Skip to main content
రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి
అశోక వనంలో హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:.
ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా- పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే- హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ- ర్మాకృతి, కూరుచున్న
విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్ ఆదర్శ దాంపత్యమంటే,
ఆయన్ని చూస్తే ఆవిడా గుర్తుకు రావాలి, ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.
Comments
Post a Comment