నను మెడబట్టి గెంటితివి...

నను మెడబట్టి గెంటితివి...


నను మెడబట్టి గెంటితివి నాటకరంగముపైకి, చేత కా

దని బతిమాలుకొన్న వినవైతివి, కన్నులు విప్పి సభ్యులన్

గనుగొనినంత కాళ్ళు వడకన్ దొడగెన్ - సరికొత్త నర్తనం

బనుకొని చప్పటుల్ జరిచిరందరు, చాల్ తెరదింపుమో ప్రభూ!


ఈ పద్యం కరుణశ్రీగారి "అమర్ ఖయాం"లోది.


ఇదో తమాషా సన్నివేశం! కవి దేవునితో మొరబెట్టుకుంటున్నాడు. పద్యం సులభంగానే అర్థమవుతోంది కదా, వివరించాల్సిన పనిలేదు. జీవితాన్నో లోకాన్నో నాటకరంగంతో పోల్చడం పాత విషయమే. ఈ పద్యంలో ఉన్న ప్రత్యేకతంతా, వద్దు మొఱ్ఱో అంటున్నా దేవుడు తనని నాటకరంగంపైకి మెడబట్టి గెంటాడనడం. ఆ తర్వాత, ఎదురుగా ఉన్న సభ్యులని చూసి యితని కాళ్ళు వణుకుతూ ఉంటే ఆ ప్రేక్షకులేమో అదేదో కొత్త నాట్యమనుకొని చప్పట్లు కొట్టడం. భలే తమాషా అయిన ఊహ కదూ. తమాషాగా కనిపించినా, చాలా లోతున్న ఊహ. మామూలుగా - లోకం నాటకరంగం, మనుషలందరూ నటులు అనే పోలికలో ఆంతర్యం ఈ జగత్తంతా మిథ్య అని, జీవితమంతా కనిపించని శక్తి మన చేత ఆడిస్తున్న నాటకమని చెప్పడం. ఇక్కడ విషయం అది కాదు! ఇక్కడ కవికి తాను నటుడిని కానని తెలుసు. నటించాలన్న కోరికా లేదు. కాని, యితరులు తనని నటుడనుకుంటున్నారు. తన ప్రతి చేష్టను ఒక అద్భుతమైన నటన అనుకుంటున్నారు. అంటే యితరులు తనకు లేని శక్తి తనపైని ఆరోపిస్తున్నారు. వారే తనకొక లేని పాత్రని సృష్టిస్తున్నారు! తనకా శక్తి లేదని, తానా పాత్రకి అర్హుణ్ణి కాదని పరిపూర్ణ జ్ఞానం కవిగారి కున్నది. అయినా ఏమీ చెయ్యలేని విపత్కర పరిస్థితి!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!