Skip to main content
సత్యంఅనే ముత్యం !
సత్యంఅనే ముత్యం !
.
చక్కనిది దక్కనిది ఒక్కటున్నది...
నీడబ్బులకు ససేమిరా లోగను అన్నది...
ఓహో పొమ్మా నన్నది
.
కన్నతల్లీ కన్నులలో కాంతి నన్నది
చిన్ని పాప బోసి నవ్వు తానే అన్నది
సాటి ఏలేనిది .. సత్యంఅనే ముత్యం అది..
.
కన్నె పిల్ల నిగ నిగలో నిలిచి వున్నది
కోకి లమ్మ పాటలో హాయినన్నది
సాటి ఏలేనిది .. సత్యంఅనే ముత్యం అది.
.
నివురు గప్పిన నిప్పు లో దాగి ఉన్నది .
స్వర్గ నరక లోకాలకు మధ్య నున్నది .
సాటి ఏలేనిది .. సత్యంఅనే ముత్యం అది.
.
సాటి ఏలేనిది .. సత్యంఅనే ముత్యం అది.
.
చక్కనిది దక్కనిది ఒక్కటున్నది...
నీడబ్బులకు ససేమిరా లోగను అన్నది...
ఓహో పొమ్మా నన్నది .
.
(రేపు నీదే -1957 " సినిమాలో , జిక్కి)
Comments
Post a Comment