భర్తృహరి నీతిశతకం శతకము...

భర్తృహరి నీతిశతకం శతకము...

హర్తుర్యాతి న గోచరం కిమపి శం పుష్ణాతి యత్సర్వదా |

ప్యర్థిభ్యః ప్రతిపాద్యమానమనిశం ప్రాప్నోతి వృద్ధిం పరాం ||

కల్పాన్తేష్వపి న ప్రయాతి నిధనం విద్యాఖ్యమన్తర్ధనం |

యేషాం తాస్ప్రతి మానముజ్ఘ త నృపాః కస్తైస్సహ స్పర్ధతే ||


అన్ని దనంలలోనికీ ఉత్తమమైనది విద్యాదనం. ఎలా అంటే .... ఇది దొంగల చేత దొంగలింప శక్యం గాని సంపద. పైగా నిత్యం సుఖ సంతోషాల్నిస్తుంది. దీన్ని కోరిన వారికి ఎంతగా ఇచ్చినా తరిగిపోక పోగా, పైగా మరింత వృద్ధి చెందుతూంటుంది. ప్రళయమే వచ్చినా గాని నాశనం లేనిది.

ఇంతటి మహాసంపద అనే విద్య ఏ విద్వాంసుల వద్ద ఉంటుందో అట్టి వారిని అదరించని రాజు అజ్ఞాని అనడానికి సందేహించ నక్కర్లేదు.

( ఎందుకంటే ప్రభువు సంపద సాదారణమైనది. విద్వాంసుల సంపదకున్న గొప్పలక్షణాలతో ఏ విధంగానూ సరితోగనిది. కనుక రాజులు పండితుల్ని ఆదరించి తీరాలి. )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!