గజేంద్రుని దీనాలాపము-తత్వవిశ్లేషణ. !

గజేంద్రుని దీనాలాపము-తత్వవిశ్లేషణ. !

.

-ఉ

"ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; 

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.!

భావము:

ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; 

ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.

.

తత్వవిశ్లేషణ...

.

తత్వవిచారణాక్రమంలో యీపద్యం చాలా విలువైనదీ, ముఖ్యమైనది. 

ఒక దాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే దాన్నిఎన్నికోణాల్లోంచి, ఎన్నివిధాలుగా ప్రశ్నించి పరిశీలించాలో యీ పద్యంలో పోతనగారు చెప్పారు. 

ఆయన స్వయంగా ఒకయోగి. యోగ తత్వరహస్యాలెన్నింటినో ఆయన భాగవతంలోచొప్పించారు.

.

ప్రస్తుతంయీపద్యాన్నినాలుగుముక్కలుగావిడదీసుకోవాలి.

మొదటిది ప్రశ్నా భాగం.

రెండవది ఒక్క "వానిని" అన్న మాట మాత్రమే. 

మూడవది "ఆత్మభవునీశ్వరు".

మిగతాది నాల్గవది.

పోతనగారు ఇక్కడ మంచిగమ్మత్తు చేసారు. ముందర మనకి ఎలాప్రశ్నలు వేయాలో నేర్పారు. 

తర్వాత ఆప్రశ్నలు వేసుకొని, వాటికి సమాధానాలు రాక మనం ఇబ్బందులు పడతామని గ్రహించి, "వానిని" అంటే ఆ ప్రశ్నలకు సమాధానమైన వానిని అని, మళ్లీ వాడెక్కడ ఉన్నాడో తెలియక కలవరపడతామని, "ఆత్మభవుని" అంటే మనఆత్మలోనే, మనకు చాలాదగ్గరలోనే ఉన్నాడని విశదీక రించారు. చూసారా!

.

తత్వవిచారణాపధ్ధతిలో యీపద్యాన్ని అనుసరించినట్లయితే, పరబ్రహ్మస్వరూప జ్ఞానం కోసం ఏవిధమైన పరిశోధన జరపాలి, వాడెక్కడవున్నాడు, వాడిని పట్టుకోవాలంటే ముందర దేన్ని తెలుసుకొని దర్శించాలి, దేన్నిపట్టుకొంటే ఆపరమాత్మ దొరుకుతాడు మొదలైన విషయాలన్నీ చాలా తేలికగా తెలుస్తాయి. ఇదీ పోతనగారి గొప్పతనం.గజేంద్రుడి మిషతో మనకు ఇంతటి గొప్ప విషయ పరిజ్ఞానాన్ని అందించారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!