--ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో.మధ్య తరగతి ఎదవనాయాలా. మహాప్రభో తమరు నన్ను తిట్టారా? లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు. అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట...