ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం ....

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం 

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్


ఈ మంత్రము గురించిన శాస్త్రీయ విశ్లేషన భండారు శ్రీనివాసరావుగారి బ్లాగునుండి ఈ విధముగా సేకరించానుః


“భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం) అర్హుడు. కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.”


ఇంతటి అఖండ అంతరార్ధము కలిగినది కాబట్టే ఈ మంత్రము మన జీవితానికి ఆది మంత్రముగా భాసుల్లుతున్నది. 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!