మణి ..కడియంలో ఉంటే యేమిటి? ..పేటలోఉంటే యేమిటి?

తిరుపతి వెంకట్ కవులు !

మణి ..కడియంలో ఉంటే యేమిటి? ..పేటలోఉంటే యేమిటి?

....

ఆ జంట కవుల పూర్తి నామధేయములు దివాకర్ల తిరుపతి శాస్త్రి, 

చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

దివాకర్లవారిది పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం తాలూకా, ఎండ గండి గ్రామం.

తల్లిదండ్రులు:-శేషమ - వేంకటావధాని.

ప్రజోత్పత్తి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమీ బుధవారం జననం.(1872).

.

చెళ్ళపిళ్ళ వారిది తూర్పు గోదావరి జిల్లా,ధవళీశ్వరం సమీపమున గల కడియము గ్రామం.

తల్లిదండ్రులు:- చంద్రమ్మ - కామయ్య.

ప్రమోదూత నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశీ సోమ వారం.(1870)

.

ఈ జంట కవులు నర్మోక్తులతో, హాస్య సంభాషణతో, చతుర వచో విలాసంతో, సభాసదులను ఆనంద పరవశుల్ని చేసే వారు. 

వాగ్గాంభీర్యంతో ప్రత్యర్థుల్ని అవాక్కయేలా చేసేవారు. 

సరస సంభాషణలో కూడా వీరుతక్కువవారేంకాదు.

.

ఒకపర్యాయం వీరు .మండపేటలో కళాభిజ్ఞత, లోకజ్ఞత, రసజ్ఞత గల 

" మణి " అనఁబడే వేశ్యను చూచి, ఆమె చేసిన నాట్యాన్ని చూచారు.

చాలా సంతోషింఛారు. అభినందించారు.

.

అంతటితో ఊరుకోక ఆమెతో కొంటెగా " మణి మామూలుగా 

ఉండే కంటే " కడియం " లో ఉంటే సార్థకత లభిస్తుంది. 

శోభస్కరంగా ఉంటుంది. అన్నారు.

(వారిది కడియం గ్రామమేకదా! అక్కడుంటే--- ఊఁ ----అన్ని విధాలా చాలా బాగా ఉంటుందని వారి నర్మ గర్భ సంభాషణా సారాంశం.)

.

వెంటనే ఆమె ఆకవులతో చమత్కారం ఉట్టిపడేలాగా సమాధానం చెప్పి వారిని మరింత మెప్పించింది.

ఏమందో చూడండి.

"మహాకవులు మీకు తెలియని దేముంది? 

స్వచ్ఛమైన మణి (ఆమె నిర్మల అన్న మాట.)కడియంలో ఉంటే యేమిటి? పేటలో(మండపేట, ఆమె నివాస గ్రామం) ఉంటే యేమిటి?

.

వెంకట శాస్త్రిగారి చతురతకు దీటైన చతురతనామె కనఁబరచింది కదూ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!