గురుజాడ అప్పారావు గారి ముత్యాలు.

ముత్యాల సరాలు

(గురుజాడ అప్పారావు గారి ముత్యాలు..)


చూడు మునుమును మేటివారల

మాట లనియెడు మంత్రమహిమను

జాతి బంధములన్న గొలుసులు

జారి సంపద లుబ్బెడన్


యెల్ల లోకము వొక్కయిల్లై,

వర్ణ భేదములెల్ల కల్లై

వేల నెరుగని ప్రేమబంధము

వేడుకలు కురియ


మతము లన్నియు మాసిపోవును;

జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును;

అంత స్వర్గ సుఖంబు లన్నవి

యవని విలసిల్లున్




తోటికోడలు దెప్పె, పోనీ;

సాటివా రోదార్చె, పోనీ;

మాటలాడక చూచి నవ్వెడి

మగువ కేమందున్ !

తోడుదొంగని అత్తగారికి

తోచెనేమో యనుచు గుందితి;

కాలగతి యని మామలెంతో

కలగ, సిగ్గరినై


చాలునహ ! మీ చాకచక్యము

చదువుకిదె కాబోలు ఫలితము !

ఇంత యగువని పెద్ద లెరిగిన

యింగిలీషులు చెపుదురా ?


కట్టుకున్నది యేమికాని;

పెట్టి పొయ్యక పోతె, పోనీ;

కాంచి పెంచిన తల్లిదండ్రుల

నైన కనవలదో ?


తూర్పు బల్లున తెల్లవారెను;

తోకచుక్క యదృశ్యమాయెను;

లోకమందలి మంచి చెడ్డలు

లోకు లెరుగుదు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!