ముద్దు గారె...

ముద్దు గారె...


ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు 

తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దు|| 


అంత నింత గొల్లెతల అరచేత మాణికము 

పంతమాదే కంసుని పాలి వజ్రము 

కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ 

చెంతల మాలోనున్న చిన్న కృష్ణుడు ||ముద్దు|| 


రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము 

మితి గోవర్ధనపు గోమేధికము 

సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము 

గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||ముద్దు|| 


కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము 

యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము 

పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము 

బాలునివలె దిరిగీ బద్మనాభుడు ||ముద్దు|| 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!