"ఉమ్మడి కుటుంబం"

"ఉమ్మడి కుటుంబం"

"ఉమ్మడి కుటుంబం" లో..ఉమ్మడి అన్న పదంలోనే ఆ దగ్గరితం ఉంది. తాత, నానమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, వదిన, బావగారు, మరిది, మరదలు, అబ్బో.. ఎన్ని భాంధవ్యాలు, ఎన్ని అల్లికలు, ఇంట్లో ఎవరికీ ఏ చిన్న సమస్య వచ్చినా తమదిగా భావించి ఆ చిక్కుముడిని విప్పుకునే వారు. 

జరుగుతున్న కాలంతో పాటు నాన్నగారి తరం వచ్చేసరికి "చిన్న కుటుంబం చింతలేని కుటుంబం" అనే కొటేషన్ తో ఇద్దరు పిల్లలు చాలు అనుకునే రోజులవి.. అయినా తాత నానమ్మల మురిపాలు దొరికాయి, వాళ్ళ సంరక్షణలో పెరిగే అదృష్టం దొరికింది. 

ప్రస్తుతం.. ఎలక్ట్రానిక్ యుగం.. పరుగులమయం.. భార్యాభర్త మాట్లాడుకోటానికి సమయం ఉండదు, అమ్మానాన్నలంటే.. మోయలేని బరువులు. సూటిగా చెప్పాలంటే.. వ్యర్థ పదార్ధాలు. అతి కష్టం మీద ఒక్క బిడ్డ చాలు.. అనుకుంటూ.. వాళ్ళని పెంచటానికి కూడా డే కేర్ లని ఆశ్రయిస్తూ ముక్కుపచ్చలారని పసివాళ్ళ ఆలనాపాలనా చూసుకోలేని తల్లితండ్రులు ఏమి సాధించాలని అలా పరుగులు పెడుతున్నారు? తల నెరిసిన సమయంలో వాళ్ళు జీవితంలోకి తొంగి చూసుకుంటే.. అనుభూతులకి అర్ధం తెలియని స్థితిలో ఉంటారు. 

మనిషి అవసరాలని బట్టి మారుతూ, ఆ అవసరాలకనుగుణంగా మన కుటుంబాలని మనమే కుదించేసుకున్నాము. ఎవరము ఎవరికీ ఏమవుతామో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది అలాంటప్పుడు. అందుకే తమని కన్నవాళ్ళని మరువకుండా తాము కన్నవాళ్లకి ఆరోగ్యప్రదమయిన పరిస్థితుల్ని కల్పిస్తూ, దొరికే కొద్ది సమయమంలోనయినా ఆత్మీయతని అందరితో పంచుకుంటూ, రాబోయే తరానికి మార్గదర్శకం కావాలి.

Photo: "ఉమ్మడి కుటుంబం"

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!