అగ్రహారం!

అగ్రహారం!

.

అగ్రహారం అనే పదం చాలా గ్రామనామాలకు ఉత్తరపదంగా ఉంటుంది. బ్రాహ్మణులకు వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, వారి విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు. అలాంటి గ్రామాలను అగ్రహారమని పిలుస్తారు. అగ్రహారం అనే పదం అనుబంధంగా ఉండే గ్రామాలు ఈ కింది విధంగా ఉన్నాయి

పురుష నామసూచి: అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం పురుషనామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఎవరి పేరున ఐతే అగ్రహరం నామం ఏర్పడిందో వారికే ఆ అగ్రహారం దానంగా లభించిందని ప్రతీతులు ఉండడం కద్దు.

ఉదాహరణలు: లింగరాజు అగ్రహారం, శంకర అగ్రహారం, సూరన అగ్రహారం, లింగన అగ్రహారం.

కుటుంబ నామసూచి: అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం కుటుంబ నామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. గ్రామనామం ఏర్పడిన కుటుంబీకులు అగ్రహారాన్ని అనుభవించేందుకు దానం లభించినవారయ్యే అవకాశాలు ఎక్కువ.

ఉదాహరణలు: వేదంవారి అగ్రహారం, మధ్వపతివారి అగ్రహారం.

కులసూచి: కొన్ని అగ్రహారాలకు పూర్వపదంగా కులాల పేర్లు ఉన్నాయి.

ఉదాహరణలు: గొల్ల అగ్రహారం

గ్రామనామ సూచి: కొన్ని గ్రామనామాల్లో అగ్రహారం అనే పదానికి పూర్వపదంగా గ్రామనామాలు ఉన్నాయి. ఊరిపేరులో పూర్వపదంగా ఉన్న గ్రామనామం పక్కన కొత్తగా అగ్రహారం ఏర్పడడమూ, ఆ గ్రామం దగ్గరి/యొక్క అగ్రహరం అన్నట్టుగా సూచించేందుకు ఇలాంటి పేర్లు ఏర్పడుతూంటాయి. ఉదాహరణకు బొమ్మవరం అగ్రహారం అనే గ్రామనామంలోని బొమ్మవరం అనే పదం పూర్వపదంగా ఉంది. బొమ్మవరం గ్రామానికి చేరి ఉన్న ప్రదేశాన్ని జమీందారు/రాజు ఒక పండితునికి దానం చెయ్యగా అక్కడ ఏర్పడిన అగ్రహారానికి బొమ్మవరం అగ్రహారం అనే పేరు వచ్చిందని చెప్తారు.

ఉదాహరణ: బొమ్మవరం అగ్రహారం, రామాపురం అగ్రహారం.

స్థలనామ సూచి: అగ్రహారానికి పూర్వపదం స్థలనామాన్ని సూచిస్తూండేలా ఏర్పడిన గ్రామనామాలు ఉన్నాయి.

ఉదాహరణ: అత్తితోట అగ్రహారం, నడిమిగడ్డ అగ్రహా

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.