Skip to main content
ప్రాస.....అంటే ఇలా ఉండాలి..
ప్రాస.....అంటే ఇలా ఉండాలి..
మెచ్చిన మచ్చిక గల్గిన యిచ్చిన నీవచ్చు గాక యిచ్చ నొరులకున్ చిచ్చు
కడి గొనగ వచ్చునె చిచ్చర చూపచ్చు వడిన శివునకు దక్కన్ ?
పిల్లలకి తెలుగు పట్ల ఉత్సాహం, మక్కువ, ఆసక్తి, కలగాలంటే ఇలాంటి పద్యాలు వారి ఎదురుగా పెద్దలు పైకి బిగ్గరగా చదవాలి, నేర్చుకోవాలి.
అచ్చ తెలుగు పదాలతో నింపిన ఈ పోతన భాగవత పద్యం, హాలాహల భక్షణ అయిన తరువాత చెప్పబడినది.
మచ్చిక = ప్రేమ ఇచ్చ = ఇష్టమయినది ఒరులకున్ = ఇతరులకి చిచ్చు కడి = అగ్గి ముద్ద కొనగవచ్చునె = తీసుకోవచ్చా ? చిచ్చర చూపు = అగ్ని నేత్రం అచ్చువడిన = stamp లాగా పడిన శివునకు దక్కన్ = శివుడికి తప్ప
Comments
Post a Comment