశించినది E-Y-E యా, లేక I యా ? "అని అడిగితిని.


శ్రీ భగవానులు "ఉపమానమునకు 'E-Y-E',

పరమార్థమునకు 'I' గ్రహింపవచ్చును. " అని సెలవిచ్చిరి.


(ఇది గుఱ్ఱం సుబ్బరామయ్య గారు వ్రాసిన రమణ 

స్మరణామృతము అనే పుస్తకం -archival special edition – 2000 లో ఉంది.)


~*~

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!