*కాశీ విశ్వనాధుని* కే *అక్షరాంజలి*

తెలుగు వారు *ఆత్మగౌరవానికి* ప్రతీకలని *ప్రైవేట్ మాష్టారు* గా చెపుతూ, *ఉండమ్మా బొట్టు పెడతా*అంటూ ఆ బొట్టు *కలసి వచ్చిన అదృష్టమని* 

*నిండు హృదయాల*తో ఉంటే 

*చిన్ననాటి స్నేహితులే* 

చుట్టరికం తో *చెల్లెలి కాపురం* కై ఓ అన్న, వారు *నిండుదంపతులై* వర్ధిల్లాలని ఆశించి, కుదరనపుడు అదే *నేరము శిక్ష* గా మారి

*శారద* జీవితం నుండీ *అమ్మమనసు* ని చూపి

ఓ *సీతకథలో* , ఆమే 

*జీవనజ్యోతి* యి నడయాడి 

*మాంగల్యానికి మరోముడి* వేసి

*కాలాంతకులు* అని చెప్పడానికి *పేర్లను ప్రెసిడెంటు* చేసి ఆపై 

*కాలం మారింది* అని చెప్పడానికి 

*సీతామాలక్ష్మి* సినీ జీవిత గాథ ని

*సిరిసిరిమువ్వల* సవ్వడి నీ 

*శుభోదయం* గా అందించి 

అందుకని వారికి *అల్లుడు పట్టిన భరతం* లా 

పాశ్చాత్య నాగరికత పెను తుఫాను రెప రెప లాడుతున్న శాస్త్రీయ సంగీతానికి శాశ్వతత్వం మరల తీసుకు రావడానికి ముఖ్యమైన క బలమైన కారణం గా *శంకరాభరణాన్ని* అర్పించి 

ఏడు జన్మల *సప్తపది* అంటూ 

*శుభలేఖ* రాసి అవి అన్నీ

*సాగరసంగమం*గా పరిణమిస్తే 

మన *జానీ జన్మభూమి* ని గుర్తుకు తెస్తే, మన మనస్సు 

*స్వాతిముత్యమై* 

*సిరివెన్నెలని* కురిపిస్తే 

*శృతిలయలై*, 

*స్వయంకృషి* వల్లనే సాధ్యమని

అపుడు వికసించిన *స్వర్ణ కమలం*, అద్భుతమైన 

*స్వాతి కిరణ మై* భాసిస్తుందని 

చెప్పే *ఆపద్భాధవుడే*

*శుభసంకల్పం* చేస్తే 

*చిన్న అబ్బాయి* పుట్టి పాడితే 

అది *స్వరాభిషేకం* అయి 

*శుభప్రదమై* ఇంటింటా 

*విశ్వనాధ* కవితా 

అది విరులతేనె చినుకై 

వచ్చే దాదాసాహెబ్ అవార్డు మా 

*కాశీ విశ్వనాధుని* కే 

ఈ *అక్షరాంజలి* అంకితం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!