అర్జునుడు !

అర్జునుడు !

.

మహావదాన్యుడు, ఇంద్రియనిగ్రహం గలవాడు, భయంకరమైన పరాక్రమం చేత శత్రువులను తరింపజేయగలవాడు, స్వచ్ఛమైన వర్చస్సు గలవాడు, ఎవరికినీ జయింప శక్యం కానివాడు. "అవశగతి గామరోషాదివికారము లొందినను మదిని ధర్మపథప్రవిహతి గానీడు" అంటూద్రుపది ప్రశంసిస్తుంది.

.

పొందు కోరి విఫలమనోరథయైన ఊర్వశి శాపం తెలిసి దేవంద్రుడు, "నీయట్టి ధైర్యవంతుని నే యుగములనైన గాన మెన్నండును ధర్మాయత్తమతివి మునులకు నీ ఇంద్రియ జయము కీర్తనీయము తండ్రీ" అంటాడు. నీవు ధర్మాత్ముడివి. నీవంటి ధైర్యవంతుని ఏ కాలంలోనైనా చూడలేము. నీవు ఇంద్రియాలపై సాధించిన విజయం ఋషీశ్వరులు కూడా ఉగ్గడించతగింది అంటూ కొడుకును శ్లాఘించాడు. 

.

అర్జునుని స్థిరవిజయసాధనకు కర్మకౌశలము, సౌశీల్యము ముఖ్యకారణములు. సభాపర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పార్థుడి రక్షాబలం, భీముడి భుజబలం, నా నీతిబలం నీకుండగా అసాధ్యమేముంది? అని అంటాడు. 

.

పురుషకారానికి దైవబలం తోడైతే విజయం తథ్యమని ఆంధ్రమహాభారతం పార్థుని చరిత్ర ద్వారా తెలియజేస్తున్నది. 

.

మహాప్రస్థాన సమయంలో అర్జునుడు యాత్ర సాగిస్తూ తన గాండీవాన్ని వదలక వెంట తీసుకుపోతున్నాడు. జీవితంలో గాండీవం అతనికంత కీర్తి నార్జించింది. అందుచేత దాని మీద అర్జునునకంత మమకారము! చివరకు అగ్నిదేవుడు హెచ్చరించిన గాని అర్జునుడు దానిని వదలలేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!