మను చరిత్రము అరుణాస్పదపుర వర్ణనము!

మను చరిత్రము 

అరుణాస్పదపుర వర్ణనము!

మ. వరణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం

బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ

హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌

బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌.

.

ప్రవరుని సౌశీల్యాది ప్రశంస!

(

ఉ. ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా

షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ

క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా

ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై.

.

సీ. తీర్థసంవాసు లేతెంచినారని విన్న, నెదురుగా నేఁగు దవ్వెంతయైన,

నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ, దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు,

నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయు, జేసి గూర్చున్నచోఁ జేరవచ్చు,

వచ్చి యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి, త్తీర్థమాహాత్మ్యముల్‌ దెలియ నడుగు, 

తే. నడిగి యోజన పరిమాణ మరయు నరసి

పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు

ననుదినము తీర్థసందర్శనాభిలాష

మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి.

.

ప్రవరుని స్వగ్రామం అరుణాస్పద పురము.

అరుణాస్పద పురము వరణ నది ప్రక్కన గలదు.)

.

వరూథిని ఒక అప్సరస.

మాయాప్రవరాఖ్యుడు ఒక గంధర్వుడు.

వరూథిని, మాయప్రవరాఖ్యుల కుమారుడు “ స్వరోచి “.

ఇందీవరాక్షుడి (రాక్షసుడిలా మారుతాడు) కూతురు “ మనోరమ “.

.

ఈ ప్రబంధం శ్రీ కృష్ణ దేవరాయలకు అంకితము.

స్వరోచి భార్యల పేర్లు

భార్యల నుండి గ్రహించిన విద్యలు

మనోరమ

( ఇందీవరాక్షుడి కూతురు )

అస్త్రహృదయ విద్యను

ఈమె నుండి పొందుతాడు

.

కళావతి

( పారుడి కూతురు )

పద్మినీ విద్యను

ఈమె నుండి పొందుతాడు

.

వభావసి

( మందారుడి కూతురు )

జంతువులు పక్షుల భాషలు తెలుసుకునే

విద్యను ఈమె నుండి పొందుతాడు

తొలి పద్యం

శార్థూలం.

“ శ్రీ వక్షోజ కురంగనాభ మొదపైఁ జెన్నొంద విశ్వంభరా

దేవిం దత్కమలా సమీపమునఁ బ్రీతి న్నిల్పినాఁ డో యనం

గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోచు రా

జీవాక్షుండు గృతార్థుఁ జేయు శుభదృష్టిం గృష్ణరాయాధిపున్”.

చివరి పద్యం

వనమయూరము.

“ రాజపరమేశ ! ఫణి రాజబల ! పుల్లాం

భోజముఖ ! భోజముఖ భూప ! విపులాంసో

త్తేజిత ధరాభరణ దీక్షితభుజా ! ని

ర్వ్యాజభయదాజి విజితార నృపరాజీ !”.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!