వైవాహిక జీవితం.. ఘర్షణ !

వైవాహిక జీవితం.. ఘర్షణ !

.

25ఏళ్లు అయిన సందర్భంగా బెంగుళూరులో ఒక జంట పెద్ద విందు ఏర్పాటు చేసింది. జాతీయ మీడియా ప్రతినిధులు కూడా దానికి హాజరయ్యారు. ప్రెస్‌ వాళ్లు రావాల్సిన అంత విశేషం ఏముంది అంటే వారిరువురు పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఘర్షణ పడలేదు. జాతీయ మీడియాను కూడా ఈ పాయింటు ఆకర్షించింది. మొత్తానికి విందుకు వచ్చిన విలేకరులు ఆ భర్తను పదేపదే ప్రశ్నలు అడిగారు..ఒక్కసారైనా గొడవ పడకుండా ఎలా ఉండగలిగారు? ఆ రహస్యం ఏదో ప్రజలకు చెబితే సుఖసంతోషాలతో వర్థిల్లుతారు కదా అని అడిగారు. మొదట చెప్పటానికి నిరాకరించిన భర్త మొత్తం మీద ఒక ఛానెల్‌ విలేకరి వత్తిడిని భరించలేక పక్కకి తీసుకెళ్లి రహస్యం ఏంటో చెప్పసాగాడు..

......

పాతికేళ్ల క్రితం, మా పెళ్లయిన కొత్తలో..హనిమూన్‌కు ఒక హిల్‌ సెంటర్‌కి వెళ్లాము.

నా భార్య గుర్రం ఎక్కుతా అని ముచ్చటపడింది. ఇద్దరం చెరో గుర్రం ఎక్కాం. మా ఆవిడ ఎక్కిన గుర్రం ఎందుకో భయపడి కొద్ది దూరం వెళ్లాకా ఆమెను కిందపడేసింది. ఖంగుతిన్న నా భార్య గుర్రంకేసి వేలు పెట్టి చూపిస్తూ "ఫస్ట్‌ టైమ్‌" అంది. నా గుర్రం సాఫీగానే వెళ్తోంది.

ఓ ఫర్లాంగు వెళ్లగానే మళ్లీ ఆ పెంకి గుర్రం నా శ్రీమతిని ఒక్క ఉదుటున కిందకి తోసేసింది.

కోపంతో ఆమె గుర్రం కేసి చూపుడు వేలు చూపిస్తూ "సెకండ్‌ టైమ్‌" అంది. ఇంక హోటల్‌కి కిలోమీటరు దూరంలో ఉన్నాం..10నిముషాల్లో వెళ్లిపోతాం అనగా మరోమారు ఒక్క గెంతు గెంతిని గుర్రం మా ఆవిడ్ని కిందకి విసిరేసింది. ఆవేశంతో ఊగిపోయిన నా భార్య "థర్డ్‌ టైమ్‌" అంటూ పర్సులో నుంచి తుపాకి తీసి దానిపై బులెట్ల వర్షం కురింపించి చంపేసింది.

అది చూసి నా మతిపోయింది. ఎంతైనా మూగజీవం కదా! దానికేం తెలుస్తుంది. కోపం వచ్చి నా భార్యను "నీకేమైనా మెంటాలా? సైకోవా నువ్వేమైనా? కొద్దిగ కూడా కనికరం లేదా నీకు యూ ఫూల్‌" అని తిట్టేశాను.

వెంటనే నా భార్య తన చూపుడు వేలు నాకేసి తిప్పి "ఫస్ట్‌ టైమ్‌" అంది.

అంతే ఇంక నా వైవాహిక జీవితంలో ఇప్పటిదాకా గొడవల్లేవన్నాడా ఆదర్శ భర్త. 😉😂

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!