వెటకారం-


-

వెటకారం-

ఎలిక పాము ప్రార్థన - చలం 

(ఎలిక పాము - మన ప్రేవులలో ఉండే/పుట్టే నులి పురుగు)


మానవా ! నీవే మా సృష్టి కర్తవు. నీవె రక్షకుడవు. నీ పేర్లు అనంతములు.

నిన్ను అనేకులు అనేక పేర్ల తో పిలవగా తెలుసుకున్నాము.

నారాయణా ! వెంకటప్పా! జోగులూ ! రంగమ్మా? హుస్సేన్ ! 

పాప, చిట్టీ, రాజు, బాబు - ఇవి నీ పవిత్ర నామములలో కొన్ని ఐవున్నవి.

నీవు శాశ్వతుడవు. నీకు మృత్యువు లేదు. నీవు చండశాసనుడవు.

నీ ఆజ్ఞలకు లోబడి ఈ పేగు భువనములన్నీ ఉదరాకాశమున అత్యద్భుతముగా

నిలిచి యున్నవి.

నీవు భీషణుడవు. అప్పుడప్పుడు పెద్ద భూకంపములను కలుగజేసెదవు. 

నీ ఆజ్ఞాబద్ధులమై కామ క్రోధములను విడనాడి సంసారాపేక్షతో మాత్రమే మా స్త్రీ లతో సంగమించి నీ హృదయమునకు ఆహ్లాదమును వొనగూర్చుచున్నాము.

నీవు ఆగ్రహపరుడవై గద్దించునపుడు మా ప్రాణములు దద్దరిల్లి భయముతో వణికెదము. 

అంత గద్దించి గూడ, మాకే కించిదపాయమును గూడ కలుగజేయవు. ఎంత కరుణామయుడవు ! మేము సేవించుటకై ఈ చీము ను సృష్టించితివి. 

ఈ అప్రమేయవరములకై మేము శత సహస్ర వందనము లర్పించుచున్నాము. 

ఓ మహాప్రభూ ! నీవు శిశుడవు ! లోపరహితుడవు. సమస్త ప్రపంచములకు ఆధార భూతుడవు. నిష్కల్మషుడవు. సత్యరూపా నీకు జోహారు !

****

పై కథ చలం ఫౌండేషన్, విశాఖ పట్టణం వారు ప్రచురించిన బులెటిన్ -8 లో ఉంది. అందులో ఇంకా ఈ కథ గురించి ఇలా వుంది…

ఈ కథ 15-8-1935 చిత్రగుప్త పత్రికలో అచ్చు అయింది. పూర్వ సంపుటాలలో రాలేదు. ఈ కథను పాత పత్రికల నుండి సేకరించి 1982 జనవరి జ్యోతి మాసపత్రికలో పునర్ముద్రించారు. కానీ ఇటీవల విడుదల అయిన చలం సమగ్ర సాహిత్ర్యం-20 సంపుటాలలో కూదా అది చేరలేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!