మహాప్రభో తమరు నన్ను తిట్టారా?

--ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో.మధ్య తరగతి ఎదవనాయాలా.


మహాప్రభో తమరు నన్ను తిట్టారా?


లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా


తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు.


అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు


అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, 70mm అట్టా, MLA అట్టా, నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా " అని అడిగాడు


అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు


అప్పుడు సర్వరు "యే కాపీ మామూలు కాపీయా,స్పెసలు కాపీయా, బుర్రూ కాపీయా, నెస్కాఫీయా, బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా హాటు కాఫీయా, కోల్డు కాఫీయా , నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు " అని అడిగాడు


అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు


అప్పుడు సర్వరు "నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా'


ఆపండి మహాప్రభో, తమలో ఇంత వూహాశక్తి ఉందని వూహించలేకపోయాను. ఈ కథనే సినిమాగా తీసుకోండి. పది వేల రోజులు ఆడుతుంది జనం వ్రుద్దులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనం అయిపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో నన్ను వదిలెయ్యండి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!