Posts

Showing posts from April, 2017

సత్యంఅనే ముత్యం !

Image
సత్యంఅనే ముత్యం ! . చక్కనిది దక్కనిది ఒక్కటున్నది... నీడబ్బులకు ససేమిరా లోగను అన్నది... ఓహో పొమ్మా నన్నది  . కన్నతల్లీ కన్నులలో కాంతి నన్నది  చిన్ని పాప బోసి నవ్వు తానే అన్నది  సాటి ఏలేనిది .. సత్యంఅనే ముత్యం అది.. . కన్నె పిల్ల నిగ నిగలో నిలిచి వున్నది  కోకి లమ్మ పాటలో హాయినన్నది  సాటి ఏలేనిది .. సత్యంఅనే ముత్యం అది. . నివురు గప్పిన నిప్పు లో దాగి ఉన్నది . స్వర్గ నరక లోకాలకు మధ్య నున్నది . సాటి ఏలేనిది .. సత్యంఅనే ముత్యం అది. . సాటి ఏలేనిది .. సత్యంఅనే ముత్యం అది. . చక్కనిది దక్కనిది ఒక్కటున్నది... నీడబ్బులకు ససేమిరా లోగను అన్నది... ఓహో పొమ్మా నన్నది . . (రేపు నీదే -1957 " సినిమాలో , జిక్కి)

ఋక్కులు.......మహాకవి శ్రీ శ్రీ .!

Image
ఋక్కులు.......మహాకవి శ్రీ శ్రీ .! . కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్ళా - హీనంగా చూడకు దేన్నీ ! కవితా మయమేనోయి అన్నీ ! రొట్టె ముక్కా , అరటితొక్కా , బల్ల చెక్కా - నీ వేపే చూస్తూ ఉంటాయ్ ! తమ లోతు కనుక్కోమంటాయ్ ! తలుపు గొళ్ళెం , హారతి పళ్ళెం , గుర్రపు కళ్ళెం - కాదేదీ కవితకనర్హం ! ఔ నౌను శిల్పమనర్ఘం ! ఉండాలోయ్ కవితవేశం ! కానీవోయ్ రసనిర్దేశం ! దొరకదటోయ్ శోభాలేసం ? కళ్లంటూ ఉంటే చూసి , వాక్కుంటే వ్రాసీ ! ప్రపంచమొక పద్మ వ్యూహం ! కవిత్వమొక తీరని దాహం ! ( మహాప్రస్థానం - 1950 ) ఋక్కులు (14-04-1934 )

ఓణీ... పరికిణీ...(తన్నికెళ్ళ భరణి గారి కవిత.)

Image
ఓణీ... పరికిణీ... తెలుగు కన్నెపిల్లకు అర్ధాంతన్యాసాలంకారాలు అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి... ఓణీయే ఓంకారం !! పరికిణీయే పరమార్థం !! . (తన్నికెళ్ళ భరణి గారి కవిత.)
Image
శుభోదయం.! .                          భల్లున తెల్లవారింది.. ఎండఎక్కింది.

ఏ.యం.రాజా!

Image
ఏ.యం.రాజా! విప్రనారయణ సినిమాలో ఈపాట విన్నప్పుడు రాజా  గుర్తుకు వచ్చేడు. . .మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా భాసిల్లెనుదయాద్రి  బాల భాస్కరుడు వెదజల్లె నెత్తావి విరబూచి విరులు విరితేనెలాని మైమరచు తుమ్మెదలు లేచెను విహగాళి లేచెను నిదుర చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు రేయి వేగినది వేళాయె పూజలకు ॥ చరణం : పరిమళద్రవ్యాలు బహువిధములౌ  నిధులు గైకొని దివ్యులు కపిలధేనువును అద్దమ్ముపూని  మహర్షి పుంగవులు మురువుగా పాడ  తుంబురు నారదులును నీ సేవకై వచ్చి నిలచియున్నారు సకుటుంబముగ సురేశ్వరులు కానుకలు గైకొని మొగసాల  కాచియున్నారు ॥ దేవరవారికై పూవుల సరులు  తెచ్చిన తొండరడిప్పొడి మురియ స్నేహదయాదృష్టి చిల్కగా జేసి  సెజ్జను విడి కటాక్షింప రావయ్యా ॥ ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (జూలై 1, 1929 - 1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వ...

మను చరిత్రము అరుణాస్పదపుర వర్ణనము!

Image
మను చరిత్రము  అరుణాస్పదపుర వర్ణనము! మ. వరణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌ బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌. . ప్రవరుని సౌశీల్యాది ప్రశంస! ( ఉ. ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై. . సీ. తీర్థసంవాసు లేతెంచినారని విన్న, నెదురుగా నేఁగు దవ్వెంతయైన, నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ, దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు, నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయు, జేసి గూర్చున్నచోఁ జేరవచ్చు, వచ్చి యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి, త్తీర్థమాహాత్మ్యముల్‌ దెలియ నడుగు,  తే. నడిగి యోజన పరిమాణ మరయు నరసి పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు ననుదినము తీర్థసందర్శనాభిలాష మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి. . ప్రవరుని స్వగ్రామం అరుణాస్పద పురము. అరుణాస్పద పురము వరణ నది ప్రక్కన గలదు.) . ...

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన!

Image
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన! . కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం.  ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. (కొందరు అనుకునట్లు ఈ పాట శ్రీ శ్రీ రాసింది కాదు.) పాటపల్లవి : కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో || | | కారులో | | చరణం 1 : చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు చరణం 2 : గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో కారులో షికారుకెళ్ళ...

చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

Image
నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే అహహా ... అహా ఒహోహో ..... అహహా ఒహో.......అ ఆ ... చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా.. నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ అహహా...అహా ఒహోహో.... హహా ఒహో...అ ఆ . . చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

ఇండియాలో మొదటి బస్సు!

Image
ఇండియాలో మొదటి బస్సులు నడిపింది... బెజవాడ నుండి మాచలిపట్నంమధ్య.. ఇది 1910 లోజజరిగింది...లండన్ మూజియం లో ఇప్పటికిదినిమోడల్ ఉంది

కన్యాశుల్కము గురజాడ అప్పారావు !

Image
కన్యాశుల్కము గురజాడ అప్పారావు  ౪-వ స్థలము. పెరటిలో జామిచెట్టు కొమ్మమీద వెంకటేశంకూచుని జామిపండు కొరుకుచుండును. [చెట్టుకొమ్మలు ఆవరించివున్న నూతిలో నీరు బుచ్చమ్మ తోడుతుండును.] . బుచ్చమ్మ తమ్ముడూ, గిరీశంగారు గొప్పవారష్రా? . వెంక గొప్పవారంటే అలా యిలాగా అనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాద్‌ బా`నర్జీ అంతగొప్పవారు. . బుచ్చమ్మ అతగాడెవరు? . వెంక అందరికంటే మరీ గొప్పవాడు. . బుచ్చమ్మ అయితే గిరీశంగారికి వుద్యోగం కాలేదేమి? . వెంక నాన్సన్స్‌! నువ్వు ఆడదానివి; నీకేం తెలియదు. ఉద్యోగవంటే గొప్పనుకుంటున్నావు. ఉద్యోగవఁంటే యేమిటో తెలిసిందా? సర్వెంట్‌ అన్నమాట. . బుచ్చమ్మ అనగా యేమిటి? . వెంక సర్వెంటనగానా? నౌఖర్‌ అన్నమాట. మన గేదెనికాసే అశిరిగాడు ఒక సర్వెంట్‌. మన యిల్లుతుడిచే అంకి ఒక సర్వెంట్‌. వీళ్లు మన నౌఖర్లు. పోలీసూ, మునసబూ తెల్లవాడి నౌఖర్లు. జీతం లావురాగానే గొప్పనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాద్‌ బా`నర్జీ, గిరీశంగారులాంటి గొప్పవాళ్లు తెల్లవాడిదగ్గిర కాదు, దేవుఁడిదగ్గిరైనా నౌఖరీ చెయ్యమంటే చెయ్యరు. కలక్ట రేవంటాడో తెలిసిందా? పోలీసువెళితే "స్టాండ్‌!" నిలుచో అంటాడు. ...

జెండాపై కపిరాజు ఎటుల వచ్చెన్...?

జెండాపై కపిరాజు ఎటుల వచ్చెన్...? . తీర్థయాత్రలు చేసుకుంటూ ఒకసారి అర్జునుడు రామేశ్వరం చేరుకున్నాడు. అర్జునునితోపాటు దారిలో కలిసిన ఓ బ్రాహ్మణుడు, " వానరసేన సాయంతో శ్రీరాముడు అలనాడు నిర్మించిన వంతెన అదే" అన్నాడు. దానికి అర్జునుడు, " కోతులతోనా..? అంతటి విలుకానికి కోతుల సాయం కావలసి వచ్చిందా...?" అన్నాడు. ఇంతలో అర్జునుని అనుసరిస్తూ వస్తున్న ఓ కోతి పగలబడి నవ్వనారంభించింది. ఆ కోతే ఆంజనేయుడు.  అయన తన నిజ స్వరూపం చూపెను.  అప్పుడు అర్జునుడు అయన తన రధ జెండా నుండి మహా భారత యుద్ధం  చూడమని ప్రార్ధించెను

అర్జునుడు !

Image
అర్జునుడు ! . మహావదాన్యుడు, ఇంద్రియనిగ్రహం గలవాడు, భయంకరమైన పరాక్రమం చేత శత్రువులను తరింపజేయగలవాడు, స్వచ్ఛమైన వర్చస్సు గలవాడు, ఎవరికినీ జయింప శక్యం కానివాడు. "అవశగతి గామరోషాదివికారము లొందినను మదిని ధర్మపథప్రవిహతి గానీడు" అంటూద్రుపది ప్రశంసిస్తుంది. . పొందు కోరి విఫలమనోరథయైన ఊర్వశి శాపం తెలిసి దేవంద్రుడు, "నీయట్టి ధైర్యవంతుని నే యుగములనైన గాన మెన్నండును ధర్మాయత్తమతివి మునులకు నీ ఇంద్రియ జయము కీర్తనీయము తండ్రీ" అంటాడు. నీవు ధర్మాత్ముడివి. నీవంటి ధైర్యవంతుని ఏ కాలంలోనైనా చూడలేము. నీవు ఇంద్రియాలపై సాధించిన విజయం ఋషీశ్వరులు కూడా ఉగ్గడించతగింది అంటూ కొడుకును శ్లాఘించాడు.  . అర్జునుని స్థిరవిజయసాధనకు కర్మకౌశలము, సౌశీల్యము ముఖ్యకారణములు. సభాపర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పార్థుడి రక్షాబలం, భీముడి భుజబలం, నా నీతిబలం నీకుండగా అసాధ్యమేముంది? అని అంటాడు.  . పురుషకారానికి దైవబలం తోడైతే విజయం తథ్యమని ఆంధ్రమహాభారతం పార్థుని చరిత్ర ద్వారా తెలియజేస్తున్నది.  . మహాప్రస్థాన సమయంలో అర్జునుడు యాత్ర సాగిస్తూ తన గాండీవాన్ని వదలక వెంట తీసుకుపోతున్నాడు. జీవితంలో గాం...

నలుపులోని అందం తెలుపు లో ఎక్కడిది .

Image
శుభోదయం! .  నలుపులోని అందం తెలుపు లో ఎక్కడిది . మన సంస్కృత కావ్యాల లో అందం అంటే శ్యామ వర్ణం . గీతగోవిందం లో రాధ రంగు నీల మేఘం . ఆమె నల్లని గోపాలుడికి తగియా జోడి గా వర్ణించబడింది . ఇక కాళిదాసుని దాదాపు అన్ని కావ్యాలలో స్త్రీలు నల్లని వారే . ద్రౌపతి తెలుపు కానేకాదు . భవభూతి ఉత్తర రామ చరిత లో సీతని పాల మీగడ రంగాని వర్ణించలేదు . కంబ రామాయణం లో కూడా సీత ని ఎర్రని బుగ్గల యువతి గా వర్ణించలేదు . వాత్స్యయనుడి కామసూత్ర లోని వేశ్యలు కూడా నల్లని వారే . ఈ పుస్తకం లో ఒక అంకం అంతా నలుపు అందం గురించే కేటాయించడం జరిగింది . అందం నల్లని రంగు లో ఆకృతి లో ఉందని వ్రాసారు . (శ్యామ వర్ణం సౌన్దర్య భూతం ప్రతిమనహ్ అస్తి )😀😀😀😀😀😀😀

నేను చూస్తాను...

Image
నేను చూస్తాను.... సినిమా హాల్ కు వెళ్లి మరి చూస్తాను..

*కాశీ విశ్వనాధుని* కే *అక్షరాంజలి*

Image
తెలుగు వారు *ఆత్మగౌరవానికి* ప్రతీకలని *ప్రైవేట్ మాష్టారు* గా చెపుతూ, *ఉండమ్మా బొట్టు పెడతా*అంటూ ఆ బొట్టు *కలసి వచ్చిన అదృష్టమని*  *నిండు హృదయాల*తో ఉంటే  *చిన్ననాటి స్నేహితులే*  చుట్టరికం తో *చెల్లెలి కాపురం* కై ఓ అన్న, వారు *నిండుదంపతులై* వర్ధిల్లాలని ఆశించి, కుదరనపుడు అదే *నేరము శిక్ష* గా మారి *శారద* జీవితం నుండీ *అమ్మమనసు* ని చూపి ఓ *సీతకథలో* , ఆమే  *జీవనజ్యోతి* యి నడయాడి  *మాంగల్యానికి మరోముడి* వేసి *కాలాంతకులు* అని చెప్పడానికి *పేర్లను ప్రెసిడెంటు* చేసి ఆపై  *కాలం మారింది* అని చెప్పడానికి  *సీతామాలక్ష్మి* సినీ జీవిత గాథ ని *సిరిసిరిమువ్వల* సవ్వడి నీ  *శుభోదయం* గా అందించి  అందుకని వారికి *అల్లుడు పట్టిన భరతం* లా  పాశ్చాత్య నాగరికత పెను తుఫాను రెప రెప లాడుతున్న శాస్త్రీయ సంగీతానికి శాశ్వతత్వం మరల తీసుకు రావడానికి ముఖ్యమైన క బలమైన కారణం గా *శంకరాభరణాన్ని* అర్పించి  ఏడు జన్మల *సప్తపది* అంటూ  *శుభలేఖ* రాసి అవి అన్నీ *సాగరసంగమం*గా పరిణమిస్తే  మన *జానీ జన్మభూమి* ని గుర్తుకు తెస్తే, మన మ...

తమ్ముడు పీరబాబు డౌటుకి నా వివరణ...

Image
శుభోదయం,! . తమ్ముడు పీరబాబు డౌటుకి నా వివరణ... ఓ చోట కుదురుగా ఉండరు కాబట్టి నదులకి ఆడవారి పేరు - కూర్చున్న చోటు నుండి కదలరు కాబట్టి పర్వతాలకి మగాళ్ళ పేర్లూ పెట్టారు... గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి భూమి అని స్త్రీ పేరు - తిరక్కుండా ఓచోట పడుంటాడు కాబట్టి సూర్యుడికి పురుషుడి పేరు పెట్టారు... పాత కాలంలో వక్రీకరించబడిన శాస్త్రాల్లో మగాడు తిరక్క - ఆడది తిరిగీ చెడ్డదని తప్పు చెప్పారు గానీ. నిజానికి ఆడది తిరక్క - మగాడు తిరిగి చెడ్ఠారు. ఉద్యోగం స్త్రీ లక్షణం - కావాలంటే నిశితంగా చూడండి సివంగి వేటాడి మాంసం తెస్తే సింహం తింటుంది గానీ దానంతట అది స్వతహాగా వేటకి వెళ్ళదు .. డౌటున్నోళ్ళు డిస్కవరీ చానెళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవండి... అలాగే... మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది గానీ - ఆడ నెమలికి అంత పెద్ద తోక నెమలి కన్నులూ ఉండవు. దీనర్ధం క్లాసికల్ డాన్సులు కూడా మగవారివే... అలాగే వంట పని ఇంటి పని కూడా మగవాడిదే ... మాయ చేసి ఆడవారు లాగేసుకున్నారు.. పురాణాల్లో వంటలని నలభీమ పాకాలన్నారు గానీ - ద్రౌపదీ - దమయంతి పాకాలన్నారా...?? ఎక్కడో చరిత్ర వక్రీకరణ జరిగి మగాళ్ళకి ఉద్యోగాలు చేసే ఖర్మ...

“శంకరాభరణం....నేపధ్య సంగీతం :!

Image
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం  .“శంకరాభరణం....నేపధ్య సంగీతం :! . శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే  గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రసస్ఫోరక కలభిజ్నత óá ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం . శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పద సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలాభి లజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే అన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం,అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా...

స్వాతి కిరణం!

Image
స్వాతి కిరణం! . బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన వాడు గురువు. తల్లిదండ్రులను గురువును దైవంగా భావించాలి. ఇది మన సాంప్రదాయం. శిష్యులకు మార్గదర్శకుడు గురువు. తాము చూపిన మార్గంలో ప్రజ్ఞాపాటావాలలో తమను అధిగమిస్తే గురువుకు అంత కంటే గర్వకారణం ఇంకేముంది..ప్రతిభ ఒకరి స్వంతం కాదు.. ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని ప్రోత్సహించాలి..దానికి పదును పెట్టాలి..కొత్తతరానికి పాత తరం దారి చూపాలి..దారి ఇవ్వాలి.. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో గొప్పతనం ఉంది.. కానీ శిష్యుల ఉన్నతిని కోరని గురువులు, తమని మించి పోతారనే భావనతో శిష్యుల భవిష్యత్తును సమాధి చేస్తారు.. శిష్యుల ప్రజ్ఞను తమ ప్రగతికి సోపానంగా మార్చుకునే గురువులూ ఉన్నారు.. వారు ఏకలవ్యుని బొటన వ్రేలుని గురుదక్షిణ కోరిన ద్రోణుడికి ప్రతి రూపాలు.. ఆ కోవకి చెందిన సంగీత విద్వాంసుడు అనంత రామశర్మ.. బాల మేధావి గంగాధరం..గంగాధరాన్ని మాతృభావంతో చేరదీసే అనంతరామశర్మ భార్య.. వీరి మధ్యనడచిన కథ స్వాతికిరణం . ఏ విధంగా చూసినా ఇది చాలా గొప్ప సినిమా..తెలుగు సినిమా లలోనే కాదు యావత్తూ సినిమాలను ఎంతగా కాచి వడపోసి ఆణిముత్యాలని ఏ కొద్ది పాటి సినిమాలను ఏరినా ఈ సినిమాకు స్...

అభినవశశిరేఖ!

Image
నీకనుదోయి కమలాల ఁబమరబునేను  అభినవశశిరేఖ!

ఈమె పేరు లలిత .. దేవదాసు లో చంద్రముఖి ..

Image
ఈమె పేరు లలిత .. దేవదాసు లో చంద్రముఖి ..  Travancore సిస్టర్స్ లో పెద్దది ..  ప్రొడ్యూసర్ D .L .నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బరామన్  ఈవిడ కోసం కొట్టుకు చచ్చేవారు అని చెప్పుకొనే వారు. ఈవిడ కోసమే సుబ్బరామన్ చని పోయేరు / చంప బడ్డారు అని  గాలి కబుర్లు , వినే వాళ్ళం.

శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 25/4/17.

Image
శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 25/4/17. . రాజుల్మత్తులు,వారిసేవ నరక ప్రాయంబు,వారిచ్చు నం భోజాక్షీ చతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్,తదపేక్ష చాలు,పరితృ ప్తి పొందితిన్,జ్ఞాన ల క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము,దయతో శ్రీ కాళహస్తీశ్వరా! . శ్రీ కాళహస్తీశ్వరా!రాజులు మదముతో ప్రవర్తింతురు. అందుచే వారికి సేవ చేయుట నరకముతో సమానమైనది. వారిచ్చునట్టి స్త్రీలు ,పల్లకీలు,గుర్రాలు,ఆభరణాలు మనస్సునకు  భాద కలిగించేవిగా ఉండును.కాన నాకు వాటిపై గల కోరిక చాలును. సంతృప్తి పొందితిని దయతో మోక్షమునకు చేర్చు జ్ఞానమును నాకు ఇమ్ము.

మహోదయం లో ..పెళ్లి పాట !

Image
మహోదయం లో ..పెళ్లి పాట ! . దేవులపల్లి  వారి పాట . వింజమూరి (బొడ్డుపల్లి)సుబ్బలక్ష్మి  గాత్రం  సమర్పణ  .. వింజమూరి  వెంకట అప్పారావు  . https://www.youtube.com/watch?v=Jdpr6qkQHXE

క్రొత్తప్రగతి...

Image
శుభోదయం ! . మనకు బొర్రా గుహలు చూడడానికి ఈ ఏర్పాటు .. మనము ప్లాటుఫారం నుండి అందాలు చూడ వచ్చు. వోహో..ఆహా లా ఉంది ఈ కొత్త బోగీలో నుండి...  లోపలకూర్చున్న  పాపాలనుచూడవచ్చు...క్రొత్తప్రగతి...

మన హిమాలయాలు..!

Image
మన హిమాలయాలు..! (మా గురువుగారు సి.నా.రె). .  అంబరచుంబి శిఖరాలు శరఝ్ఝరీ తరంగాలు . ఆ అభంగ తరంగ మృదంగ రవములకభినయమాడు తరంగాలు . అహో హిమవన్నగము భరతావనికే తలమానికమూ . భగీరధుడు తపియించినచోటు గగన గంగనే దింపినచోటు . పరమేశుని ప్రాణేశుగబడసి గిరినందన తరియించినచోటు. .

మంచి నటి ... బూచాడు అంటో భయపెట్టి... . అబ్బని తియ్యని దెబ్బా అంటో మూడు తరాలు వెలిగింది.!

Image
మంచి నటి ... బూచాడు అంటో భయపెట్టి... . అబ్బని తియ్యని దెబ్బా అంటో మూడు తరాలు వెలిగింది.

అగ్రహారం!

Image
అగ్రహారం! . అగ్రహారం అనే పదం చాలా గ్రామనామాలకు ఉత్తరపదంగా ఉంటుంది. బ్రాహ్మణులకు వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, వారి విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు. అలాంటి గ్రామాలను అగ్రహారమని పిలుస్తారు. అగ్రహారం అనే పదం అనుబంధంగా ఉండే గ్రామాలు ఈ కింది విధంగా ఉన్నాయి పురుష నామసూచి: అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం పురుషనామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఎవరి పేరున ఐతే అగ్రహరం నామం ఏర్పడిందో వారికే ఆ అగ్రహారం దానంగా లభించిందని ప్రతీతులు ఉండడం కద్దు. ఉదాహరణలు: లింగరాజు అగ్రహారం, శంకర అగ్రహారం, సూరన అగ్రహారం, లింగన అగ్రహారం. కుటుంబ నామసూచి: అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం కుటుంబ నామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. గ్రామనామం ఏర్పడిన కుటుంబీకులు అగ్రహారాన్ని అనుభవించేందుకు దానం లభించినవారయ్యే అవకాశాలు ఎక్కువ. ఉదాహరణలు: వేదంవారి అగ్రహారం, మధ్వపతివారి అగ్రహారం. కులసూచి: కొన్ని అగ్రహారాలకు పూర్వపదంగా కులాల పేర్లు ఉన్నాయి. ఉదాహరణలు: గొల్ల అగ్రహారం గ్రామనామ సూచి: కొన్ని గ్రామనామాల్లో అగ్రహారం...

ఒక ఇల్లాలి ఘోష.!

Image
ఒక ఇల్లాలి ఘోష.! ఉత్పల మాల. నేను కిచెన్ను సింకు కడ నిల్చి చివాలున గిన్నె తీసి చే యానెడునంతలోన అవియన్నియు జాలి గ నోళ్ళు తెర్చి మా మై లానము శుద్ధి చేయమని మంచిగ యన్నవి కృంగి పోతి నా మానసమందెదో తళుకు మనది అంట్ల పురాణ కావ్యమై. . సింక్ లో అంట్ల గిన్నెలు ,ఇంకెప్పుడు వస్తావు ? అని జాలిగా పిలుస్తున్నాయి , అంతే మనకి ఇలాంటి పిలుపులే ..,పిల్లలు ఇల్లు వదిలాక, అంట్లు ,గిన్నెలు తపాళాలు ఇవే చప్పుడు చేస్తున్నాయి ...

నటభూషణం-నాగభూషణం!!!

Image
నటభూషణం-నాగభూషణం!!! విలనిజానికి భూషణం నాగభూషణం.......... గుంటూరు గాంధీ పార్కులో నాటకం జరుగుతోంది... గాంధీ పార్కు అని పెట్టారు రామా... కన్ను చించుకు చూసినా గాంధీ బొమ్మ కనిపించదు రామా.. అంటూ  డైలాగ్ కొట్టగానే చప్పట్లు మారు మోగేవి. బందరులో ప్రదర్శన జరుగుతోంది...  ఓ పాత్ర వచ్చి ఏం జబ్బు నాయనా.. అనడగుతుంది. బ్రహ్మానందరెడ్డిని కులం అడిగినట్టుంది రామా.. చూస్తుంటే ఏం జబ్బో తెలియడం లేదా అమ్మా.. అంటాడు. ఇలా ఏ ఏరియాలో నాటక ప్రదర్శన జరిగితే.. ఆ ఏరియాకు చెందిన విశేషాలను డైలాగుల్లో జొప్పిస్తూ...  చప్పట్ల మీద చప్పట్లు కొట్టించుకుంటాడు. ఆయన ఇంటి పేరు ఏమిటో పెద్దగా ఎవరూ తెలియదు కానీ రక్తకన్నీరు అనడం ఆలస్యం... నాగభూషణం కదూ అని టక్కున గుర్తుపట్టేస్తారు. జయంతి నాడు ఓ సారి ఆయన్ను తలుచుకుంటే ఆ కాలపు సినీ మాధుర్యం ఏమిటో అవగతమవుతుంది. ఓ అరగంట టైం తీసుకుంటుంది... విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను. చక్రవర్తుల నాగభూషణం పూర్తి పేరు. ఏప్రిల్ 19న నెల్లూరులో జననం.. ఇంటర్మీడియట్ వరకూ సజావుగా సాగిన చదువు.... ఆర్ధిక లోపం కారణంగా... వెనకడుగు. దాంత...

గోపికలు కృష్ణుని తొట్టిలో ఉంచి ఇలా పాడారట. (పోతనామాత్యుడు.)

Image
గోపికలు కృష్ణుని తొట్టిలో ఉంచి ఇలా పాడారట. (పోతనామాత్యుడు.) క. జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా! జోజో పల్లవకరపద! జోజో పూర్ణేందు వదన! జోజో యనుచున్. క. పలు తోయంబుల జగములఁ, బలు తోయములందు ముంచి భాసిల్లెడి యా పలుతోయగాడు వల్లవ, లలనా కరతోయములఁ జెలంగుచుఁ దడియున్. తోయగాఁడు=(తోయము+కాడు) విధముగలవాడు. తోయము అనేమాట 4సార్లు వాడేడాయన. తరువాత పూతన అనే రాక్షసి ఓ సుందరి వేషంలో కృష్ణునికి చన్నుకుడుపవచ్చినదై-- క. చను నీకుఁ గుడుపఁజాలెడి, చనువారలు లేరు నీవు చనవలె ననుచున్ చనుగుడిపి మీఁద నిలుకడఁ, జనుదాన ననంగ వేడ్కఁ జనుఁ జను గుడుపన్. పూతన చనుబాలతో పాటు ప్రాణాన్నీ హరిస్తాడు బాలకృష్ణుడు. అప్పుడు పోతన గారంటారు. క. విషధరరిపు గమనునికిని, విషగళ సఖునికిని విమల విష శయనునికిన్ విషభవభవ జనకునికిని, విషకుచ చనువిషముఁ గొనుట విషమే తలపన్. విషధరరిపుడు=విషాన్ని ధరించిన పాములకు శత్రువు-గరుత్మంతుడు (వాహనముగాగలవాడు విష్ణుమూర్తి ) విషగళ సఖుడు=విషాన్ని గళమందు ధరించిన శివునికి సఖుడు(అయిన విష్ణుమూర్తి) విష శయనుడు=పాముపై నిద్రించే వాడు(విష్ణుమూర్తి) విషభవభవ జనకుడు= విషకుచ చనువి...

సిక్సర్ నాయుడు సి.కె.నాయుడు. !

Image
సిక్సర్ నాయుడు సి.కె.నాయుడు. ! ఇంగ్లాండ్ రాణి లార్డ్స్ మైదానం వచ్చినప్పుడు  ఆమెను సిక్సర్ తో స్వాగతం పలికి .. బిగ్బాన్ గడియారం గ్లాస్  పగలగొట్టిన వీరుడు  సి కె నాయుడుబౌలర్ గా తన ఫస్ట్ క్లాసు కెరీర్ ని మొదలు పెట్టి, బారీ సిక్సర్లతో, సి.కె.నాయుడు అంటే సిక్సర్ల నాయుడు అనిపించుకున్న స్పోర్ట్స్ హీరో ఆయన. కొట్టారి కనకయ్య నాయుడు( "CK" Nayudu') భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి "పద్మభూషణ్" అందుకున్నాడు. నాయుడు 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రధమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకముగా జరిగినది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ...

లాలా అమర్‌నాథ్ !

Image
 లాలా అమర్‌నాథ్ ! 1933 డిసెంబర్ 15 న తొలి టెస్ట్ ఆడుతూ సెంచరీ సాధించాడు.  అది టెస్ట్ క్రికెట్ లో భారతీయుడు సాధించిన తొలి శతకం.  తొలి టెస్ట్ లోనే శతకం సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. 1952 డిసెంబర్ వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన లాలా అమర్‌నాథ్ మొత్తం 24 టెస్టులు ఆడి 878 పరుగులు సాధించాడు.  ఇందులో ఒక శతకం మరియు 4 అర్థ శతకాలున్నాయి. టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ చేసి 45 వికెట్లు కూడా పడగొట్టాడు.  డొనాల్డ్ బ్రాడ్‌మెన్ ను హిట్ వికెట్ ద్వారా ఔట్ చేసి అతనిని ఆ విధంగా ఔట్ చేసిన ఏకైక బౌలర్ గా నిల్చినాడు.  అతను రెండు పర్యాయాలు టెస్ట్ సీరీస్ లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. పటౌడీ సీనియర్ తర్వాత ఒకసారి, విజయ్ హజారే తర్వాత మరోసారి నాయకత్వ పగ్గాలు చేపట్టాడు.  తొలిసారిగా పాకిస్తాన్ ను టెస్ట్ సీరీస్ లో అతని నాయకత్వం లోనే భారత్ విజయం సాధించింది.

అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో...

Image
వడ్డాదిపాపయ్య గారి చిత్రం.! . ఓసారి బలరాముడు అతని స్నేహితులు కలసి యశోదతో కృష్ణుడు మన్ను తిన్నాడని పితూరీ చేస్తారు. అప్పుడు యశోద కృష్ణుని పట్టుకుని నిలదీసి అడుగుతుంది 'మన్ను తిన్నావటా'ని. అప్పుడు కృష్ణుడు యశోదతో-- శా. అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో నమ్మంజూడకు వీరి మాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ రిమ్మాగ్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ యాస్య గం ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.! . అని పలికి కృష్ణు డమ్మకు నోరు తెఱచి చూపిస్తాడు .ఆమె అతని నోటిలో  'జలధి పర్వత వన భూగోళ శిఖి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండా'న్నంతా చూచి ఇలా అనుకొందట. . పై పద్యంలోని మాటలన్నీ మన చిన్నపిల్లలు మనతో మనం నిలదీసినప్పుడు చెప్పే మాటలే!  ఎంత సహజసిద్ధమైన ధారాశుద్ది!  చిన్నపిల్లల్ని- వాళ్ళుచేసే చెడ్డ పనులను గురించి వాళ్ళను దండించాలని చూసే ప్రతి తల్లి తోనూ ప్రతిపిల్లవాడు తనను తాను సమర్ధించుకుంటూ పలికే ముద్దు ముద్దు పలుకులే కిట్టయ్య నోటినుంచి కూడా అలవోకగా జాలువారేలా చేసారు పోతన గారు. వీటినానందించటం కోసమైనా మనం భాగవతం తప్పక చదవాలి. అప్పుడ...

అన్న! శమింపు మన్న!

Image
అన్న! శమింపు మన్న! తగ దల్లుఁడు గాఁ డిది! మేనగోడ లౌ! (పోతనామాత్యుడు.) . శ్రీ కృష్ణ జననం తర్వాత వసుదేవుడు శ్రీకృష్ణుని రేపల్లెలో యశోద వద్దకు చేర్చి ఆమె వద్దవున్న యోగమాయను దేవకివద్దకు మార్చిన తరువాత,కావలివారి వలన దేవకి ప్రసవమైన విషయం తెలిసి కంసుడు.. తే. వెండ్రుకలు వీడఁ బై చీర వ్రేలి యాడ తాల్మి కీలూడ రోషాగ్ని దర్పమాడ భూరి వైరంబుతోఁ గూడ పురిటియింటి జాడఁ జనుదెంచి యా పాపఁ జంపఁ గదియ. అంత దేవకి యడ్డంబు వచ్చి యిట్లనియె. ఉ. అన్న! శమింపు మన్న! తగ దల్లుఁడు గాఁ డిది! మేనగోడ లౌ మన్నన సేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు వోవు త్రోవఁ బో వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేఁడెదన్. క. కట్టా యార్గురు కొడుకులఁ, బట్టి వధించితివి యాఁడుఁబడు చిది కోడల్ నెట్టన చంపఁగవలెనే, కట్టిఁడివి గ దన్న! యన్న! కరుణింపఁగదే. అని ప్రార్థిస్తుంది.--అనుప్రాసంటే పోతన గారి కెంతిష్టమో భాగవతంలో అడుగడుగునా దర్శన మిస్తుంటుంది. ఈ ఘట్టంలోని కొన్ని ఇతర పద్యాలు.. కంసుడు దేవకీ వసుదేవతలతో.. క. పగతురఁ జెఱిచితి ననియును, బగతురచేఁ జెడితి ననియు బాలుఁడు తల...

నిన్ను నమ్మితి కృష్ణా!

Image
అందెలు పాదములందున సుందరముగ నుంచినావు సొంపలరంగా మందరధర! మునిసన్నుత! నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!

నిజముగ కృష్ణా!

Image
నీవే తల్లివి తండ్రివి  నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ  నీవే గురుడవు దైవము  నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!

యేటిదరి నా యెంకి

Image
నాయుడు బావ ! . యేటిదరి నా యెంకి 'యీరేతి రొక్కతేవు యే మొచ్చినావే?' 'ఆడు నే నిక్కడే ఆడినామమ్మా' 'యేటి నురగలకేసి యేటి సూసేవే?' 'మా వోడి మనసటె మరుగుతాదమ్మా' 'సెంద్రవొంకలో యేమి సిత్రమున్నాదే?' 'వొంక పోగానె మా వోడొస్తడమ్మా ఆడు నే నిక్కడే ఆడినామమ్మా మావాడి మనసటె మరుగుతాదమ్మా ఆవొంక పోగానె ఆడొస్తడమ్మా'

మదిలోని మాట !

Image
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని తల వంచుకుని నేను తెగ ఎదురుచూసాను నీ తెగువ చూడాలని చూస్తూనే వేలంత తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం.!

జయ జయ దేవ హరే ..........-జయదేవ(గీత గోవిందం) .! .

Image
జయ జయ దేవ హరే ..........-జయదేవ(గీత గోవిందం) .! . శ్రిత కమలాకుచ మండలా........ద్రుత కుండలా....ఈ కలిత లలిత వనమాల.... జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....  ||జయ జయ||  దినమణి మండల మండనా......భవ ఖండనా......ఈ మునిజన మానస హంసా  ||జయ జయ|| కాళియ విష ధర గంజనా..........జన రంజన........ఈ యదుకుల నళిన దినేశా  ||జయ జయ|| మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......ఈ సురకుల కేళి నిదానా  ||జయ జయ|| అమల కమల దళ లోచనా........భవ మోచనా.....ఈ త్రిభువన భవన నిదానా  ||జయ జయ|| జనక సుతా కృత భూషణా........జిత దూషనా......ఈ సమరశమిత దశకంఠా  ||జయ జయ|| అభినవ జలధర సుందరా.........ద్రిత మంధరా......ఈ శ్రీముఖ చంద్ర చకోరా  ||జయ జయ|| తవ చరణే ప్రణతావయా...........ఇతి భావయా.....ఈ కురు కుశలం ప్రణతేశూ  ||జయ జయ|| శ్రీ జయదేవ కవేరిదం...............కురుతేముదం.....ఈ మంగళ ఉజ్వల గీతం  ||జయ జయ|| అర్ధ్ధం : లక్ష్మీదేవి ని వక్షస్థలమునందు,కర్ణములకు కుండలాలను,మెడలో తులసిమాలను ధరించిన హరీ నీకు జయము జయము.... . ప్రచండ సూర్యునివలే ప్రకాశిస్తూ,ఆలోచనలను ఖండిస్త...

"ఈశ్వర అల్లా తేరే నామ్!మనకే !

Image
"ఈశ్వర అల్లా తేరే నామ్!మనకే ! మిగతా ధర్మాలవాళ్లు పోరబాటున కూడా "ఈశ్వర అల్లా తేరే నామ్" అని అనడంలేదు!. (Narasimha Rao Vinjamuri.గారికి కృతజ్ఞలతో.) . కొందరు సూడో హిందువులు సెక్యులర్ పేరుతో, క్రిస్టియన్, ముస్లింమతాల పోస్టింగులు, వాళ్ళవే కావచ్చు లేక, షేర్ చేసినవి కావచ్చు. వీటిని FB లో పోస్ట్ చెయ్యడం జరుగుతోంది. పరమత సహనం అంటే మన మతాన్ని ముండ మోయించుకొనడం అని కాదు.  మేజర్ మతాన్ని, మైనర్ మతాలవాళ్లు గౌరవించాలి.  మేజర్ మతంవాళ్లు మైనర్ మతలవాళ్లను కాపాడాలి.  ఇది పద్ధతి.  ఇలాకాక మనదేశంలో 20%కు మించి లేని పరమతాలవాళ్లు, హిందూ మతాన్ని సెక్యులర్ పేరుతో బ్లాక్ మైల్ చేసి, బెదిరించి రోజురోజుకూ మీరిపోతున్నారు.  దానితోపాటు మన హిందువుల్లో కొందరు(వాళ్ళు ఎలా హిందువులు అయ్యోరో నాకు తెలియదు), రోజూ పొద్దున్నలేస్తే హిందూ ధర్మాన్ని,ఆచారాలనూ, bjpని తిడుతూ, పరమతాలవాళ్ళు చేసే అన్యాయాలను చూస్తూకూడా, ఒక్కమాట ధైర్యంగా కామెంటు చేయలేని, చేతగాని, చేవ ఉడిగిన జనాలయిపోతున్నారు.  అలా చేసేవాళ్ళకంతా ఒక మనవి. మీరు మీ ధర్మాన్ని పొగడండి. లేదా మానెయ్యండి. కాకపోతే పరమతలక...

చమత్కార శ్లోకం!

Image
చమత్కార శ్లోకం! . ఏకా భార్యా ప్రకృతి రచలా, చంచలాచ ద్వితీయా  పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః శేషశ్శయ్యా ప్యుదధి శయనం, వాహనం పన్నగారిః స్మారం స్మారం స్వగృహ చరితం దారు భూతొ మురారి: . ఒకాయన ఉత్కళ దేశం లో వున్న జగన్నాథుని దర్శించాడట.  అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్య పోయాడట. ఎందుకు? సామాన్యంగా అన్ని దేవాలయాల్లో విగ్రహాలు రాతితోగానీ లోహాలతో గానీ చేయబడి వుంటాయి. ఆ దారుమూర్తిని చూసిన ఆదికవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది. అదేమంటే శ్రీ మహా విష్ణువు తన కుటుంబం లోని వారి ప్రవర్తనలు చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట. విష్ణుమూర్తికి యిద్దరు భార్యలు ఒకావిడ ఒకరు కదలకుండా వుండే ప్రకృతి (భూదేవి)ఇంకొకావిడేమో ఒకచోట ఉండకుండా మనుష్యులను మారుస్తూ తిరుగుతూ వుంటుందిట. కొడుకు చూద్దామా అంటే ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ వుంటాడు.అందర్నీ బాధిస్తూ వుంటాడు. వాడేమైనా బలంగా వున్నాడా అంటే వాడికి శరీరమే లేదు. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామా అంటే తాను నడుము వాల్చేది ఒక పెద్ద పాము మీద మెత్తగా వుంటుంది కానీ ఎంతసేపూ బుసలు కొడుతూ వుంటుంది. ఒక తలా ఏమన్న...

_సుచిత్రా సేన్!

Image
_సుచిత్రా సేన్! . సుచిత్రా సేన్ బెంగాలీ చిత్రములో వహించిన పాత్రలను  తెలుగులో సావిత్రి, హిందీలో వహీదా రహ్మాన్ పోషించారు.  దీనిని బట్టి మనము బెంగాలీ చిత్రాలను చూడకపోయినా ఆమె నటనను గురించి ఊహించుకోవడానికి అవకాశము ఉంటుంది.  ఉత్తంకుమారుతో ఆమె జోడీ హిందీలో రాజ్‌కపూర్-నర్గీస్,  తెలుగులో నాగేశ్వరరావు-సావిత్రి లాటిది. వారిరువురు నటించిన చిత్రాలను ప్రేక్షకులు అమితముగా ఆదరించారు. ఏ కళాకారులకైనా  ఆ కళను అనుభవించే రసికులు ఆదరిస్తే అంతకన్న కావలసినదేముంది? . ఆమె నటించిన కొన్ని చిత్రములను సంక్షిప్తముగా పరిశిలిస్తే  ఆమెను ఎందుకు గొప్ప నటి అంటారో మనకు తెలుస్తుంది,  కథా పాత్రల వైవిధ్యమును మనము అర్థము చేసికొనవచ్చును.  ఇందులో ఎన్నో చలన చిత్రాలు యూట్యూబులో చూచి ఆనందించవచ్చును.

“గజ క్రిమి రూపేణ ” .

Image
“గజ క్రిమి రూపేణ ” . "సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ! . తాత్పర్యం: . సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది. . ఓ సుమతీ !  సంపద యొక్క రాకడ పోకడ రెండూ కూడ అద్ఫుతంగానే ఉంటాయి.  కొబ్బరి కాయలోకి నీరు ఎలా వచ్చాయో ఆ విధంగానే డబ్బు రావడం మొదలు పెడితే తెలియకుండానే కుప్పలు తెప్పలు గా వచ్చిపడుతుంది. ఆ సమయం లో తెలివైన వాడు విచక్షణ తో జాగ్రత్త పడి దాచుకుంటాడు. అలాగే డబ్బు పోవడం మొదలు పెడితే ఏనుగు మ్రింగిన వెలగ పండు లోని గుజ్జు లాగ మాయమై పోతుంది. కాబట్టి బుద్ధిమంతుడు సరైన సమయం లో జాగ్రత్త పడి పొదుపు చేయాలి. . ‘ కరి మ్రింగిన వెలగపండు’ అనగా ‘ఏనుగు తిన్న వెలగ పండు’ అని, ఏనుగు యొక్క గొప్పదైన జీర్ణశక్తి వలన అది మ్రింగిన వెలగ పండు అలాగే ఉండి దాని లోని గుజ్జు మాయ మౌతుందని తెలుగు కవులు వ్రాశారు .  . కాని సంస్కృతం లో ‘గజ భుక్త కపిత్థవత్ ’ అని గలదు. దీనికి “గజ క్రిమి రూపేణ ” ...

చనిపోయిన పెద్దలు మనకు మరలా కలలో కనిపిస్తే వారి ఆశీస్సులు మనకు లబిస్తున్నయి అని అర్దం...

Image
చనిపోయిన పెద్దలు మనకు మరలా కలలో కనిపిస్తే వారి ఆశీస్సులు మనకు లబిస్తున్నయి అని అర్దం... మంచిదే ..బాదపడాల్సీన పనిలేదు . పరలోకాని చేరువైనా మన పూర్వికులా ఆత్మల గత జన్మ తాలుకు జ్ఞాపకాలు వారిని వీడక ఆ జన్మలో వారికి ఎవరిపై ఎక్కువ మక్కువ కలదో వారిని ఆశ్రయిస్తూ ఉంటారు వారు నిద్రలో ఉన్నప్పుడైనా లెదా మెలకువలో అయినా .. నిద్రలో అయిథే కలల రూపంలో ,, . మెలకువలో అయితే తలపుల రూపంలో వారికి జ్ఞప్తికి వస్తుంటారు .. అప్పుడు వారు తమసంబందీకులకు అందించాల్సిన అశీర్వాదాలైనా లేద సూచనలైనా తిన్నగా మెదడుకే సంకేతాలను అందిస్తారు ..ఎందుకంటే వారి ఆత్మ అపుడు చైతన్య స్తితిలో ఉండదు కనుక సూక్ష్మ రూపంలో ఉంటుంది కనుక  . ఆత్మ తాలూకు ఆత్మీయ మిత్రులందరూ కలుసుకునేది చీకటి శూన్యంలోనే  అందుకే చీకటి అవసరం ఆత్మకి ఉంటుంది వెలుతురులో ఆత్మలు ప్రసరించలేవు ..అలా చేయడం ఒక్క దివ్యాత్మలకే సాద్యం .

మహా భారత యుద్ధంలో ...ఉప పాండవులు.!

Image
మహా భారత యుద్ధంలో ...ఉప పాండవులు.! . త్రేతాయుగపు కాలంనాటి హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్షను పరీక్షించాలని విశ్వామిత్రుడు అతనిరాజ్యము, భార్య, పిల్లలు కట్టు బట్టలతో సహా వదిలి పొమ్మని ఆదేశిస్తాడు...  ఈక్రమంలో రాణిపై చేయికూడా చేసుకుంటాడు... ఆ సమయంలో పరమ వీరులయిన అయిదుగురు సైనికులు/రక్షకభటులువిశ్వామిత్రుని చర్యకు మండిపడి అతనిచర్యలను ఖండిస్తారు... దీనికి ఆగ్రహం చెందినవిశ్వామిత్రుడు మీకు ఈ జన్మలో మోక్షం రాకపోవుకాక అని శపిస్తాడు... ...  భీతిల్లిన ఆ రక్షకభటులుమునివర్యుని శాంతింపజేసి శాపానికి విరుగుడు ప్రసాదించమని వేడుకుంటారు.. శాంతించినవిశ్వామిత్రుడు మీరు వచ్చేజన్మలో ఏ బంధాలు ఏర్పడక ముందే చనిపోవుదురు, తర్వాతి జన్మలోపాండవుల పుత్రులుగా జన్మించి ఏ తప్పు చేయనప్పటికీ అశ్వథ్థామ చేతిలో నిద్రించే సమయంలోమరణించి మోక్షం పొందుతారు అని అభయమిస్తాడు...  (వారిని చంపిన అశ్వథ్థామ రహస్యం తల్లిఅయిన ఉత్తర గర్భంలో ఉన్న పరిక్షిత్తుకు (అభిమన్యుని కుమారునికి) తెలుస్తుంది...  ఈ విషయంతెలుసుకున్న అశ్వథ్థామ ఆ గర్భస్థ శిశువును హతమార్చాలని కూడా చూస్తాడట... కానీ శ్రీకృష్ణుడుకాపాడతాడని ఇంకొక కథ ...

రావోయి బంగారు మామా! (బంగారిమామ పాటలు- కొనకళ్ల వెంకటరత్నం.) .

Image
రావోయి బంగారు మామా! (బంగారిమామ పాటలు- కొనకళ్ల వెంకటరత్నం.) . రావోయి బంగారిమామా నీతోటి రహస్య మొకటున్నదోయీ నీళ్లతూరల వెన్క నిలుచున్న పాటనే జలజలల్‌ విని, గుండె ఝల్లుమంటున్నాది- రావోయి... . అవిసె పువ్వులు రెండు అందకున్నయి నాకు; తుంచి నా సిగలోన తురిమి పోదువుగాని- రావోయి... ఏటి పడవసరంగు పాట గిరికీలలో చెలికాడ మనసొదల్‌ కలబోసుకుందాము- రావోయి... https://www.youtube.com/watch?v=Cz3af36H23g

Aja sanam...

Image
Aja sanam... Wonderfull duet of  Chori Chori. For generations... this song lasts.. Nargis & Rajkapoor.

వైవాహిక జీవితం.. ఘర్షణ !

Image
వైవాహిక జీవితం.. ఘర్షణ ! . 25ఏళ్లు అయిన సందర్భంగా బెంగుళూరులో ఒక జంట పెద్ద విందు ఏర్పాటు చేసింది. జాతీయ మీడియా ప్రతినిధులు కూడా దానికి హాజరయ్యారు. ప్రెస్‌ వాళ్లు రావాల్సిన అంత విశేషం ఏముంది అంటే వారిరువురు పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఘర్షణ పడలేదు. జాతీయ మీడియాను కూడా ఈ పాయింటు ఆకర్షించింది. మొత్తానికి విందుకు వచ్చిన విలేకరులు ఆ భర్తను పదేపదే ప్రశ్నలు అడిగారు..ఒక్కసారైనా గొడవ పడకుండా ఎలా ఉండగలిగారు? ఆ రహస్యం ఏదో ప్రజలకు చెబితే సుఖసంతోషాలతో వర్థిల్లుతారు కదా అని అడిగారు. మొదట చెప్పటానికి నిరాకరించిన భర్త మొత్తం మీద ఒక ఛానెల్‌ విలేకరి వత్తిడిని భరించలేక పక్కకి తీసుకెళ్లి రహస్యం ఏంటో చెప్పసాగాడు.. ...... పాతికేళ్ల క్రితం, మా పెళ్లయిన కొత్తలో..హనిమూన్‌కు ఒక హిల్‌ సెంటర్‌కి వెళ్లాము. నా భార్య గుర్రం ఎక్కుతా అని ముచ్చటపడింది. ఇద్దరం చెరో గుర్రం ఎక్కాం. మా ఆవిడ ఎక్కిన గుర్రం ఎందుకో భయపడి కొద్ది దూరం వెళ్లాకా ఆమెను కిందపడేసింది. ఖంగుతిన్న నా భార్య గుర్రంకేసి వేలు పెట్టి చూపిస్తూ "ఫస్ట్‌ టైమ్‌" అంది. నా గుర్రం సాఫీగానే వెళ్తోంది. ఓ ఫర్లాంగు వెళ్లగానే మళ్లీ ఆ పెంకి గుర్రం ...

శక్తి పీఠాలు !

Image
            ( చిత్రం .... వైష్ణవిదేవి-జ్వాలాక్షేత్రం-హిమాచల్‌ ప్రదేశ్‌.) . శక్తి పీఠాలు ! హిందువులు ఆరాధించే దేవాలయాల్లో పురాణగాథలు, ఆధారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు.  18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. దీనికి ఒక పురాణగాథ ఉంది. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసేటప్పుడు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ కూతురు, అల్లుడిని పిలువడు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయని) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడుతుంది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలువాలేమిటి?అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రథమ గణాలను వెంట బెట్టుకుని యాగానికి వెళ్తుంది. అక్కడ అవమానానికి గురవుతుంది.  అవమాన్ని సహించలేక ఆమె యాగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్తాడు. కానీ సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మాని వేస్తాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ మృతదేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖ...